Suryaa.co.in

Andhra Pradesh

నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ఏం పీకాడు?

-టీడీపీపై, చంద్రబాబు, ఆయన కుటుంబం పై అవినీతి ఆరోపణలు చేయడం తప్ప, నాలుగేళ్లుగా అధికారంలో ఉన్న జగన్ ఏం పీకాడు?
– డెక్కన్ క్రానికల్ కథనంపై, జగన్అసెంబ్లీలో చెప్పిన అబద్ధాలపై బహిరంగచర్చకు సిద్ధం
– జగన్ బంధువు పత్రిక డెక్కన్ క్రానికల్ నిజాలు రాస్తుందా?
– ఆపత్రిక యజమాని వెంకట్రామిరెడ్డి జగన్ బంధువే.
– ఇవాళ అసెంబ్లీలో ఐటమ్ గాడితో ఏదేదో మాట్లాడించాడు. వాడికి సగం తెలుసు.. సగం తెలియదు
– శ్రీనివాస్ ఇంట్లో ఇన్ కంటాక్స్ కుదొరికిన సొమ్ముఎంత.. అతను ఇన్ కంటాక్స్ వారికి కట్టిందిఎంత అన్నీ నిరూపిస్తాం
– జగన్ ఇంట్లో కోడి గుడ్డు పెట్టకపోయినా దానికి మాపార్టీనే కారణమంటారు
– ఆధారాలతో వాస్తవాలు నిరూపించే దమ్ము, ధైర్యం జగన్ కు ఉన్నాయా?
– వాళ్ల ఎమ్మెల్యేలని వాళ్లే లాగి బయటకు తన్నారు.
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమామహేశ్వరరావు

“అసెంబ్లీలో ప్రజాసమస్యలపై మాట్లాడాలి..లేకుంటే ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ పై మాట్లా డాలి. అదికాకుండా అధికారపార్టీ అసెంబ్లీని అవాస్తవాలు, అబద్ధాలకు వేదికగా మార్చారు. జగన్, అతని మంత్రివర్గం తెలుగుదేశంపార్టీపై బురదజల్లడానికి, చంద్రబాబుకి అవినీతి మరక లు అంటించడానికే తాపత్రయపడుతోంది తప్ప… ప్రజలు,రాష్ట్రసమస్యల్ని పట్టించుకోవడం లేదు. మొన్నటివరకు స్కిల్ డెవలప్ మెంట్ ప్రాజెక్ట్ లో అవినీతి అని రభసచేశారు. నిరూపించ మని టీడీపీసవాల్ విసిరితే ఏంచేయాలో అర్థంకాక తోకముడిచారు. రూ.371కోట్ల స్కామ్ అన్నారు.. ఆ డబ్బులు ఎక్కడినుంచి ఏ టీడీపీనేతల ఖాతాల్లోకి వచ్చాయో చెప్పమంటే తేలుకుట్టి న దొంగల్లా మిన్నకుండిపోయారు. ఈరోజు అసెంబ్లీలో మంత్రి అమర్నాథ్ , ముఖ్యమంత్రి జగన్ మరోకొత్త అబద్ధం చుట్టూ కట్టుకథలు అల్లారు. మేం అధికారంలో ఉన్నప్పుడు 6లక్షలకోట్ల అవినీతి అన్నజగన్… తాను అధికారంలోకి వచ్చాక 6 వెంట్రుకలుకూడా పీకలేకపోయాడు. శ్రీనివాస్ ఇంట్లో జరిగిన ఇన్ కంటాక్స్ దాడుల్లో మొత్తం రూ.11లక్షలు దొరికితే, జగన్ అతని అవినీతిమీడియా, అతనికి బాకాఊదే బ్లూమీడియా రూ.2వేలకోట్లని ప్రచారం చేసింది. ముగిసిపోయిన దాన్ని మరలా నేడు అసెంబ్లీ లో జగన్ కొత్త కథలుమార్చి చెప్పాడు. జగన్ బంధువు పత్రిక డెక్కన్ క్రానికల్ నిజాలు రాస్తుందా?

మేం అధికారంలో ఉన్నప్పుడు, ప్రతిపక్షంలో ఉన్న జగన్ , చంద్రబాబు రూ.6లక్షలకోట్లు తినేశా డు అని గగ్గోలు పెట్టాడు. అధికారంలోకి వచ్చాక ఇన్నేళ్లలో 6వెంట్రుకలు కూడా పట్టుకోలేకపో యారు. మొత్తం అధికారుల్ని, వ్యవస్థల్ని 4ఏళ్లుగా అదేపనిలో ఉంచికూడా ఏం సాధించలేకపో యారు. నేడు షాపూర్జీ పల్లోంజి కంపెనీపై జగన్ కట్టుకథలు అల్లాడు. ఆ కట్టుకథ డెక్కన్ క్రానికల్ లో వచ్చింది. ఆపత్రిక యజమాని వెంకట్రామిరెడ్డి జగన్ బంధువే. గతంలో చంద్రబాబునాయుడి పర్సనల్ కార్యదర్శి శ్రీనివాస్ పై ఐటీ రైడ్ జరిగినప్పుడు, రూ.2వేలకోట్లు సీజ్ చేసినట్టు సాక్షిలో కథనం వచ్చింది. సాక్షిపత్రికలో వచ్చింది నిజమనే అందరూ అనుకున్నారు. తరువాత ఇన్ కంటా క్స్ వారు రైడ్ లో తాము ఏంసీజ్ చేసింది వివరాలు బయటపెట్టారు. దానిలో రూ.2,63,000 లు నగదు, 12తులాల బంగారం పట్టుకున్నామని చెప్పారు. ఫిబ్రవరి 14, 2020న జగన్ బ్లూ మీడియా రూ.2లక్షల్ని రూ.2వేలకోట్లని ప్రచారంచేసింది. ఇవాళ మరలా జగన్ అతని ప్రభు త్వంలోని మూర్ఖులు గతంలో సాక్షిలో వచ్చినవార్తలే తీసుకొని, దానికి డెక్కన్ క్రానికల్ లో వచ్చి న వార్తల్నిజోడించి సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. డెక్కన్ క్రానికల్ లో రాసిన దానిపై మేం మీకు కుక్కకాటుకి చెప్పుతో కొట్టినట్టు సమాధానంచెప్పడానికి మేం సిద్ధమే.

మేం ఏం మాట్లాడినా ఆధారాలతోనే మాట్లాడతాం. శ్రీనివాస్ పై ఇన్ కంటాక్స్ దాడి జరిగిన ప్పుడు, ఆయన వద్ద ఉన్న అన్నిడాక్యుమెంట్లు సీజ్ చేసింది. దానిలో ఆయన ఐటీ అసెస్ మెంట్స్ తాలూకా ఆర్డర్ కూడా ఉంది. ఇన్ కంటాక్స్ రిపోర్టులో చాలాస్పష్టంగా రూ.11లక్ష ల67వేల600రూపాయలు మాత్రమే దొరికాయనిచెప్పారు. రూ.2వేలకోట్లు ఎక్కడినుంచి వచ్చాయో జగన్, మంత్రి అమర్నాథ్ చెప్పాలి. ఇన్ కంటాక్స్ ఆర్డర్ లో ఇంతస్పష్టంగా వివరాలు ఉంటే, శ్రీనివాస్ పెండ్యాల ఇన్ కంటాక్స్ వారికి చూపించినదానికి, ఇన్ కంటాక్స్ వారు పట్టు కున్నదానికి మధ్య వ్యత్యాసం కేవలం రూ.3,882లు మాత్రమే. అది కూడా అప్పుడే ఇన్ కంటా క్స్ వారు కట్టించుకున్నారు. కళ్లముందు అంతా స్పష్టంగాఉంటే, డెక్కన్ క్రానికల్ పేపర్లో వచ్చిం దని ఎవరెవరో పేర్లుచెబుతారా? మనోజ్ వాసుదేవ్ షాపూర్ అనే అతను… షాపూర్జీ పల్లోంజి సంస్థలో ఒకగుమాస్తా? జగన్ దగ్గర సజ్జల మాదిరిగా. అతనికి ఏవేవో లింకులుపెట్టి, ఏవేవో కట్టుకథలు అల్లి ఎన్నాళ్లు చెబుతావ్ జగన్. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రూ.6లక్షలకోట్లు అన్నావు.. ఇప్పుడు 15కోట్లు అంటున్నావు. నిజంగా నీకు సిగ్గుగా లేదా జగన్?

చంద్రబాబు, ఆయన కుటుంబం 6 లక్షల కోట్ల అవినీతికి పాల్పడిందని దుష్ప్రచారంచేసి అధికారంలోకి వచ్చిన జగన్, 4ఏళ్ల నుంచి ఏం పీకాడు?
అసెంబ్లీలో మాట్లాడుతూ, దుబాయ్ లో 15 కోట్లు ఇచ్చారని జగన్ చెప్పాడు. కుటుంబసభ్యులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలు, ప్రజలు ఛీకొడుతున్నా జగన్ తనవైఖరి మార్చుకోవడంలేదు. టీడీపీ ప్రభుత్వంలో చంద్రబాబు, ఆయన కుటుంబం రూ.6లక్షలకోట్ల అవినీతికిపాల్పడితే, అధికారం లోకి వచ్చిన 4ఏళ్లనుంచి జగన్ ఏం పీకాడు? సిట్ అంటాడు.. సీఐడీ అంటాడు.. విచారణ జరు గుతుంది అంటాడు. ఇవాళ అసెంబ్లీలో ఐటమ్ గాడితో ఏదేదో మాట్లాడించాడు. వాడికి సగం తెలుసు.. సగంతెలియదు. ఇన్ కంటాక్స్ విభాగం రైడ్ తాలూకా అసెస్ మెంట్ లో చాలా స్పష్టంగా ఏంజరిగిందో రాశారు. దాన్నిబయటకు చెప్పకుండా, ప్రజల్ని మోసపుచ్చడానికి ఇం కా అసెంబ్లీని వేదికగామార్చుకుంటావా? జగన్మోహన్ రెడ్డిబోగస్. అతని సాక్షి మీడియా…అతని కి వంతపాడే బ్లూమీడియా అన్నీ బోగస్. అతను అసెంబ్లీలో చూపించిన కాగితాలు బోగస్ వి. మావద్ద 7 సంవత్సరాలకు సంబంధించిన ఇన్ కంటాక్స్ రిటర్న్స్ ఉన్నాయి. అవన్నీ బయటపెడతాం. శ్రీనివాస్ ఇంట్లో ఇన్ కంటాక్స్ కుదొరికిన సొమ్ముఎంత.. అతను ఇన్ కంటాక్స్ వారికి కట్టిందిఎంత అన్నీ నిరూపిస్తాం. అలానే నువ్వు అసెంబ్లీలోచెప్పిన పేర్లపై మేం చర్చకు సిద్ధం. చెప్పుజగన్ ఎక్కడ..ఎప్పుడు చర్చకు వస్తావో చెప్పు. మొన్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రులు జగన్ కు కర్రకాల్చి వాతపెట్టారు. నిన్న సొంత పార్టీ ఎమ్మెల్యేలు పిర్రగిల్లి జోలపాడారు. అయినా సిగ్గులేకుండా చంద్రబాబు.అవినీతి అని ఇంకా సిగ్గులేకుండా పచ్చి అబద్ధాలు చెబుతున్నాడు. ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మా 23 ఓట్లు మాకుపడ్డాయి. జగన్ ఇంట్లోకోడి గుడ్డుపెట్టకపోయినా దానికి మాపార్టీనే కారణ మంటారు. వైసీపీఎమ్మెల్యేల సస్పెన్షన్ ఆ పార్టీ వ్యక్తిగతఅభిప్రాయం. దానితో మాకు సంబంధం లేదు. ఇప్పుడు నలుగురినే సస్పెండ్ చేశారు. మున్ముందు ఆసంఖ్య 50, 70కి పెరిగినా ఆశ్చ ర్యంలేదు.” అని బొండా ఎద్దేవాచేశారు.

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితాలూకా నిరాశానిస్పృహలతోనే జగన్ నేడుసభలో పాతపాటనే కొత్తగా పాడారు. : ధూళిపాళ్ల నరేంద్ర
“దేశంలో అవినీతి ఐకాన్ జగన్మోహన్ రెడ్డే. అలాంటి వ్యక్తి అవినీతి గురించి మాట్లాడుతుంటే జనం నవ్వుకుంటున్నారు. తన అవినీతిబురదను ఇతరులపై జల్లేందుకు జగన్ చేసిన ప్రయత్న మే నేటి సభాపర్వం. దేశంలో స్మార్ట్ అవినీతికి అవార్డ్ ఇస్తే, అది తొలుతదక్కేది జగన్ కే. దేశంలో అవినీతి బ్రాండ్ అంబాసిడర్ ఎవరంటే జగన్ పేరేచెబుతారు. మిగతారాష్ట్రాలు జగన్ ని ఆదర్శంగా తీసుకొని అవినీతిలో కూరుకుపోతున్నాయి. తెలుగుదేశం అంటే అభివృద్ధి.. జగన్ అంటే అవినీతి అని తెలుగుప్రజలకు బాగాతెలుసు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీఎన్నికల ఫలితాలు,. ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికలఫలితాలతో జగన్ మైండ్ బ్లాక్ అయిపోయింది. అందుకే పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ముత్యాలముగ్గు సినిమా లో రావుగోపాలరావు మాట్లాడినదానికి భజనచేసినట్టుగా, అసెంబ్లీలో జగన్ చెప్పిందానికి గుడివాడ అమర్నాథ్ భజనచేశాడు. ప్రజల్లో తనపై, తనప్రభుత్వంపై ఉన్న తీవ్రమైనవ్యతిరేకతను పక్కదారిపట్టించడానికే జగన్ నేడుసభలోచెప్పిన పచ్చిఅబద్ధాలు.

జగన్ అధికారంలోకి వచ్చి 4ఏళ్లు అయ్యింది. నిన్నా..మొన్నో అధికారంలోకి వచ్చినట్టు నేడు సభలో 70 ఎమ్.ఎమ్ ప్రజంటేషన్ ఇచ్చాడు. 4ఏళ్లనుంచి ప్రజంటేషన్ తోనే జగన్ సరిపెడుతు న్నాడుతప్ప.. పెర్ ఫార్మెన్స్ చూపడంలేదు. ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు జగన్ చంద్రబాబు అవినీ తిపై పెద్దపుస్తకం వేశాడు. దానిలో నాకు కూడా 2పేజీలు కేటాయించాడు. ప్రతిపక్షంలో ఉండి పుస్తకంవేసి, టీడీపీపై బురదజల్లి అధికారంలోకివచ్చిన జగన్, ఈ 4ఏళ్లల్లో ఒక్కటంటే ఒక్కటి ని రూపించలేక చేతులెత్తేశాడు. సాక్షాత్తు రాజధానిలో భూములుకొన్నానని నాపై దుష్ప్రచారం చేశాడు. జగన్ అనుచరుడు ఆళ్ల రామకృష్ణారెడ్డి కుట్రల్నికూడా మేం బయటపెట్టాం. రాజధాని నిర్మాణంలో, హైకోర్ట్ నిర్మాణంలో అవినీతి జరిగింది అన్న జగన్ ఆరోపణలు పాతవే.. జగన్ ఎం దుకూ పనికిరాడని సొంతపార్టీ ఎమ్మెల్యేలే తేల్చారు. సజ్జల గ్రాడ్యుయేట్స్ ని ఒకవర్గం అంటు న్నాడు. వాళ్లుకొడితేనే సజ్జలకు, జగన్ కు దిమ్మతిరిగింది. మరి ప్రజలు మొత్తం కలిసికొడితే, పాతాళంలోకి వెళ్తారు.

వైసీపీ ఎమ్మెల్యే ప్రజలవిశ్వాసం కోల్పోయారు. వారి విశ్వాసం జగన్ కోల్పోయారు. చంద్రబాబు ఎమ్మెల్యేకోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మరోఇద్దరిని బరిలో దింపి, వైసీపీఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇస్తాననిచెబితే, వారుకూడా గెలిచేవారని ప్రజలే అనుకుంటున్నారు . వైసీపీఎమ్మెల్యేలు తనపై విశ్వసనీయత కోల్పోయారని అర్థమయ్యే జగన్, నేడు అసెంబ్లీలో కొత్తకథలు చెప్పాడు. అధికారంలోకి వచ్చినప్పటినుంచీ జగన్ అన్నింటిలో అవినీతి అంటున్నా డుకానీ, దేన్ని ఆవగింజంత కూడా నిరూపించలేక పోయాడు. అధికారంలో ఉండి, ప్రభుత్వ వ్య వస్థలను చేతిలోఉంచుకొని, విచారించి నిజాలు నిగ్గుతేల్చకుండా, చంద్రబాబుగారి విశ్వసనీ యతను దెబ్బతీసే ఇలాంటి సన్నాసి పనులు ఎన్నాళ్లుచేస్తారు? చంద్రబాబు అంటే ఏమిటో తెలు గు ప్రజలకు బాగా తెలుసు. సభావేదికను రాజకీయపరమైన అంశాలకు వాడుకొని, ప్రతిపక్షనేత పై బురదజల్లడానికి తాముతీవ్రంగా ఖండిస్తున్నాం.

ప్రజలు అధికారమిచ్చింది బురదజల్లడానికి కాదు.. నిజానిజాలు తేల్చడానికి. ఆ విషయం జగన్ కు ఇంకా అర్థంకాలేదు. ఓటమిబాధతో నిరాశానిస్పృహలతోనే జగన్ నేడు అసెంబ్లీలో పనిగ ట్టుకొని మరీ మరలా పాతపాటేపాడాడు. తెలుగుదేశంపార్టీ ఎలాంటి విచారణకైనా సిద్ధమే. జగన్ విధానాల్ని ప్రజాస్వామ్యవాదులు, ప్రజలు తీవ్రంగా ఖండించాలి. వైసీపీని, జగన్ ని బంగాళాఖాతంలో కలిపితేనే రాష్ట్రానికి, ప్రజలకు మంచిజరుగుతుంది.” అని నరేంద్ర కుమార్ తెలిపారు. విలేకరులు అడిగిన ప్రశ్నకు సమాధానంగా ధూళిపాళ్ల మాట్లాడుతూ, “దేశంలోని డబ్బంతా తన వద్ద పెట్టుకున్న జగన్మోహన్ రెడ్డిని, టీడీపీ డబ్బుతో ఏమైనా చేయగలద. కేవలం జగన్ అతని పార్టీఅలా చెప్పడం డైవర్షన్ టాక్ టిక్సే. వాళ్ల ఎమ్మెల్యేలని వాళ్లే లాగి బయటకు తన్నారు. రేపు మేం టిక్కెట్లు ఇస్తామో లేదో చూద్దాం.”

LEAVE A RESPONSE