Suryaa.co.in

Political News

ఈ డబ్బంతా ఏమైంది?

ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం వచ్చాక కేంద్రానికి వచ్చిన ఆదాయం, అప్పుల గురించి వివరంగా … దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఈ అప్పులతో సంబంధం లేదు.వాటి అప్పులు వాటికున్నాయి.

కేంద్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే 5 ప్రధాన మార్గాలు:-

1) Goods And Services Tax (GST)
2)Income Tax
3)Corporation Tax
4)Non Tax Revenue
5)Union Exise Duties

1)ఇందులో GST 2017 నుండి మొదలైంది, అంతకు ముందు Central Service Tax, State Service Tax విడివిడిగా ఉండేవి.

2014 -15 సంవత్సరంలో 5,45,680/- కోట్లు
2015 -16 సంవత్సరంలో 7,08,013/- కోట్లు
2016 -17 సంవత్సరంలో 8,66,109/-కోట్లు
2017 -18 సంవత్సరంలో 7,19,078/- కోట్లు
2018 -19 సంవత్సరంలో 11,77,370/- కోట్లు
2019 -20 సంవత్సరంలో 12,22,117/- కోట్లు
2020 -21 సంవత్సరంలో 11,36,803/- కోట్లు
2021-22 సంవత్సరంలో 15,45,397/- కోట్లు

ఎనిమిది ఏండ్లలో మొత్తం 7,920,567/- కోట్లు

Income Tax, Corporation Tax (Direct Tax) ద్వారా 2014 -2022 వరకు కేంద్రానికి వచ్చిన ఆదాయం చూద్దాం:-

2014 -15 సంవత్సరంలో 6,95,744/- కోట్లు
2015 -16 సంవత్సరంలో 7,41,945/- కోట్లు
2016 -17 సంవత్సరంలో 8,49,713/- కోట్లు
2017 -18 సంవత్సరంలో 10,02,037 /- కోట్లు
2018 -19 సంవత్సరంలో 11,36,615/- కోట్లు
2019 -20 సంవత్సరంలో 11,70,000/- కోట్లు
2020 -21 సంవత్సరంలో 13,19,000/- కోట్లు
2021-22 సంవత్సరంలో 16,34,454/- కోట్లు

ఎనిమిది ఏండ్లలో మొత్తం :- 8,549,508/- కోట్లు

-ఇవి కాకుండా గత ఎనిమిది ఏండ్లలో పెట్రోలియం పై, కేంద్రం వసూలు చేసిన పన్ను సుమారు 24 లక్షల కోట్లు.

గత ఎనిమిది ఏండ్లలో కేంద్ర ప్రభుత్వం, ప్రభుత్వ ఆస్తులు అమ్మడం ద్వారా వచ్చిన ఆదాయం 3,52,523/- కోట్లు.

వచ్చే 4 ఏండ్లలో అమ్మాలనుకుంటున్న ప్రభుత్వ ఆస్తుల విలువ సుమారు 6 లక్షల కోట్లు.

67 ఏళ్ళ అప్పు 54 లక్షల కోట్లు ఐతే మోడీ ఒక్కరే చేసిన అప్పు 151 లక్షల కోట్లు.

ఆదాయం + అప్పులు కలుపుకొని 29,322,598 (సుమారు 3 వందల లక్షల కోట్లు).
ఈ డబ్బంతా ఏమైంది?

– సాదిక్

LEAVE A RESPONSE