జగన్ పాలనలో రాష్ట్రంలో రోజుకో హత్య గంటకో అత్యాచారం

– ఆడపడచులపై జరుగుతున్న అఘాయిత్యాలు జగన్ రెడ్డికి కనిపించవా
– వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ ఛైర్ పర్సనా.. జగన్ రెడ్డి కమిషన్ ఛైర్ పర్సనా?
– ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ రెడ్డికి.. ఆత్మగౌరవ సభలు పెట్టే అర్హత లేదు.
– వైసీపీ నేతలవన్నీ గంట, అరగంట సభలే తప్ప.. ఆత్మగౌరవమూ, ఆత్మాభిమాన సభలు కానే కాదు
– తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ

జగన్ పాలనలో రాష్ట్రంలో రోజుకో హత్య గంటకో అత్యాచారం జరుగుతున్నా చర్యలు శూన్యమని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

జగన్ రెడ్డి మూడున్నరేళ్ల పాలనలో రాష్ట్రంలో 6000 మందికిపైగా మహిళలలు అత్యాచారాలు, హత్యలకు గురయ్యారు. అయినా మహిళా కమిషన్ ఎక్కడా ఎప్పుడూ స్పందించిన దాఖలాల్లేవు. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో మహిళల విషయంలో మాట్లాడే వారిపై కేసులు పెట్టాలంటూ డీజీపీకి లేఖ రాయడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది.

సీఎం సొంత జిల్లాలో మహిళలను కాపాడుకోలేకపోతున్నారు. గతంలో పులివెందులలో జరిగిన నాగమ్మ అనే మహిళను అత్యాచారం చేసి బండ రాళ్లతో హత్య చేశారు. వారిని పరామర్శిచేందుకు వెళ్లిన టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. సీఎం జిల్లాలోనే మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పైగా పరామర్శిస్తే కేసులా? ఇదెక్కడి చట్టాలు? నిజాలు ఎన్నిరోజులు దాస్తారు? ప్రొద్దుటూరులో ఓ దళిత బాలికపై 10 మంది మృగాళ్లు దారుణంగా అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ కేసును ఇంతవరకు తేల్చలేదు.

అనూష కేసు, సంజనా కేసు ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత లిస్టు ఉంది. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే వారం రోజుల్లోనే ఆరు కేసులు జరిగాయంటే పోలీసు వ్యవస్థ ఎలా ఉందో, జగన్ పరిపాలన ఎలా ఉందో తెలుస్తోంది. సీఎం సొంత జిల్లాలోని బద్వేల్ నియోజకవర్గంలో పది రోజుల్లో 6మంది యువతులు అదృశ్యమయ్యారు. వారిలో ఇద్దరు చనిపోయారు. అయినా జగన్ రెడ్డిలో గానీ ప్రభుత్వంలో గానీ కనీస స్పందన లేదు. చనిపోయిన ఇద్దరిలో ఒక రైతు కుటుంబానికి చెందిన అమ్మాయి అనూష కాలేజీకి అని వెళ్లింది.

అక్కడ నుంచి మహేశ్వర్ రెడ్డి అనే అబ్బాయి బర్త్ డే పార్టీ అని తీసుకెళ్లి ఏం చేశారో పెన్నా నదిలో శవమై దొరికింది. అనూషాది హత్య అని స్పష్టంగా తెలుస్తున్నా పోలీసు అధికారులు ఆత్మహత్య అంటున్నారు. మహేశ్వర్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదంటున్నారు. హత్యలో మహేశ్వర్ రెడ్డికి సంబంధం లేనప్పుడు అతనిపై 306 కేసు ఎందుకు పెట్టారు? అనూషది ఆత్మహత్య అని ఎస్పీ ఎలా నిర్ధారించారు.? మహేశ్వర్ రెడ్డిని ఎందుకు రిమాండ్ కు పంపారు. పోలీసులు నిజాలు బయటికి చెప్పాలి. ఈ హత్య కేసులో మహేశ్వర్ రెడ్డితో పాటు మరో ఐదుగురు ఉన్నారని స్థానికులు, అనూష కుటుంబం చెబుతున్నా పోలీసులు వక్ర భాష్యం చెప్తున్నారు.

అనూష హత్య కేసుపై మీడియాలో మాట్లాడడానికి వీల్లేదని పోలీసులు హెచ్చరించడం ఎవరిని కాపాడడం కోసం.? బాధిత కుటుంబాన్ని పరామర్శించే వాళ్ళని అడ్డుకుంటున్నారు. ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడుతున్నారు. హత్యకు గురైన అనూషా తల్లిదండ్రులదే తప్పు అనేలా ఎమ్మెల్యే సుధ మాట్లాడుతున్నారు. అనూష హత్య కేసులో రాజకీయ ప్రమేయం ఉందని స్థానికులతో పాటు ప్రజలంతా చెబుతున్నారు. అయినా.. పోలీసులు, రాజకీయ నాయకులు వెనకేసుకురావడం ఎవరిని కాపాడడం కోసం?

దిశ చట్టంవల్ల మహిళలకు ఎటువంటి న్యాయం జరగడంలేదు. హోంమంత్రి గోరంట్ల మాధవ్ పై ఎందుకు చర్యలు తీసుకోలేదు? హోంమంత్రి గోరంట్ల మాధవ్ కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామనడం సిగ్గుచేటు. దరిద్రాన్ని చూశాక చర్యలు తీసుకొమ్మని చెప్పకపోకపోవడం అన్యాయం. వాసిరెడ్డి పద్మ మహిళా కమిషన్ ఛైర్ పర్సనో జగన్ కమిషన్ ఛైర్ పర్సనో తెలియడంలేదు. మహిళలపై దాడులకు పాల్పడుతున్నవారిపై కేసులు వద్దంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలు గంట? అరగంట అని మాట్లాడేవారిపై కేసులు వద్దా?

మహిళా కమిషన్ అనే పేరు తీసేసి జగన్ కమిషన్ అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. చంద్రబాబునాయుడు, లోకేష్, పవన్ కల్యాణ్ లకు నోటీసులు ఇవ్వడానికి ఉన్న ఉత్సాహం ఆడపిల్లలు అన్యాయాలకు గురౌతున్నవారిపై మాట్లాడడానికి బయటికి రావాలి. 6 వేలకు పైగా కేసులు జరిగాయి. ఎన్నికేసుల్లో మీ దిశ చట్టం ఉపయోగించి మీ మహిళా కమిషన్ తరపు నుంచి ఎంతమందికి శిక్ష వేశారు? 21 రోజుల్లో శిక్ష అన్నారు, ఏదీ? ముగ్గురికి ఉరిశిక్ష అన్నారు. ఆ ముగ్గురు ఏమయ్యారు? ఫొటోలు చూపిస్తే ఆ ఫొటోలకు చెప్పుల దండలు వేసి… మరొకరు ఆ విధంగా చేయకుండా పోరాటం చేస్తాం.

అమ్మాయిలపై జరుగుతున్న అత్యాచారాలు, అఘాయిత్యాతో పాటు.. ధరల పెంపు, పన్నుల బాదుడును కూడా సామాన్యులపై జరుగుతున్న ధరల అత్యాచారంగా భావిస్తున్నాం. పెట్రోల్, డీజిల్, వంటగ్యాస్, కరెంటు బిల్లులు చూసి ఎలా బతకాలా అని పేదలు ఆవేదన చెందుతున్నారు. కడుపు కాల్చుకుని వారికి పన్నులు చెల్లించాల్సి వస్తోంది.

బాధితుల వద్దకు వెళ్లి మాట్లాడినవారిని కూడా స్టేషన్ కు రమ్మంటున్నారు. మీడియావారు సిద్ధవటం వెళ్లి మాట్లాడి వచ్చినందుకు వారిని స్టేషన్ కు రావాల్సిందిగా నోటీసు పంపారు. ఈ విషయాలన్నీ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ప్రతిపక్ష పార్టీ నాయకులు, టీడీపీ నాయకులు, ఏం మాట్లాడినా తప్పే అనడం జగన్ రెడ్డ అరాచకానికి నిదర్శనం. జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్పాల్సిన సమయం ఆసన్నమైంది.

రాష్ట్రంలోని ఆడపిల్లల ఆత్మగౌరవాన్ని కాపాడలేని జగన్ రెడ్డి.. ఉత్తరాంధ్ర ఆత్మగౌరవం, రాయలసీమ ఆత్మగౌరవం అంటూ సభలు పెట్టడం ఆశ్చర్యంగా ఉంది. వైసీపీ నేతలవన్నీ గంట, అరగంట సభలే తప్ప.. ఎవరికీ ఆత్మగౌరవమూ లేదు. ఆత్మాభిమానమూ లేదు. ఇప్పటికైనా జగన్ రెడ్డి ఆడపిల్లల్ని కాపాడే ప్రయత్నాలు చేయాలి. చేయకపోతే ప్రతిపక్షంలో ఉన్నమేము ఉద్యమిస్తాం. అనూష కుటుంబానికి న్యాయం జరిగేంతవరకు పోరాడుతాం. రాష్ట్రంలో మహిళా కమిషన్ చనిపోయిందని అనుకుంటున్నాం. బతికుంటే బద్వేల్ కు వచ్చివుండేది. ఆ కుటుంబాన్ని పరామర్శించి ఉండేది. ఇప్పటి వరకు రాలేదంటే నిజంగా వారు లేరని అనుకుంటున్నాం.

ఏపీ మహిళల తరపున నేషనల్ మహిళా కమిషన్ రేఖా శర్మాజీ కి నమస్కారాలు.. తమరు రాష్ట్రాన్ని ఒక సారి సందర్శించాలి. ఈ మూడున్నర సంవత్సరాల్లో మహిళలపై అనేక అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నాయి. సీఎం జగన్ ఇంతవరకు ఒక్క కేసుపై కూడా చర్యలు తీసుకోలేదు. మహిళా కమిషన్ వాసిరెడ్డి పద్మ ఇంతవరకు ఒక్క నోటీసు కూడా ఇవ్వలేదు. రేఖాశర్మాజీ ఒక సారి ఏపీకి వస్తే మేం అన్ని విశదీకరిస్తాం.

ముందడుగు వేయకపోతే మహిళలు మిగలరు. రాష్ట్రంలో రోజుకు సగటున మూడు అత్యాచారాలు జరుగుతున్నాయి. అందుకే మీకు విన్నవించుకుంటున్నాం. ఒకసారి ఏపీ రావాలి. జరుగుతున్న ఘటనలపై చర్యలు తీసుకోవాలి. మాకు ప్రభుత్వంపై నమ్మకంలేదు. పోలీసులు కూడా జగన్ ప్రభుత్వానికి సహకరిస్తున్నారు. కేసుల సాక్ష్యాధారాలు మీకిస్తామని తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ఝాన్సీ వివరించారు.

Leave a Reply