Suryaa.co.in

Political News

చంద్రబాబు చేసింది కలిపే రాజకీయాలు

” పరిటాల” & “జేసీ” ఫామిలీ, “అది నారాయణ రెడ్డి ” & “రామ సుబ్బారెడ్డి ” “గంటా” & “అయ్యన పాత్రుడు”  లాంటి ఫార్ములా లు. జస్ట్ సోషల్ మీడియా లో కూర్చుని మనం రాయటం కాదు ,క్షేత్ర స్థాయి లో తరాల నుంచి కత్తులు దూసుకున్న కార్యకర్త లని ఒకే జండా కిందకి తీసుకురావటానికి చేసే ప్రయత్నం అది. అలాంటిదే తన రాజకీయ పునాదులని పణం గా పెట్టి మరీ, ఆంధ్ర కి సపోర్ట్ చేయని మోడీ కి ఎదురు తిరిగి (Save Nation Save Democracy ) కాంగ్రెస్ తో కలసి వెళ్ళాలి అని తీసుకున్న నిర్ణయం.

దేశ ఆర్ధిక వ్యవస్థ కుంటుతుంది. మోడీ 2 టర్మ్ లో ఇప్పటిదాకా 15లక్షల కోట్లు + ఇన్వెస్టర్ల సొమ్ము ఆవిరి అయింది అని గణాంకాలు. ఇన్వెస్టర్ల కి మన ఆర్థిక వ్యవ్యస్థ పై నమ్మకం పోతే, పెట్టుబడి ఎవరు పెడతాడు? దేశం ఎలా అభివృద్ధి చెందుతుంది ? ఎన్ని తరాల పాటు ఇంకా అభివుద్ది చెందే దేశం గా చెప్పుకుంటాం ? కానీ ప్రతీ ఎన్నికల సభలో మోడీ , షా లు వ్యక్తపరిచే దేశభక్తి వల్ల మాత్రమే దేశ అభివృద్ధి సాధ్యం కాదు కదా.

అలాగే తెలంగాణ లో చంద్రబాబు జమానా లో వేసిన పునాదుల బలం వల్లే, ఇప్పుడు హైదరాబాద్ లో అంత ఆర్థికవృద్ధి జరిగింది. అది స్వయానా కెసిఆర్ & కేటీర్ వివిధ సంధర్భాల్లో ఒప్పుకున్నారు. అదే ఇప్పడు తెలంగాణ కి ఆయువుపట్టు. అలాంటి పటిష్టమైన ఆర్ధికవనరులని ఆంధ్రాకి అందించటమే కాక, తనని నమ్మి ముందుకు వచ్చి తరతరాలు గా వస్తున్న 33వేల ఎకరాల ని, అమరావతి కి ఇచ్చిన రైతులకి కూడా అదే చెప్పాడు “మీరు పారిశ్రామికవేత్తలై మీ కుటుంబానికి , ప్రాంతానికి , రాష్ట్రానికి సేవలు చేయాలి అని “.

ఇప్పుడు చంద్రబాబు& ఫ్యామిలీ ని.. జగన్ రెడ్డి & భజన బ్యాచ్ ట్రోల్ చేయటం వల్ల , చంద్రబాబు కి పోయేది ఏమీ లేదు అన్నది 100% నిజం. గత 35 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం ఉండి ఉంటే కనీసం ఒక “ఇన్వెస్టర్ సమ్మిట్” అయినా జరిగేది , కియా , APP లాంటి స్థాయి ఇన్వెస్ట్మెంట్ వచ్చిఉండేది. ఇప్పటికే 70% పూర్తి ఐన పోలవరం ఇంకో 25-30% ఐన పురోభివృద్ధి చెందేది. అమరావతి కట్టడాలు ముందుకు సాగేవి. కరెంట్ కష్టాలు ఉండేవి కాదు.

మరీ ముఖ్యంగా చంద్రబాబు హయంలో అమలు చేసిన, అనేక సంక్షేమ కార్యక్రమాలతో పాటు, మౌలిక సదుపాయాలు ఇంకా అభివృద్ధి చెందేవి. ఇప్పుడు లాస్ అయింది చంద్రబాబు కాదు, “ఆంధ్ర” అన్నది నిజం. చంద్రబాబు కి అధికారం కొత్త కాదు , ప్రతిపక్షం కొత్త కాదు. సంపద సృష్టించటం కొత్త కాదు , కింద పడి లేవటం కొత్త కాదు.

– కిలారి వెంకటేశ్వర్లు

LEAVE A RESPONSE