– అందాల పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఏం సంబంధం?
– తిరుపతి రెడ్డితో మెమొంటోలు ఎట్లా ఇప్పిస్తారు?
– అందాల పోటీల్లో చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడించారు
– అందగత్తెలకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు
– ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే మిస్ ఇంగ్లాండ్
వెళ్ళిపోయింది
– చామల కిరణ్ రెడ్డికి మతిభ్రమించింది
– జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ
హైదరాబాద్: దేశంలో ఒకవైపు ఉగ్రవాదుల దాడులతో కేంద్రం ఐపీఎల్ మ్యాచ్ లను పోస్ట్ పోన్ చేసింది. రేవంత్ రెడ్డి ప్రభుత్వం అట్టహాసంగా అందాల పోటీలు నిర్వహించింది. అందాల పోటీల ఈవెంట్స్ కు సీఎం రేవంత్ రెడ్డి 7 నుండి ఎనిమిది సార్లు వెళ్లారు.
అందాల పోటీలకు 200 కోట్లు ఖర్చు పెట్టి సీఎం,మంత్రులు, ఎమ్మెల్యేలు ఎంజాయ్ చేశారు. అందాల పోటీల మధ్యలోనే మిస్ ఇంగ్లాండ్ వెళ్లిపోయింది. ప్రభుత్వం వ్యవహరించిన తీరుతోనే మిస్ ఇంగ్లాండ్ వెళ్ళిపోయింది. అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను మనుషుల్లాగా కాకుండా బొమ్మల్లాగా చూశారు.
చామల కిరణ్ రెడ్డికి మతిభ్రమించింది. అందాల పోటీలతో దేశం పరువు,తెలంగాణ పరువు పోయింది. మిస్ ఇంగ్లాండ్ ఆరోపణల వెనుక
బిఆర్ఎస్ ఉందని చామల కిరణ్ రెడ్డి అనడం హాస్యాస్పదం. అందాల పోటీలకు వచ్చిన వాళ్ళను గంటలు, గంటలు నిలబెట్టి రియల్ ఎస్టేట్ ఆఫీసులకు తిప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి బిడ్డకు,అందాల పోటీలకు వచ్చిన వాళ్లకు ఏం సంబంధం? సీఎం కుటుంబం అందాల పోటీలకు వచ్చిన వాళ్ళతో డిన్నర్ చేసింది. అందాల పోటీల్లో చెప్పులు వేసుకుని బతుకమ్మ ఆడించారు. అందగత్తెలకు తెలంగాణ ఆడబిడ్డలతో కాళ్ళు కడిగించారు.
రాష్ట్రంలో రైతులు చనిపోతే పట్టించు కోవడం లేదు. ప్రభుత్వం పాలనపై దృష్టి పెట్టాలి. అందాల పోటీలకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డికి ఏం సంబంధం? తిరుపతి రెడ్డితో మెమొంటోలు ఎట్లా ఇప్పిస్తారు?రాష్ట్ర ప్రతిష్టతను దిగజారుస్తున్నారు. కేసీఆర్,కేటీఆర్,హరీష్రావు పేరు తీయకుండా సీఎం, మంత్రులు నిద్రపోవడం లేదు.మంత్రి పదవులు అడ్డంపెట్టుకుని ముడుపులు సంపాదించాలని మంత్రులు చూస్తున్నారు.
సీఎంకుసమయం లేదా?:రమాదేవి
250 కోట్లతో ఖర్చు చేశారు.అందాల పోటీలతో రాష్ట్రానికి ఏం తీసుకొచ్చారు? ఏం తీసుకొస్తారు? సరదాగా గడిపేందుకు సీఎంకు సమయం ఉంది కానీ, ప్రజల సమస్యలకు సమయం లేదా?
అబద్దాల సీఎం : సుశీలా రెడ్డి …
సీఎం అబద్దాల ముఖ్యమంత్రిగా మారిపోయారు. హరీశ్ రావు జన్మదినం సందర్భంగా తెలంగాణ భవన్ వద్ద ఫ్లెక్సీలు కడితే వచ్చిన నొప్పేమిటి?
హరీష్ రావు పుట్టిన రోజు ఇంకా పూర్తి కాకముందే ఫ్లెక్సీ లు తొలగిస్తారా ?
కాంగ్రెస్ చోటా మోటా నేతల ఫ్లెక్సీలు ఆరునెలల తర్వాత కూడా తొలగించడం లేదు. ప్రజలు అన్నీ గమనిస్తున్నారు.తగిన సమయం లో కాంగ్రెస్ కు బుద్ది చెబుతారు
అబద్దాలకు అడ్రస్: సుమిత్రానంద్
నిన్న రాష్ట్ర అవతరణ వేడుకల్లో సీఎం జై తెలంగాణ అనలేదు. చంద్రబాబు నాయుడు సైతం జై తెలంగాణ అనని పరిస్థితి ఏర్పడింది. అబద్దాలకు అడ్రస్ గా కాంగ్రెస్,రేవంత్ రెడ్డి మారారు. కరోనా కష్టకాలంలో కేసీఆర్ రైతుబంధు ఆపలేదు.రేవంత్ రెడ్డి డైవర్షన్పాలిటిక్స్ చేస్తున్నారు.
తెలంగాణ సోయి లేకుండా రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్నారు.
పరువు దెబ్బతీశారు:అన్నపూర్ణ అందాల పోటీల నిర్వహణతో రాష్ట్ర పరువు దెబ్బతీశారు. హైదరాబాద్, తెలంగాణ రాష్ట్రానికి చెడ్డ పేరు తీసుకొచ్చారు.