-కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారు
– పెనంలోంచి పొయ్యిలో పొన్నాల లక్ష్మయ్య
– భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో కేంద్రమంత్రి, బిజెపి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి
దోపిడీ, అవినీతి, అహంకారం కాంగ్రెస్ పార్టీ డీఎన్ఏ లోనే ఉన్నాయి.ప్రజా సంపదను లూఠీ చేయడంలో కాంగ్రెస్ పార్టీకి వెన్నతో పెట్టిన విద్య.ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి డబ్బులు కర్ణాటక నుంచి వస్తున్నాయి. బెంగళూరు ఆర్టీ నగర్ లో ఒక కాంగ్రెస్ నేత ఇంట్లో రూ. 42 కోట్లు బయటపడ్డాయి.కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో లూఠీలే కొనసాగుతున్నాయి.
ఛత్తీస్ ఘడ్ లో ఆవు పేడ కుంభకోణం బయటపడింది.ఆవు పేడను కూడా కాంగ్రెస్ పార్టీ వదలడం లేదు.రాహుల్ గాంధీ చేసింది జోడో యాత్ర కాదు ఇండియా లూఠో యాత్ర.కాంగ్రెస్ పార్టీ కరప్షన్ పార్టీ. తెలంగాణ రాష్ట్రాన్ని అంగడిగా మార్చేశారు.తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ వచ్చిన … దొంగ పత్రాలు సృష్టించి అభివృద్ధి పనుల పేరుతో వివిధ సాజిక వర్గాలను మభ్యపెడుతున్నారు. తొమ్మిదేళ్లలో కమీషన్ రూపంలో వచ్చిన డబ్బులను ఈ ఎన్నికలలో ఖర్చు పెట్టేందుకు కుట్ర చేస్తోంది.బీఅర్ఎస్, కాంగ్రెస్ పార్టీల DNA ఒక్కటే.. నరేంద్ర మోదీ సుపరిపాలనను ప్రపంచ దేశాలు మెచ్చుకుంటున్నాయి.బీఅర్ఎస్ ను శాశ్వతంగా ఫామ్ హౌస్ కు పంపాలి.జలయజ్ఞం, భూ యజ్ఞం పేరుతో కాంగ్రెస్ పార్టీ దోపిడీ చేసింది.బోఫోర్స్, బొగ్గు, కామన్ వెల్త్, టెలికాం వంటి భారీ అవినీతి కుంభకోణాలు చేసి కాంగ్రెస్ పార్టీ దేశ సొమ్మును లూటీ చేసింది.
ఏ ప్రాతిపదికన ప్రవళిక మరణంపై ఆరోపణలు చేస్తున్నారో పోలీసులు చెప్పాలి.. వారి దగ్గర ఉన్న ఆధారాలు బయట పెట్టాలిపరీక్షలు వాయిదా పడడంతో మనస్థాపానికి గురైందని కుటుంభం సభ్యులే చెప్పారు. ప్రవళికకు సంఘీభావంగా లక్షలాది మంది యువత కదిలి వచ్చారు.ప్రభుత్వం పై ఏ స్థాయిలో వ్యతిరేకత ఉందో యువత నుంచి వస్తున్నస్పందన చూస్తుంటే అర్థంవుతోంది.
రాష్ట్రంలో ఉద్యోగ ఖాళీలను గోల్ మాల్ వ్యవహారంగా మార్చారు.లక్షలాది మంది యువత జీవితాలతో ఆడుకుంటున్న TSPSC ని రద్దు చేయకుండా ఎందుకు కాపాడుతున్నారు..? కేసీఆర్ కు సీఎం సీటులో కూర్చునే నైతిక హక్కు కోల్పోయారు.పొన్నాల లక్ష్మయ్య పెనంలోంచి పొయ్యిలో పడుతున్నారు. రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి ఖాయం.