Home » టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి

టీడీపీ హయాంలోనే ముస్లింల ఆర్థికాభివృద్ధి

– రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు రావాలి
-వైసీపీ హయాంలో వారికి రక్షణ లేదు
-మహిళలపై నేరాలు…మాఫియా రాజ్యం
-పథకాలు అమలు చేయకుండా మోసం
-ఓటు అనే ఆయుధంతో ఇంటికి పంపాలి
-నారా భువనేశ్వరి పిలుపు
-ముస్లిం మహిళల మధ్య బాబు జన్మదిన వేడుకలు

రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిగా చేసుకోవాలని నారా భువనేశ్వరి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మదినోత్సవం సందర్భంగా శనివారం కుప్పంలో ముస్లిం మహిళలు ఏర్పాటు చేసిన కేక్‌ను చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి కట్‌ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్టీఆర్‌ మతసామరస్యం కోసం పోరాడారు. ఆయన సిద్ధాంతాలకు అనుగుణంగా చం ద్రబాబు కూడా అనేక కార్యక్రమాలు నిర్వహించారు. ముస్లింలకు విద్య, రాజకీయాల్లో అవకాశాలను కల్పించారు. రాష్ట్రం లోని అన్ని సామాజిక వర్గాలకు చెందిన ప్రజలకు మేలు చేసిన నాయకుడు చంద్రబాబును వైసీపీ ప్రభుత్వం అక్రమంగా నంద్యాలలో అరెస్టు చేసింది. ఆ సమయంలో నాకు రాష్ట్ర ప్రజలు అండగా ఉన్నారన్నారు. ఇప్పుడు మీలో ఒకరిలా, కార్యకర్తగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నా. ఈ ప్రభుత్వం లో ముస్లింలకు భద్రతలేదు. ఎంతో మందిని వేధించి చంపారు. టీడీపీ శ్రేణులపైనా దాడులు, హత్య లకు పాల్పడ్డారు. మరోసారి అధికారమిస్తే రాష్ట్రం సర్వనాశనం అవుతుందన్నారు.

ముస్లింల పథకాలు నిలిపేసింది..
వైసీపీ నేతలకు మహిళలు అంటే ఏ మాత్రం గౌరవం లేదు. వైసీపీ ప్రభుత్వం మైనారిటీ మహిళలకు 45 ఏళ్లకే పెన్షన్‌ ఇస్తానని చెప్పి మోసం చేసింది. చంద్రబాబు గతంలో అమలు చేసిన పథకాలను అమలు చేస్తామని, సాయాన్ని మరింత పెంచుతామని చెప్పి ఆ పథకాలను నిలిపేసింది. మైనారిటీ పిల్లలకు ఉర్దూ పాఠశాలల్లో విద్యాబోధన చేసేందుకు టీచర్లను కూడా వైసీపీ ప్రభుత్వం నియమిం చడం లేదు. దాదాపు 80 శాతం భూములను వక్ఫ్‌ బోర్డు భూములను వైసీపీ ప్రభుత్వం కబ్జా చేసింది…రాష్ట్రవ్యాప్తంగా 40 వేల ఎకరాలను వైసీపీ ప్రభుత్వం ఆక్రమించిందన్నారు. టీడీపీ పాలన లో ముస్లిములకు రూ.140 కోట్లతో రంజాన్‌ తోఫాను అందించింది. రూ.200 కోట్లతో 30 వేల మంది ముస్లిం యువతులకు పెళ్లి కానుక అందించారు. మైనారిటీ వెల్ఫేర్‌ బోర్డు ఏర్పాటు చేసి రూ.2,500 కోట్లతో సబ్సిడీ రుణాలు అందించారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ఇచ్చి ముస్లిం విద్యార్థుల కు విద్యలో చేయూతనిచ్చారు. ఇమామ్‌, మౌజన్‌లకు నెలకు రూ.5 వేలు అందించిన ఘనత చంద్రబాబుది.

ముస్లింలకు విద్యుత్‌ బిల్లులో రాయితీలు కల్పించి తోడుగా నిలిచింది. చంద్రబాబు పాలనలో అమలు చేసిన 10 సంక్షేమ పథకాలను వైసీపీ ప్రభుత్వం నిలిపేసింది. ముస్లింలకు చెందాల్సిన డబ్బు మొత్తాన్ని వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందో వైసీపీ నేతలను నిలదీయాలని పిలుపుని చ్చారు. రాష్ట్రాభివృద్ధి కోసం చంద్రబాబు అనేక పరిశ్రమలను తీసుకొచ్చారు.. వైసీపీ పాలనలో ఏపీకి ఒక్క పరిశ్రమ రాకపోగా ఉన్న పరిశ్రమలు పక్క రాష్ట్రాలకు తరలి వెళ్లిపోయాయి. పోలవరం ప్రాజె క్టును గాలి కొదిలేశారు. ఏపీని గంజాయి, డ్రగ్స్‌, కల్తీ మద్యం, ఇసుక మాఫియా, భూ కబ్జాల్లో దేశం లోనే మొదటిస్థానంలో నిలబెట్టారు. అభివృద్ధి, భద్రతతో కూడిన జీవితం కావాలంటే చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు. టీడీపీ వస్తే సూపర్‌ సిక్స్‌ పథకాలను అమలు చేస్తారని, ఓటు అనే ఆయుధంతో వైసీపీని ఇంటికి పంపాలని పిలుపునిచ్చారు.

అండగా నిలవండి
ఎమ్మెల్సీ, కంచర్ల శ్రీకాంత్‌ మాట్లాడుతూ భువనమ్మకు సంఫీుభావం తెలిపేందుకు చంద్రబాబుతో మేమున్నామంటూ కార్యక్రమానికి వచ్చిన ముస్లిం సోదరీమణులకు అభినందనలు తెలిపారు. చంద్రబాబు గతంలో ముస్లిములకు అమలు చేసిన పథకాలను పునరుద్ధరించి మీకు అండగా నిలు స్తారని, రానున్న ఎన్నికల్లో మీరంతా అండగా నిలిచి ఆశీర్వదించాలని కోరారు. తెలుగుయువత రాష్ట్ర ప్రధానకార్యదర్శి అనిమిని రవినాయుడు మాట్లాడుతూ కుప్పం నియోజక వర్గాన్ని చంద్రబాబు చాలా అభివృద్ధి చేశారు. రాష్ట్రంలోనే అత్యంత వెనుకబడిన ప్రాంతమైన కుప్పం ను రాష్ట్రంలో మొదటి స్థానంలోకి తీసుకురావడానికి ఆయన చేసిన కృషి మరువలేనిదన్నారు. రానున్న ఎన్నికల్లో అఖండ మెజార్టీతో గెలిపించి ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు కుప్పం ప్రజలు కంకణబద్ధులు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ముస్లిం మహిళలు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

భువనేశ్వరి క్యాంపు సైట్‌లో జన్మదిన వేడుకలు
టీడీపీ అధినేత చంద్రబాబు 75వ జన్మదిన వేడుకలు కుప్పం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీలోని నారా భువనేశ్వరి బస కేంద్రంలో శనివారం ఘనంగా జరిగాయి. తెలుగు యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనిమిని రవినాయుడు, భువనేశ్వరి టీమ్‌ ఆధ్వర్యంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు జరిగాయి. రవి నాయుడు ఏర్పాటు చేసిన కేక్‌ను భువనేశ్వరి కట్‌ చేసి టీమ్‌ సభ్యులకు పంచారు. ఈ వేడుకల్లో ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్‌, డాక్టర్‌ సురేష్‌, నారా భువనేశ్వరి టీమ్‌, కుప్పం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a Reply