టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కన్నుమూత

4

ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు గత కొన్ని రోజుల అనారోగ్యం బాధపడుతూ విజయవాడ లోని ఒక ప్రవేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతు ఈ రోజు తుది శ్వాస విడిచారు.ఆయన మృతిపట్ల టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్‌ సంతాపం వ్యక్తం చేశారు. అర్జునుడు పార్టీ కోసం చిత్తశుద్ధితో పనిచేసిన సైనికుడని, ఆయన లేని లోటు పూడ్చలేనిదన్నారు. కాగా, ఇటీవల అర్జునుడు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న సమయంలో పార్టీ అధినేత చంద్రబాబు, ఆయన వద్దకు వెళ్లి ధైర్యం చెప్పారు. ఆయన కుటుంబానికి మేం ఉన్నామని భరోసా ఇచ్చారు.