Home » జగన్మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు

జగన్మోహన్ రెడ్డి ఓ అబద్ధాల కోరు

-పచ్చి నాటకాల రాయుడని ప్రజలకు తెలిసింది
-గులకరాయుగా జన్మించి కంకర రాయిగా మారిన హత్యాయత్నం కేసును పోలీసులు ఏమి చేస్తారో?
– హత్యాయత్నం కేసులో హత్యకు ఉపయోగించిన ఆయుధం పోలీసులకు దొరకాలి
-అజిత్ సింగ్ నగర్ లో గులకరాళ్లన్నవి -లేకపోవడంవల్లే దాన్ని కంకర రాయిగా మార్చారట
-జగన్మోహన్ రెడ్డి నుదుటికి వేసుకుంటున్న పట్టి సైజు రోజుకింత పెరుగుతోంది
-అది నిజమైన గాయమైతే పట్టి సైజు తగ్గేది
– వివేకా హత్య గురించి మాట్లాడొద్దంటూ కోర్టును ఆశ్రయించిన రోజే తీర్పా… ఆశ్చర్యకరం
-సాక్షి దినపత్రికలో మాత్రం అడ్డదిడ్డమైన కథనాలు రాయొచ్చా?
-నాపై ఉన్నది కేసుల పుట్ట అయితే… నీపై కేసుల గుట్ట ఉన్నది జగన్మోహన్ రెడ్డి
-తెదేపా అధినేత నారా చంద్రబాబు నాయుడు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన నరసాపురం ఎంపీ రఘురామకృష్ణం రాజు

స్వేచ్ఛా వాయువులు పీల్చడానికి దేశం నుంచి బ్రిటిష్ వాళ్లను తరిమి కొట్టిన దాని కంటే మించి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పారద్రోలడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని నర్సాపురం ఎంపీ, తెలుగుదేశం పార్టీ నాయకులు రఘురామకృష్ణంరాజు తెలిపారు. చేయూత పథకానికి జగన్మోహన్ రెడ్డి చెయ్యి ఇచ్చారని, ఇదొక్కటే కాదు, అన్ని సంక్షేమ పథకాల పరిస్థితి అలాగే తయారయిందన్నారు.

శనివారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఓ అబద్దాలకోరని, వచ్చి నాటకాల రాయుడని రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిపోయిందని, అందుకే ప్రజలంతా బయటకు వచ్చి నిర్భయంగా మాట్లాడుతున్నారు . పోలీసుల సహకారంతో ప్రజలపై వైకాపా నేతలు, కొంత రుబాబు చేయాలని చూస్తున్నారని, అయినా ప్రజలు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి ని ఇంటికి పంపాలని డిసైడ్ అయ్యారన్నారు.

జగన్మోహన్ రెడ్డి నిన్న ఎక్కడో జనం లేని సభలో మాట్లాడుతూ.. మరో 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే, మీ పిల్లలను తలెత్తుకునేలా చేస్తానని…ప్రపంచంలోనే ఉన్నత స్థాయి వ్యక్తులుగా తీర్చిదిద్దుతానని పేర్కొనడం హాస్యాస్పదంగా అనిపించిందన్నారు. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలిచేది లేదు… ఒకవేళ చిలిపిగా మళ్లీ గెలిచాడనే అనుకుందాం.. జగన్మోహన్ రెడ్డి గెలిస్తే, రాష్ట్రంలోని పిల్లలకు భవిష్యత్తు అన్నదే లేకుండా పోతుందన్నారు. ప్రస్తుతం స్కూళ్ల వద్దే నార్కోటిక్స్ ( మాదకద్రవ్యాలు ) అమ్మిస్తున్నారని , దేశానికే మాదకద్రవ్యాల డెలివరీ కేంద్రంగా విశాఖపట్నం పోర్ట్ మారిందని గుర్తు చేశారు.

ఇటీవల విశాఖపట్నం పోర్ట్ కు 25 వేల కిలోల మాదకద్రవ్యాల కంటైనర్ వచ్చిందని, వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి అంత క్వాలిటీ చాలని అన్నారు. ఇంత పెద్ద మొత్తం క్వాంటిటీకి మాదకద్రవ్యాలను పిల్లలకు అందుబాటులో ఉంచుతూ, వాళ్ల భవిష్యత్తును సర్వనాశనం చేసే దిశగా జగన్మోహన్ రెడ్డి అడుగులు వేస్తున్నారు. మళ్లీ జగన్మోహన్ రెడ్డి అధికారం లోకి వస్తే, ఇప్పుడు బాల్యంలో ఉన్న వాళ్లకు భవిష్యత్తు అన్నది లేకుండా పోతుందని రఘురామ కృష్ణంరాజు హెచ్చరించారు. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త అని మీ పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, తెదేపా అధినేత చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని బలపరిచి, కూటమిని గెలిపించుకోవాలని కోరారు.

చంద్రబాబు నాయుడు అధికారంలోకి వస్తే, ఇక్కడే కాదు… అన్ని చోట్ల యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. అదే జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ గెలిపిస్తే, చిన్నారులను బలవంతంగా డ్రగ్ ఎడిక్ట్స్ గా మార్చే ప్రమాదం లేకపోలేదని హెచ్చరించారు . జగన్మోహన్ రెడ్డికి మరో 10 ఏళ్ల పాటు అవకాశం ఇస్తే, తన ఆస్తులను 50% పెంచుకుంటారే తప్పితే రాష్ట్రానికి ఒరిగేది ఏమీ ఉండదన్నారు .

విశాఖపట్నం పోర్ట్ కు వచ్చిన మాదకద్రవ్యాల కంటైనర్ ఎవరిదని ప్రజలంతా మూకుమ్మడిగా జగన్మోహన్ రెడ్డి ప్రశ్నించాలని రఘురామకృష్ణం రాజు కోరారు. నా కంఠశోష తప్పితే, ఎవరూ దాని గురించి మాట్లాడడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నం కు దిగుమతి అయిన మాదకద్రవ్యాల కంటైనర్ తో జగన్మోహన్ రెడ్డికి, ఎటువంటి సంబంధం లేకపోతే, ముందు ఆ కేసు తేల్చాలని డిమాండ్ చేశారు.

గులకరాయి కాస్త… కంకర రాయి మారింది
విజయవాడ అజిత్ సింగ్ నగర్ లో జగన్మోహన్ రెడ్డికి నుదుటికి తగిలిన గులకరాయి కాస్త ఇప్పుడు కంకర రాయిగా మారిందని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. గులకరాయు వచ్చి జగన్మోహన్ రెడ్డి కణతకు తగిలిందని చెప్పారని, అదే కంటికి తగిలిందని చెబితే ఒక కన్ను మూసుకొని పట్టి వేసుకుంటే, ఖైదీ కన్నయ్య లాగా దరిద్రంగా ఉంటాడని… అలా కంటిని మూసుకొని పట్టి కట్టుకొని తిరిగితే బాగుండదని స్మార్ట్ గా ప్లాస్టర్ వేసుకుని తిరిగేలా ముందే ప్లాన్ చేశారన్నారు.

ఇక స్థానిక వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి వెల్లంపల్లి శ్రీనివాస్ మాత్రం, జగన్మోహన్ రెడ్డి కణతకు వచ్చి తగిలిన గులకరాయి, తన కంటికి వచ్చి తగిలిందని కన్నుకు పట్టి కట్టుకొని తిరుగుతున్నాడన్నారు. జగన్మోహన్ రెడ్డి పై గులకరాయి ద్వారా హత్యా ప్రయత్నం చేశారని పోలీసులు కేసును నమోదు చేస్తే… ఐపీసీ సెక్షన్ 307 ప్రకారం హత్యకు ఉపయోగించిన ఆయుధం పోలీసులకు దొరకాలన్నారు.

అయితే అజిత్ సింగ్ నగర్ లో గులకరాళ్లు లేవని, గులకరాయితో దాడి జరిగిందని కేసు పెడితే, ఆ కేసు నిలబడే అవకాశం లేదని భావించి, దాన్ని కంకర రాయిగా మార్చారన్నారు. ఎక్కడైనా భవన నిర్మాణం జరుగుతూ ఉంటే, అక్కడ కంకర రాళ్లు ఉంటాయన్నారు. అదే మన ప్రాంతంలో చిన్న బెడ్ ముక్క అని అంటారన్నారు. ఈ కేసులో చాలా హడావిడి చేయాలనుకున్నారు. కానీ కేసు బూమరాంగ్ అయ్యింది.

ఈ కేసులో సతీష్ అనే కుర్రవాడిని, దుర్గారావు అనే తెలుగుదేశం పార్టీ సానుభూతిపరునిపై కేసు నమోదు చేశారన్నారు. అదే వైకాపా సానుభూతిపరులపై కేసు పెడితే, కోడి కత్తి కేసు లాగా ఎన్నికలకు ముందే అల్లరి అయిపోతే బాగుండదని, తెదేపా సానుభూతిపరునిపై కేసు పెట్టారన్నారు.

ఈ కేసులో ఇంకో ట్విస్ట్ ఏమిటంటే… సతీష్ తండ్రి తన కుమారుడు ముఖ్యమంత్రి పై గులకరాయితో దాడి చేశాడని తెలుసుకొని, పోలీస్ స్టేషన్ కు వెళ్లకుండా, స్థానిక వీఆర్వో వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశాడట. వీఆర్వో పోలీసులకు సమాచారం ఇవ్వగా, వారు సతీష్ ను అదుపులోకి తీసుకున్నారు. సతీష్ కూడా అవును సార్ నేను ముఖ్యమంత్రి పై గులక రాయితో దాడి చేశానని అంగీకరించారట. దానితో సతీష్ ను పోలీసులు పట్టుకుపోయారు. ముఖ్యమంత్రి పై ఎవరు దాడి చేయమని నిన్ను ప్రోత్సహించారని సతీష్ ను ప్రశ్నించగా , ఆ కుర్రాడు దుర్గారావు పేరు చెప్పడంతో… ఎటువంటి విచారణ లేకుండానే, దుర్గారావు పై కేసు నమోదు చేశారన్నారు.

కంకర రాయితో హత్యలు చేయగలిగితే ఇంకా కత్తులు, గొడ్డలి వంటి ఆయుధాలు అవసరమే లేదు
కంకర రాయితో ఇతరులను హత్య చేయగలిగితే ఇంకా కత్తులు, గొడ్డలి వంటి ఆయుధాలతో అవసరమే లేదని రఘురామకృష్ణం రాజు అపహాస్యం చేశారు. ఇవన్నీ వేస్ట్ అని సింపుల్ గా ఒక కంకర రాయితో హత్య చేయగలిగితే, భవిష్యత్తులో అందరూ కంకర రాళ్లతోనే హత్యలు చేస్తారేమోనంటూ ఎద్దేవా చేశారు.

ఈ కేసును జగన్మోహన్ రెడ్డి ఎలా వాడుకోవాలోనని చాలా ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. జగన్మోహన్ రెడ్డి పై గులకరాయితో దాడి జరిగిన అనంతరం వైద్య బృందం ఆయనకు ఎటువంటి చికిత్సను అందజేశారన్నది తెలియాల్సిన అవసరం ఉంది. 16 వేల మంది గోపికల మాదిరిగా 16 మంది వైద్యులు జగన్మోహన్ రెడ్డికి చికిత్సను అందజేశారని, అందులో తమ శాఖకు సంబంధం లేకపోయినా కిడ్నీ, లివర్, హార్ట్ స్పెషలిస్టులు పాల్గొన్నారంటూ అపహాస్యం చేశారు .

దాడి జరిగిన అనంతరం రెండు గంటల పాటు బస్సు యాత్రను కొనసాగించిన జగన్మోహన్ రెడ్డి, ఆ తరువాత ఆసుపత్రికి వెళ్లారని గుర్తు చేశారు. ఏదైనా గాయమైతే మొదట పెద్ద పట్టి వేస్తారని, గాయం మానే కొద్దీ పట్టి సైజును సాధారణంగా తగ్గిస్తారని రఘురామకృష్ణం రాజు పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి కణత తగిలిన గాయానికి సంబంధించి ఇదంతా రివర్స్ గా కనిపిస్తోందన్నారు.

జగన్మోహన్ రెడ్డి ఆసుపత్రి నుంచి చేతులు ఊపుకుంటూ బయటకు వచ్చే సమయంలో, ఆయన నుదుటికి ఉన్న పట్టిని, భీమవరం వచ్చినప్పుడు ఉన్న పట్టిని గమనిస్తే ఆస్పత్రి నుంచి బయటకు వచ్చే సమయంలో పట్టి సైజు చిన్నగా ఉన్నదని, భీమవరం వచ్చే సమయంలో అది కాస్త పెద్దదైందని, కాకినాడ సభలో పాల్గొనే సమయంలో మరింత పెద్దదైందన్నారు. నిజమైన గాయమైతే, గాయం తగ్గే కొద్దీ, పట్టి సైజు తగ్గుతుందన్నారు.

సాధారణంగా సినిమాలలో కంటిన్యూ షెడ్యూల్ అని ఉంటుందని, ఆ సమయంలో నటుడికి వేసే పట్టి విషయంలో అసిస్టెంట్ డైరెక్టర్లు శ్రద్ధ వహిస్తారన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి వద్ద పనిచేసే అసిస్టెంట్ డైరెక్టర్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని అపహాస్యం చేశారు. ఆసుపత్రిలో డాక్టర్లు, నర్సులు కలిసి జగన్మోహన్ రెడ్డికి అందించిన వైద్యం ఏమిటన్న దానిపై మెడికో లీగల్ రిపోర్టు అన్నది కంపల్సరీ. హత్యా ప్రయత్నం జరిగినప్పుడు గాయం ఎంత లోతుగా తగిలింది… ఎంత వెడల్పుతో గాయమైందన్నది మెడికో లీగల్ రిపోర్టులో తేటతెల్లమవుతుందన్నారు.

అయితే జగన్మోహన్ రెడ్డికి గీరితే వచ్చేంత రక్తం కూడా రాలేదని, అందుకే గాయానికి కుట్లు వేశారని కాకుండా, ప్లాస్టిక్ సర్జరీ చేశారనే కహాని ముందే సిద్ధం చేశారన్నారు. ఎవరికి పెద్ద గా హాని చేయని ఈ కహానితో, రేపు ప్లాస్టిక్ సర్జరీ బాగా చేశారని, గాయం ఆనవాళ్లు కూడా తెలియలేదని మెచ్చుకుంటారేమో నన్నారు.

దావూద్ ఇబ్రహీం కంటే జగన్మోహన్ రెడ్డి పైనే కేసులు ఎక్కువ
అంతర్జాతీయ మోస్ట్ వాంటెడ్ క్రిమినల్ దావూద్ ఇబ్రహీం పై కంటే, జగన్మోహన్ రెడ్డి పైనే ఎక్కువ కేసులు ఉన్నాయని సిబిఐ మాజీ డైరెక్టర్ ఒకరు ట్విట్ చేసిన విషయం తెలిసిందేనని రఘురామ కృష్ణంరాజు గుర్తు చేశారు. ఆ ట్విట్ చూసి, జగన్మోహన్ రెడ్డి అండ్ గ్యాంగ్ ఏడుచుకున్నారని తెలిపారు.

ఏకాదశి శుక్రవారం నాడు మంచి రోజని ఉండి అసెంబ్లీ నియోజకవర్గానికి అభ్యర్థిగా నా తరఫున నా సతీమణి, కుమారుడు ఉండి ఎమ్మార్వో కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం నాపై మోపిన కేసులను అఫిడవిట్లో ప్రస్తావించడం జరిగింది. దానికి పనికిమాలిన సాక్షి దినపత్రికలో కేసుల పుట్ట అని వార్తా కథనాన్ని రాశారని రఘురామకృష్ణం రాజు ఆగ్రహం వ్యక్తం చేశారు.

జగన్మోహన్ రెడ్డి ఈనెల 24వ తేదీన నామినేషన్ దాఖలు చేయబోతున్నారని, అఫిడవిట్లో ఆయన ప్రస్తావించే కేసులు గుట్ట గా ఉంటాయన్నారు . నాపై కేసుల పుట్ట అని రాసిన సాక్షి దినపత్రికలో 25వ తేదీన కేసుల గుట్ట అని రాస్తారా అంటూ ప్రశ్నించారు. ఉమ్మడి ఆస్తులు రెండు నుంచి ఐదు వేల కోట్ల రూపాయలు ఉంటాయని జగన్మోహన్ రెడ్డి పేర్కొంటారని, అలాగే జగన్మోహన్ రెడ్డి పైన ఉన్న కేసుల వివరాలను కూడా ప్రచురించాలని జగన్మోహన్ రెడ్డి, భారతి రెడ్డిలకు సూచించారు.

జగన్మోహన్ రెడ్డి పైనున్న కేసుల వివరాలను తెలియజేయడానికి టెంపోలు సరిపోవని, లారీలే కావాలని ఎద్దేవా చేశారు. నాకు నరసాపురం ఎంపీ స్థానం దక్కకుండా, జగన్మోహన్ రెడ్డే చేశారు. ఆయన బలాన్ని చూసి అభినందించా. ఇప్పుడు వైకాపాకు టిడిపి వ్యవహారాలు అవసరమా? అంటూ ప్రశ్నించారు. నాకున్న సమాచారం మేరకు ఉండి అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశాను. రేపు అధిష్టానం నుంచి స్పష్టత వస్తుంది. అప్పుడు కూడా కన్ఫ్యూజన్ తీరిపోయిందని రాసుకుంటావో, లేకపోతే కన్ఫ్యూజన్లో ఉన్నానని రాసుకుంటావో నీ ఇష్టం అని అపహాస్యం చేశారు .

చేతికందని చేయూత పథకం డబ్బులు
జగన్మోహన్ రెడ్డి ఇటీవల బటన్ నొక్కి విడుదల చేసిన చేయూత పథకం డబ్బులు ఇంతవరకూ లబ్ధిదారుల చేతికి అందలేదని రఘురామ కృష్ణంరాజు తెలిపారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడాతెలియని అయోమయ పరిస్థితి నెలకొందన్నారు. విద్యా దీవెన పథకం ద్వారా డబ్బుల విడుదలకు జగన్మోహన్ రెడ్డి గతం లో బటన్ అయితే నొక్కారని, కానీ లబ్ధిదారుల అకౌంట్లో డబ్బులు జమ కాలేదన్నారు.

ఇదంతా ఒక డ్రామా అని… ఇదొక డ్రామా కంపెనీ అని రఘురామ కృష్ణంరాజు విమర్శించారు. వైకాపా పార్టీ, ఆ పార్టీ ప్రభుత్వం డ్రామా కంపెనీ అన్న ఆయన, మేలు జరిగితేనే ఓటు వేయాలనిచెప్పడం తప్ప, ప్రజలకు చేసిన మేలు అంటూ ఏమీ లేదన్నారు. ప్రజల ప్రాణాలు తీయటం తప్ప… అది మద్యం ద్వారా అయినా, ఇంకొక పద్ధతిలోనైనా అని అన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని బదిలీ చేయాలి
రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పై పెద్ద ఎత్తున ఫిర్యాదులు అందినప్పటికీ, బదిలీ చేయకపోవడం వల్ల ఎన్నికల సంఘంపై ప్రజలకున్న విశ్వాసం సన్నగిల్లి ప్రమాదం ఉందని రఘురామకృష్ణంరాజు హెచ్చరించారు. తక్షణమే ఎన్నికల సంఘం కళ్ళు తెరిచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తో పాటు, పూర్తిస్థాయి ఇన్చార్జ్ వ్యవహరిస్తున్న డీజీపీ ని, ఇంటలిజెన్స్ చీఫ్ తో పాటు, నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న ఇతర అధికారులను బదిలీ చేయాలన్నారు.

ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డిజిపి తో పాటు ఇతర అధికారులను బదిలీ చేస్తారని భావించాం. ఇప్పటికే ఆలస్యం అయ్యింది. 24 గంటల సమయం గడిచిపోయింది. ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్యానల్ సభ్యుల జాబితాను పంపించాలి.

డీజీపీని ముందు బదిలీ చేస్తే, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి తన అస్మదీయులతో కూడిన ప్యానల్ పంపే అవకాశం ఉందని, తొలుత ప్రభుత్వ కార్యదర్శిని బదిలీ చేసిన తర్వాతే మిగతా వారిని బదిలీ చేస్తారేమోనని కామన్ సెన్స్ తో చెబుతున్నానన్నారు. రేపు సాయంత్రం లోగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని మారుస్తారేమోనని, ఆయన ఉద్యోగం ఎక్కడికి పోదని, ఒక నెల రోజులపాటు విశ్రాంతి మాత్రం తీసుకోమని చెబుతారన్నారు.

Leave a Reply