Suryaa.co.in

Andhra Pradesh

బోండా ఉమను వేధిస్తున్నారు

-గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలి
-హైకోర్టు, కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తాం
-కూటమి రాగానే డ్రామా బయటపెట్టి సన్మానిస్తాం
-టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజారపు అచ్చెన్నాయుడు

కూటమి అభ్యర్థిగా నామినేషన్‌ వేసిన బోండా ఉమామహేశ్వర రావును కావాలనే సీఎం జగన్‌ వేధిస్తున్నారని టీడీపీ రాష్ట్ర అధ్యక్షు డు కింజారపు అచ్చెన్నాయుడు మండిపడ్డారు. సీపీ ప్రకటనపై ఎన్నికల సంఘం విచారణకు ఆదేశించాలని డిమాండ్‌ చేశారు. అధికారులు ఎన్నికల నిబంధనల ఉల్లంఘనలపై ఇప్పటికే గవర్నర్‌కు ఫిర్యాదు చేశామని, దీనిపై గవర్నర్‌ తక్షణమే జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిని వైసీపీని వేధించ టంపై హైకోర్టు చీఫ్‌ జస్టిస్‌, ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

వేధింపులు ఆపకపోతే అధికారులు భవి ష్యత్తులో మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు. జగన్‌ చెప్పి నట్టు ఆడి మీ ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని హితవు పలికారు. మరో నెలరోజుల్లో కూటమి ప్రభుత్వం వస్తుందని, గులకరాయి డ్రామా బయటపెడతామని తెలిపారు. ఈ డ్రామాకు కధ, స్రీన్‌ ప్లే, దర్శకత్వం వహించిన వారికి తగిన రీతిలో సన్మానం చేస్తామని హెచ్చరించారు.

LEAVE A RESPONSE