Suryaa.co.in

Telangana

నలుగురు బిజెపి ఎంపీలు ఏం చేస్తున్నారు?

– పీయూష్ వ్యాఖ్యలతో రైతుల్లో మరింత గందరగోళం
– రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్

పీయుష్ గోయల్ వ్యాఖ్యలు రైతులను గందరగోళంలోకి నెట్టాయి.ఢిల్లీ వెళ్లిన రాష్ట్ర బిజెపి నేతలు రాష్ట్ర ప్రయోజనాల గురించి ఏమైనా మాట్లాడారా? అప్పర్ భద్ర ప్రాజెక్ట్ కు జాతీయ హోదా ఇచ్చేందుకు క్లియరెన్స్ అయింది. నలుగురు బిజెపి ఎంపిలు ఏం చేస్తున్నారు? తెలంగాణలో ఒక్క ప్రాజెక్ట్ కు అయినా జాతీయ హోదా ఇప్పించారా?

కేసీఆర్ ను ఎలా గద్దె దింపాలని మాట్లాడటానికి ఢిల్లీ వెళ్ళారా? ఏపీలో పోలవరానికి 40 వేల కోట్ల రూపాయలు ఇస్తున్న కేంద్రం తెలంగాణ ప్రాజెక్ట్ లకు ఎందుకు ఇవ్వరు? బిజెపికి అధికారకాంక్ష తప్ప తెలంగాణ ప్రజల పట్ల చిత్తశుద్ధి లేదు.సీఎం కేసీఆర్ వరి వేయద్దంటే బండి సంజయ్ వరి వేయాలని అంటాడు. కేంద్ర మంత్రి వద్ద వరి వేయాలని బండి సంజయ్ మాట్లాడితే నాలుక మీద వాత పెడుతారు. యాసంగి వడ్లు కొంటామని లిఖితపూర్వకంగా ఇవ్వాలి.

తెలంగాణ మంత్రులు యాసంగి పంట కోనుగోలుపై చర్చ
వానకాలం పంటపై అందరికి స్పష్టత ఉంది. కేంద్ర మంత్రి సమస్యను తప్పుదోవ పట్టిస్తున్నారు. యాసంగి లో అన్ని పారాబైల్ద్ రైస్ చేస్తున్నాం. బీజేపీ నేతలు ఢిల్లీలో తెలంగాణా రైతుల గురించి ఏమి మాట్లాడలేదు.కేసీఆర్ ను గద్దె దించడం ఎలా అని చర్చించారు….రాజకీయం చెయ్యాలని నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రానికి జాతీయ ప్రాజెక్టు కోసం బీజేపీ ఎంపీ లు ఎందుకు అడగరు?ఇతర రాష్ట్రాల్లో ప్రాజెక్టులకు జాతీయ హోదా ఇస్తున్నా తెలంగాణకు ఎందుకు ఇవ్వడం లేదు? ఎవరికి అధికారం ఇవ్వాలి ప్రజలు నిర్ణయిస్తారు. బీజేపీ నేతలకు అధికార కాంక్ష తప్ప ప్రజా సమస్యలు పట్టలేవు. మరో రెండు రోజులు ఢిల్లీలో మంత్రులు ఉండాలని కేంద్ర మంత్రులు సమాచారం ఇచ్చారు.

LEAVE A RESPONSE