Suryaa.co.in

Telangana

షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి?

– కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి
– కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారు
– ఎంఎంటీఎస్ ట్రైన్ లో అత్యాచార యత్నం నుండి తప్పించుకోవడానికి ట్రైన్ లో నుండి దూకిన బాధితురాలిని గాంధీ ఆస్పత్రిలో మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తో కలిసి పరామర్శించిన మాజీమంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి

హైదరాబాద్: ఎంఎంటీఎస్ ట్రైన్ లో బాధితురాలపై అత్యాచారం యత్నం జరిగింది. రాష్ట్రంలో మహిళలకు భద్రత కరువైంది. మహిళ కోచ్ లోకి నిందితుడు ప్రవేశించి అత్యాచారం యత్నం చేశాడు. ఆగంతుకుడు నుండి తప్పించుకునేందుకు బాధితురాలు ట్రైన్ నుండి కిందకు దూకింది.

అమ్మాయికి గాయాలు పాలై చికిత్స జరుగుతుంది. బస్సులో , ట్రైన్స్ లో కూడా మహిళలు భద్రత కరువైంది. మహిళలు పై అత్యాచారం కేసులు, క్రైమ్ రేట్ 22 శాతం పెరిగినట్లు నివేదికలు చెబుతున్నాయి. మహిళల భద్రత పై రాష్ట్ర పోలీసులు చర్యలు తీసుకోవాలి. బాధితురాలను ప్రభుత్వం ఆదుకోవాలి.

రాష్ట్రంలో షీ టీమ్స్ ఏమి చేస్తున్నాయి? కమాండ్ కంట్రోల్ సెంటర్ ను రాజకీయ వేదిక చేశారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ పోలీసులకు వదిలేయాలి. లక్ష కెమెరాలు కమాండ్ కంట్రోల్ నుండి పర్యవేక్షణ చేయవచ్చు. కానీ సెక్రటేరియట్ లో జరగాల్సిన కార్యకలాపాలు కమాండ్ కంట్రోల్ లో చేస్తున్నారు. కమాండ్ కంట్రోల్ ను పోలీసులకు కి అప్పగించి, శాంతి భద్రతలు కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.

LEAVE A RESPONSE