– రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి చందు సాంబశివరావు
అధికారం కోసం అవకాశవాద రాజకీయం కోసం ఎవరితోనైనా జతకట్టి, సిద్ధాంతాలను పక్కకు నెట్టే పార్టీ తెలుగుదేశం అని రాష్ట్ర బిజెపి అధికార ప్రతినిధి చందు సాంబశివరావు తీవ్రంగా విమర్శించారు. రాష్ట్రంలోని వైయస్సార్ పార్టీకి బిజెపి మద్దతిస్తుందంటూ లోపాయి కారిగా వ్యవహరిస్తుందంటూ మాజీ మంత్రి టిడిపి నేత పితాని సత్యనారాయణ బిజెపి పై అనుచితంగా చేసిన వ్యాఖ్యల పట్ల చందు సాంబశివరావు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేశారు.
భారతీయ జనతా పార్టీ సిద్ధాంత ప్రాతిపదికగా క్రమశిక్షణతో నడిచే పార్టీ అని పేర్కొంటూ, కాంగ్రెస్ అవినీతి అక్రమాలకు వ్యతిరేకంగా నాడు – ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశం పార్టీని, అధికార దాహంతో స్వార్థ ప్రయోజనాలతో తిరిగి కాంగ్రెస్తో జతకట్టే స్థితికి తీసుకువెళ్ళింది ఎవరో ప్రజలకు తెలుసని పేర్కొంటూ, పితాని వ్యాఖ్యలు గురివింద గింజ సామెతలు గుర్తు చేస్తున్నాయని తీవ్రంగా దుయ్యబట్టారు.
ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలు బిజెపిపై చేస్తున్న దుష్ప్రచారం మానుకోవాలని మాటలు అదుపులో పెట్టుకోవాలని లేకుంటే మరింతగా మీ బండారం బయటపెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.బిజేపి పై అర్థరహిత,ఆధార రహిత ఆరోపణలతో అభద్రతాభావంతో టిడిపి ఉన్నట్లుగా అవగతమవుతుందని విమర్శించారు.