Suryaa.co.in

Telangana

పదేళ్లలో మోదీ ఏం చేశారో చెప్పాలి

-బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు ఒక్కటే…
-కేసీఆర్‌ వ్యాఖ్యలు విడ్డూరం

-మాకు 30 మంది టచ్‌లో ఉన్నారు
-ఎస్సీ వర్గీకరణపై బిల్లుపెట్టకుండా మోసం
-మందకృష్ణ మాదిగ ఆత్మవిమర్శ చేసుకోవాలి
-కాంగ్రెస్‌ నేత గజ్జెల కాంతం

20 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారని మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పడం విడ్డూరంగా ఉందని కాంగ్రెస్‌ నాయకుడు గజ్జెల కాంతం అన్నారు. గాంధీ భవన్‌లో మీడియా సమావేశంలో కేసీఆర్‌ వ్యాఖ్యలపై స్పందించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ మిలాఖత్‌ అయ్యాయని, 30 మంది బీఆర్‌ ఎస్‌ ఎమ్మెల్యేలు మాకు కూడా టచ్‌లో ఉన్నారని తెలిపారు. 2014 నుంచి ఇప్పటివరకు కేంద్రంలో నరేంద్రమోదీ ఏమి చేశారో కిషన్‌ రెడ్డి చెప్పాలని ప్రశ్నించారు. నిత్యావసరాల ధరలు పెరిగాయి. పేద, మధ్య తరగతి ప్రజలు బతికే పరిస్థితి లేదు. మళ్లీ బీజేపీ గెలిస్తే దేశంలో సంపద అంతా బడా బాబు లకు అప్పజెబుతారని మండిపడ్డారు. మణిపూర్‌లో జరిగిన సంఘటనకు మోదీ ఇప్పటివరకు సమాధానం చెప్పలేదు. అక్కడ ప్రైవేట్‌ వ్యక్తులకు తుపాకులు ఇచ్చి వందల మందిని చంపారు. ఆదాని, అంబానీ లకు ఖనిజ సంపద కోసం, మైనింగ్‌ కోసం వేలమందిని పొట్టన బెట్టుకు న్నారు. మోదీ ఇప్పటికీ నోరు విప్పకపోవటం సిగ్గుచేటన్నారు.

గుజరాత్‌లో 41 వేల మంది దళిత, గిరిజనుల మహిళలను అత్యాచారం చేసి కనిపించ కుండా చేశారు. ఉత్తరప్రదేశ్‌లో 6 వేల మంది దళిత యువకులను చంపితే మోదీ మాట్లాడలేదు. ఆర్మీని కూడా ప్రైవేటుపరం చేశారు. పార్లమెంటులో రైతుల మీద నల్ల చట్టాలు తెచ్చి 700 మంది రైతులను చంపారు. వర్గీకరణపై ఎందుకు బిల్లు పెట్టలేదు. దుర్మార్గ పరిపాలన చేస్తున్న బీజేపీకి మద్దతు ఇస్తు న్న మందకృష్ణ మాదిగ ఆత్మ విమర్శ చేసుకోవాలని కోరారు. తెలంగాణలో మాదిగలను మోసం చేసి ఓట్ల కోసం బీజేపీ ప్రయత్నం చేస్తోంది. మళ్లీ బీజేపీ అధికారంలోకి వస్తే దళితులను చంపుతారు. వర్గీకరణ చేసి దళితు లకు న్యాయం జరగాలంటే కాంగ్రెస్‌ పార్టీకే సాధ్యమని తెలిపారు.

LEAVE A RESPONSE