మంత్రి రోజాను జనసేన కార్యకర్తలు చంపాలని చూశారు

-చాలామంది గాయపడ్డారు
– ప్రభుత్వ ఆస్తులకు నష్టం
– బాధ్యులైన వారిపై కేసులు పెడతాం
– విశాఖ పోలీసుల ప్రకటన
మంత్రి రోజా, ఇతరులపై జనసేన కార్యకర్తలు దాడి చేసి చంపాలని చూశారని విశాఖ పోలీసులు ఒక పత్రికాప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆస్తులకు నష్టం వాటిల్లటంతోపాటు, పోలీసుల సహా కొందరికి గాయాలయినట్లు వివరించారు. పార్కింగ్‌లోని వాహనాలు కూడా కనిపించడం లేదన్నారు. ఈ ఘటనకు బాధ్యులైన వారిని గుర్తించి, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
పోలీసుల పత్రికా ప్రకటన ఇదీ..

పత్రిక ప్రకటన
తే 15/10/2022 దిన గౌరవ మంత్రి వర్యులు శ్రీమతి రోజా గారు ఇతర గౌరవ మంత్రులు మరియు వైస్సార్ పార్టీ నాయకులూ ఎయిర్పోర్ట్ కు చేరుకున్న సమయం లో జనసేన పార్టీ కార్యకర్తలు 200 to 300 మంది ఎయిర్పోర్ట్ వద్ద గుమిగూడి అక్రమ సమావేశం గా ఏర్పడి, శ్రీమతి రోజా గారిని వైస్సార్ పార్టీ నాయకులను అగౌర పరిచే పదజాలం తో దూషించి బారులు బారులుగా గుమిగూడి రాళ్లతో, పార్టీ జండా కర్రలతో మరియు పదునైన ఇనుప వస్తువులతో చంపాలని ఉద్దేశంతో దాడి చేసి బలమైన గాయాలను కలుగచేసినారు. దీనివలన ప్రజా శాంతి కి భంగం వాటిల్లడమే కాకుండా ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేయడం కూడా జరిగింది .

14/10/2022 తేదిన ACP WEST, under section 30 of police Act ఆర్డర్స్ ప్రకారం వెస్ట్ జోన్ ప్రాంతం లో ఇటువంటి కార్యక్రమాలు నిర్వహించ కూడదని promulgate చేసి ఉన్నపటికీ వాటిని అతిక్రమిస్తూ వివోల్టే చేస్తూ, ఊరేగింపుగా వచ్చి అక్రమ సమూహంగా ఏర్పడి పై వారిపైనే కాకుండా పెందుర్తి SHO నాగేశ్వర రావు, అతని సిబ్బంది మరియు సామాన్య ప్రజలు మున్నంగి దిలీప్ కుమార్, సిద్దు, సాయికిరణ్, హరీష్ మరియు ఇతరులకు బలమైన గాయములు కలిగినవి. ఎయిర్పోర్ట్ వద్ద ప్రజలు భయ భ్రాంతులకు గురి కావడం జరిగినది. సుమారు ౩౦ మంది ప్రయాణికులు నిర్ణీత సమయంలో ఎయిర్పోర్ట్ కు చేరుకోలేక విమానాలు మిస్ కావడం కూడా జరిగింది. పై సంఘటనలపై గాయపడిన వారిచ్చిన ఫిర్యాదు ప్రకారం అందుకు బాధ్యులైన జనసేన నాయకులూ మరియు కార్యకర్తలపై కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు ప్రారంభించడం జరిగినది.

Leave a Reply