ఒక నెల రోజులుగా నాలో ఏదో తెలియని వెలితి నిత్యం నన్ను ప్రశ్నిస్తూ ఉంది. జవాబుఇచ్చినా సంతృప్తి చెందని మనసు నాతోనే ఉంటానంటుంది. చాలా గమ్మత్తుగా మారింది నా జీవన విధానం ఒక్కోసారి చెప్పలేని తట్టుకోలేని ఆనందం. మరుసటి రోజే మనస్సుపై విసుగు. ఒక్కసారిగా అసహనం ఆవరించేస్తుంది. ఎందుకో ఈ విరహం మరెందుకో ఈ ఆక్రోశం అనిపిస్తుంది కానీ ఏమీ చేయలేం..
ఏదో నాకు అవసరమైనది ఇచ్చినట్టే ఇచ్చి అమాంతంగా ఆ దేవుడు తస్కరించేశాడు. చిన్నప్పటినుండి కాయ కష్టం చేసిన వాడిని. ఇప్పుడు కొంత క్లాస్ జీవితానికి అలవాటు పడటమేనేమో అనిపిస్తుంది నాకు. ఒక్కోసారి.. అనిపిస్తుంది.. నా..లైఫ్..లో.. లేనిదాన్ని.. గురించి నేను.. ఇష్టపడుతున్నానా? నాకు దొరకని దాని గురించి తాపత్రయ పడుతున్నానా ఎందుకిలా జరుగుతుంది?
ఇన్ని ఉన్న నేను మానసిక రోగినా అనే అనుమానం కూడా కలగక పోవడం లేదు.. ఇంతకీ నాకున్న జబ్బు ఏంటో ఇప్పటికైనా గుర్తించారా? లేదా.. నేను ఇష్టపడింది..నా.. లైఫ్.. లో.. దక్కకుండా పోతుందా.. ఏమీటో ఎప్పుడూ లేవు.
నా జీవితంలో ఇన్ని ప్రశ్నలు ఎందుకు ఉద్భవించాయో అర్ధం కావడం లేదు. బహుశా..నా.. ఇష్టానికి. అదృష్టం అనేది నేను…నా..జీవితాంతం… ఎదురుచూసిన.., దొరకదేమో.. అనే అసంతృప్తితో… ఇక ఇంతే ఈ సాదా సీదా జీవితం..ఇక ఇంతేనేమో…. నా జీవితం మేడిపండు పోలికనుండక తప్పదేమో.!.