Suryaa.co.in

Andhra Pradesh

జగన్ బస్సు యాత్ర సరే… ఆ ఖర్చెవరి ఖాతాలో వేస్తారు?

-జగన్ రెడ్డికి ముప్పు ఉందని చెప్పిన డీజీపీ – బస్సు యాత్రకు ఎలా అనుమతినిస్తారు?
-ఇన్నాళ్లు ముప్పు పేరుతో ఇబ్బంది పెట్టిన జగన్ రెడ్డి ప్రజలకు బహిరంగ క్షమాపణ చెప్పి బస్సు యాత్ర మొదలు పెట్టాలి
-జగన్ రెడ్డి వస్తున్నాడంటే బారికేడ్లు పెడతారు, పరదాలు కడతారు, చెట్లు కొడతారు, ప్రజలను ఇబ్బందులు పడతారు
– రాష్ట్ర అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణా రెడ్డి

ఐదేళ్ల తరువాత ఎన్నికల కోసం మొట్ట మొదటి సారి జగన్ రెడ్డి ప్రజల మధ్యకు బస్సు యాత్ర పేరుతో బయటకు వస్తున్నందుకు తెలుగుదేశం పార్టీ స్వాగతిస్తుంది. ఇంత వరకు జనాల్లో తిరగని సీఎం జగన్ రెడ్డి. ఆయన బస్సులో వచ్చినా హెలికాప్టర్ లో వచ్చినా ప్రజల్లో పెద్దగా స్పందన ఉండదు. జగన్ రెడ్డి ఆయన కుటుంబానికి ముప్పు పొంచి ఉంది కాబట్టి ఎస్పీజీ లాంటి పోలీస్ బలగాలను పెంచుతున్నామని డీజీపీ 3 నెలల క్రితం తెలిపారు.

వైఎస్ కుటుంబం ఎక్కడ ఉన్నా సరే వాళ్లకు ఏపీ పోలీసులు భద్రత కల్పించాలనడం హేయం. జగన్ రెడ్డికి కుక్కలు, పందులు, ఎలుకల నుంచి ప్రమాదం పొంచి ఉన్నందుకు ఒకటి కాదు రెండు హెలికాఫ్టర్లు కావాలన్నట్లుగా పోలీసులు మాట్లాడారు. మోదీ మూడు హెలికాఫ్టర్ లో వస్తున్నారు కాబట్టి నాకేం తక్కువ అని జగన్ రెడ్డి రెండు హెలికాఫ్టర్లు తెప్పించుకున్నారు. మొన్నటి వరకు జగన్ రెడ్డికి పెనుముప్పు ఉన్నది అన్న డీజేపీ, బస్సు యాత్రకు ఏ విధంగా అనుమతిని ఇస్తారు? అంటే సీఎం కి త్రెట్ ఉందా లేదా? ఇంటిలిజెన్స్, డీజీపీ అబద్దాలు చెప్పారా?

ప్రజల సొమ్ముతో ఆఖరికి 5 కి.మీ. కూడా హెలికాఫ్టర్ లో పోయిన ఘనుడు జగన్ రెడ్డి. అంతే కాకుండా హెలికాఫ్టర్ దిగిన చోటు నుంచి మీటింగ్ ప్రదేశానికి వెళ్లే మార్గంలో బారికేడ్లు పెట్టారు, చెట్లు కొట్టారు, అంతే కాకుండా ఆయన కనపడకుండా పరదాలు కూడా కట్టారు. జగన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు బారికేడ్లు పెట్టేందుకు, పరదాలు కట్టేందుకు, చెట్లు కొట్టేందుకు ఖర్చు ఎవరు భరిస్తారు? ప్రభుత్వం భరిస్తుందా? వైసీపీ పార్టీ భరిస్తుందా? అసలే ఆయనకు పచ్చదనం అంటే ఇష్టముండదు. జగన్ రెడ్డి ఏ ఊరికి వెళ్లినా అక్కడ పచ్చని చెట్లు మాడిపోవాల్సిందే లేదా కొట్టివేయాల్సిందే.

ఇప్పుడు బస్సు యాత్రలోను బారికేడ్లు పెట్టం, పరదాలు కట్టం, చెట్లు కొట్టం అని జగన్ రెడ్డి గాని, సజ్జల రెడ్డి గాని చెప్పే దమ్ముందా? కొద్ది రోజులు ముందే షాపులు మూసి వేయడం,బారికేడ్లు పాతి జనం రాకపోకలు అడ్డుకోవడం,ప్రతి పక్షాలను గృహ నిర్భందం చెయ్యడం, ప్రధాన రహదారుల పై అవసరం లేకున్నా దశాబ్దాలుగా వున్నరోడ్లకి ఇరు వైపులా పచ్చని పెద్ద,పెద్ద చెట్లను నిర్ధాక్షిణ్యంగా నరికి వెయ్యడం, గడచిన అయిదేళ్లుగా అయ్యగారు ఎక్కడ పాదం మోపిన ప్రతి చోట ప్రజలు పడరాని పాట్లు పడ్డారు. జగన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే ప్రజలు బెంబేలెత్తిపోయారు. ఇప్పుడు జగన్ రెడ్డి చేస్తున్న బస్సు యాత్రకు ఇంకెంత మంది ఇబ్బందులకు గురి అవుతారో చూడాలి.

రానున్న ఎన్నికల్లో మరోసారి ప్రజలను మభ్యపెట్టి గెలిచి జనాన్ని వెర్రి వాళ్ళను చేద్దామనుకొంటున్న జగన్ రెడ్డే వెర్రి వాడిగా మిగిలి పోక తప్పదు. జగన్ ని మరోసారి భరించలేమని, ఈ పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. జగన్ రెడ్డి తలకిందులుగా గా తప్పస్సు చేసినా ఘోర ఓటమి తప్పదు. అన్ని రంగాలను. అన్ని వర్గాలను సమస్యల వలయంలోకి నెట్టారు. జగన్ ఎన్ని సిద్దం సభలు పెట్టినా, సిద్ధం సభల్లో ఎన్ని అబద్దాలు చెప్పినా, ప్రతిపక్షాలపై, నచ్చని మీడియా వ్యవస్థల పై ఎంత విషం కక్కినా ప్రజలు మరోసారి అధికారం ఇచ్చి వారి జీవితాలను నాశనం చేసుకోవడానికి సిద్దంగా లేరు.

మాకొద్దు బాబోయ్ ఈ జగన్ అంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. యువతకి అరచేతిలో వైకుంఠం చూపించి అధికారంలోకి వచ్చి వారిని దగా చేశారు. ఏటా జాబ్ కేలండర్ ప్రకటిస్తామని, 2.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పి అధికారంలోకి వచ్చాక వారి మొర ఆలకించలేదు.మెగా డీఎస్సీ నిర్వహించి 23 వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి నిరుధ్యోగులను మోసం చేశారు.

ఇంత వరకు పోలీసులతో అబద్దాలు చెప్పించినందుకు, బారీ కేడ్లు పెట్టి, పరదాలు కట్టి ప్రజలను ఇబ్బందుకు గురి చేసినందుకు, పచ్చని చెట్లు కొట్టి పర్యావరణాన్ని నాశనం చేసినందుకు జగన్ రెడ్డి ప్రజలకు క్షమాపణలు చెప్పి బస్సు యాత్ర మొదలుపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం. నా బీసీ, నా ఎస్సీ, నా ఎస్టీ, నా మైనారిటీ ప్రచారంలో చెప్పి ఆచరణలో ఇన్నాళ్లు వాళ్లకు చేసిన ద్రోహం, పాపం బస్సు యాత్రతో తొలగిపోతుందన్న వెర్రి భ్రమల్లో ఉన్నారు. బస్సు యాత్ర కాదు జగన్ రెడ్డి సొంత సామాజిక యాత్ర అని పేరు పెట్టుకుంటే బాగుంటుంది. జగన్ రెడ్డి భ్రష్టపాలనపై రగులుతున్న ప్రజల చేతుల్లో నీ బస్సు కాలటం ఖాయం.

LEAVE A RESPONSE