విశాఖలో భూ రాబందులంతా పచ్చ నేతలే

Spread the love

ఎంపీ విజయసాయి రెడ్డి

విశాఖపట్నం, అక్టోబర్ 15: రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విశాఖ జిల్లాలో 430.81 ఎకరాల ప్రభుత్వ భూములను కబ్జాకోరుల చెర నుంచి విడిపించిందని వీటిలో అగ్రభాగం టీడీపీ నేతలు కబ్జా చేసినవేనని రాజ్యసభ సభ్యులు, వైకాపా జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా శనివారం పలు అంశాలు వెల్లడించారు. ఆక్రమించుకున్న భూముల మార్కెట్ విలువ రూ.5 వేల కోట్లకు పైనేనని అన్నారు. టీడీపీ నేతల భూదందాకు తెర పడటంతో ఏమి చేయాలో తోచక ప్రభుత్వంపై బురద చల్లేందుకు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు.

మాటల్లో మధురం-మనసులో విషం చంద్రబాబు నైజం
మాటల్లో మధురం – మనసులో విషం, ముఖంలో నవ్వు మదిలో విద్వేషం ఇది చంద్రబాబు నైజం అని విజయసాయి రెడ్డి అన్నారు. పైకి విశాఖపై కపట ప్రేమ నటిస్తూ లోపల క్షుద్ర రాజకీయం చేస్తున్నాడని ఇదే అతని అసలు తత్వం అని అన్నారు.

29 గ్రామాల కన్నా 26 జిల్లాల ప్రయోజనాలే ముఖ్యం
గతంలో అభివృద్ధినంతా ఒకే చోట కేంద్రీకరించడం వల్ల విభజన అనంతరం తీవ్రంగా నష్టపోయామని, మద్రాసు, హైదరాబాద్ దగ్గర మోసపోయినట్లు మళ్లీ మనం మోసపోకూడదని అన్నారు. కేవలం 29 గ్రామాలు మాత్రమే కాకుండా రాష్ట్రంలోని 26 జిల్లాలూ సమానంగా అభివృద్ధి చెందాలన్నదే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అకాంక్షని అన్నారు. అందుకు మూడు రాజధానుల ఏర్పాటు ద్వారా జరిగే వికేంద్రీకరణ ఒక్కటే మార్గమని అన్నారు.

విశాఖ గర్జన విజయవంతం
విశాఖ గర్జనతో విశాఖ నగరం జనసంద్రం అయ్యిందని, విశాఖ గర్జనకు తరలి వచ్చిన ప్రతి వ్యక్తికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నానని అన్నారు. జోరున కురుస్తున్న వానను సైతం లెక్కచేయక ప్రజలు విశాఖ గర్జనలో పాల్గొనడం ద్వారా విశాఖ రాజధాని కావాలని ఎంత బలంగా కోరుకుంటున్నారో ప్రతిపక్షాలు అర్థం చేసుకోవాలని అన్నారు.. జన సునామీలో వికేంద్రీకరణ ద్రోహులు కొట్టుకుపోయి బంగాళాఖాతంలో కలిసిపోతారని అన్నారు..

కాపిటలిస్ట్ గా మారిన కమ్యూనిస్టు రామోజీ
1963లో కమ్యూనిస్టు పార్టీ కార్డు హోల్డర్ అయిన ఆనాటి “మార్గదర్శి” రామోజీ “ఈనాడు” కాపిటలిస్ట్ ఎలా అయ్యాడని ప్రశ్నించారు. ఏ రాజకీయ పార్టీ అధికారంలో ఉన్నా తానే కింగ్ మేకర్ అన్న అహంకారం అతనిలో పెరిగిపోయిందని అన్నారు. న్యాయమూర్తి తీర్పులో… “ప్రభుత్వం తప్పు చేస్తే రామోజీ తన పత్రికలో ప్రచురించవచ్చు… కానీ రామోజీ వ్యాపార సంస్థల్లో మోసాలు, అక్రమాలకు పాల్పడితే ప్రభుత్వం చర్యలు తీసుకోకూడదా? ఇదెక్కడి న్యాయం అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పత్రికాధిపతిగా, వ్యాపారవేత్తగా రాము రెండు టోపీలు పెట్టుకుని తిరుగుతున్నాడా? చట్టం అందరికి ఒకటేనని గుర్తుంచుకోవాలని అన్నారు.

Leave a Reply