Suryaa.co.in

Andhra Pradesh

రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి ఏమని ఓట్లడుగుతావ్‌ జగన్‌?

-ఎస్సీ, ఎస్టీల నిధులను దారి మళ్లించావు
-గులకరాయి అంటూ డ్రామా ఆడుతున్నావు
-బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌

కూటమి నాయకులపై సీఎం జగన్‌ అనుచిత వ్యాఖ్యలు సరికావని, మేం కూడా అదే స్థాయిలో సమాధానం చెబుతామని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్‌.డి.విల్సన్‌ హెచ్చరించారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు చెప్పినట్టు రాష్ట్ర బీజేపీ నాయకులు నడుస్తున్నారని అనడం సరైన పద్ధతి కాదన్నారు. బీజేపీలో కస్టపడి పనిచేసిన నాయకురా లు పురందేశ్వరి అని హితవుపలికారు. రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన నువ్వు మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షు రాలు పురందేశ్వరి గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. కూటమి అధికారంలోకి రాగానే మీ అవినీతి మొత్తం బయటకు తీసి జైలుకు పంపిస్తామని హెచ్చరించారు.

రాష్ట్రంలో అంబేద్కర్‌ రాజ్యాంగం అమలు కావడం లేదని విమర్శించారు. ఎస్సీ,ఎస్టీల నిధులు కేంద్రం మంజూరు చేస్తే దారి మళ్లించిన జగన్‌కు దళితుల ఓట్లు అడిగే హక్కు లేదన్నారు. చివరకు పారిశుధ్య కార్మికుల సొమ్ము సైతం పక్కదా రి పట్టిస్తున్నావు. సబ్‌ప్లాన్‌ నిధులు మొత్తం రూ.98 వేల కోట్లు పక్క దారి పట్టాయని విమర్శించారు. సొంత చెల్లి షర్మిలారెడ్డే నిన్ను చీకొడుతుంది. బాబాయ్‌ని హత్య చేసిన వ్యక్తిని పక్కన పెట్టుకుని రాజకీ య ప్రచారాలు చేస్తున్నావు. కోడి కత్తి కేసులో ఒక దళితుడిని ఐదేళ్లు జైలులో బంధించారు…ఇప్పుడు రాయి ఘటన అంటూ మరొక బీసీ వ్యక్తిని బలిచేయాలని చూస్తున్నావు…నీకు బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయని హెచ్చరించారు.

LEAVE A RESPONSE