– టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దిపాటి వెంకట రాజు
నేడు విశాఖలో వైసీపీ నిర్వహించింది గర్జన కాదు.. మంత్రులు పదవులు కాపాడుకునేందుకు జగన్ రెడ్డికి చేసిన భజన. మూడేళ్లలో విశాఖకు ఏం చేసారో చెప్పండి. ఉన్న కంపెనీలు, పరిశ్రమలు కమిషన్ల కక్కుర్తితో వెళ్లగొట్టి ఉత్తరాంధ్ర యువత నోట్లో మట్టి కొట్టారు. వైసీపీలోని పెత్తందారుల కన్ను విశాఖ సంపదపై పడింది వాస్తవం కాదా.? వైసీపీ పెద్దల పెత్తనాన్నిస్థానిక నేతలే అంగీకరించడం లేదు.. ఇక ప్రజలెందుకు భరించాలి.?
వైసీపీలోని భూదోపిడి దారులంతా గర్జన పేరుతో నాటకాలాడితే నమ్మడానికి ఉత్తరాంధ్ర ప్రజలు అమాయకులనుకుంటున్నారా? ఉత్తరాంధ్ర యువతకు ఉపాధి, ఉద్యోగాలు కల్పిచే లులూ, ఫ్రాంక్లిన్ టెంపుల్టన్, డేటా సెంటర్ వంటి గొప్ప పరిశ్రమలను ఈ ముఖ్యమంత్రి తరిమేసినప్పుడు వైసీపీ నేతలు ఎందుకు గర్జించలేదు.? అప్పుడు గర్జనలు చేయకుండా ఇప్పుడు నాటకాలాడుతారా.? వైసీపీ నేతలతో ఏర్పాటు చేసిన నాన్ పొలిటికల్ జేఏసీతో నాటకాలాడుతున్నారు. ఉత్తరాంధ్ర ప్రజల సమస్యలపై ఏ ఒక్క రోజునై ముఖ్యమంత్రికి వినతిపత్రం ఇచ్చారా.?
అమరావతి రాజధానిగా అన్ని ప్రాంతాలకు సమాన దూరంలో ఉంది. అమరావతి ఐదుకోట్ల మందిది కాబట్టే నాడు శంకుస్థాపనకు ప్రతి పల్లె నుండి మట్టిని పంపించారు. కాలేజీలు, స్కూళ్లకు సెలవులు ఇచ్చి బలవంతంగా విద్యార్దుల్ని రప్పించారంటే వైసీపీ గర్జనకు ప్రజల మద్దతు లేదు. మంత్రులకు ఉత్తరాంధ్రపై ప్రేమలేదు వాళ్ల ప్రేమ, ధ్యాసంతా అక్కడి భూములపైనే. స్వార్దంతో రాజధాని పేరుతో ప్రజలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెడుతున్నారు. వైసీపీ గుంట నక్కల్ని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.