-ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలి
-ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఅర్ ఉండి లేనట్లే
-వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల
-ఉట్కూర్ మండల కేంద్రం లో వైఎస్ షర్మిలకి అడుగడుగునా జన నీరాజనాలు
– పాదయాత్ర గా ఉట్కూర్ కి చేరుకున్న వైఎస్ షర్మిలకి ఘన స్వాగతం పలికిన గ్రామస్థులు
-ఉట్కూర్ పెద్ద చెరువు పై వైఎస్ షర్మిలకి వినతి పత్రం అందించిన రైతులు
– జి ఓ 69 ప్రకారం నారాయణ పేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం నిర్మాణం చేపట్టి.. తమ చెరువులకు నీళ్ళు ఇచ్చేలా ప్రభుత్వం పై ఒత్తిడి తేవాలని వినతి
మక్తల్ : కేసీఆర్ సర్కారుపై వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల మరోసారి విరుచుకుపడ్డారు. ఓట్ల సమయంలో తప్ప కేసీఆర్ కనిపించరని, ఓట్లు ఉంటేనే ఆయన బయటకొస్తారని ధ్వజమెత్తారు. తాము అధికారంలోకి వస్తే వైఎస్ సంక్షేమ పథకాలను అమలుచేస్తామని, తాను పార్టీ పెట్టిందే దానికోసమని ఆమె స్పష్టం
చేశారు. షర్మిల ఇంకా ఏమన్నారంటే.. వైఎస్సార్ పథకాలు ఇంకా ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నాయి.వైఎస్సార్ ఇంకా కోట్ల మంది తెలుగు ప్రజల గుండెల్లో బ్రతికే ఉన్నారు.జలయజ్ఞం తో సహా అన్ని పథకాలు అమలు చేసిన ఘనత వైఎస్సార్ ది.మైనారిటీలకు వైఎస్సార్ 4 శాతం రిజర్వేషన్లు కల్పించారు.
ముఖ్యమంత్రి అంటే వైఎస్సార్ లా ఉండాలి. ఇప్పుడున్న ముఖ్యమంత్రి కేసీఅర్ ఉండి లేనట్లే. కేసీఅర్ చేసింది ఏమీ లేదు.. ఏ వర్గానికి న్యాయం చేయలేదు. పరిపాలన చేతకాక నాలుగు లక్షల కోట్లు అప్పులు చేసి పెట్టాడు.కేసీఅర్ హయాంలో బాగుపడిన వర్గం లేదు..అంతా మోసమే.
పథకాలు అమలు చేయడం చేతకాదు. వైఎస్సార్ ప్రవేశ పెట్టిన పథకాలు సైతం బంద్ పెట్టారుకేసీఅర్ ఏం చేసినా ఓట్ల కోసమే.ఎప్పుడొచ్చినా ఓట్ల కోసమే.మనం నమ్ముతున్నాం…ఓట్లు వేస్తున్నాం…తర్వాత అంతా బోడి గుండు.8 ఏళ్లుగా కేసీఅర్ ఆడింది ఆట..పడింది పాట. బీజేపీ ,కాంగ్రెస్ పార్టీ కు ఏనాడు కేసీఆర్ ను ప్రశ్నించలేదు. కాంగ్రెస్ లో గెలవడం తెరాస లో పోవడం. బీజేపీ మతతత్వ పార్టీ. తెలంగాణ ను బీజేపీ మోసం చేసింది. విభజన హామీలు నెరవేర్చి ఉంటే… మన పిల్లలకు కనీసం ఉద్యోగాలు అయినా వచ్చి ఉండేవి. బీజేపీ కాంగ్రెస్ కు సైతం ఓట్లు వేయిద్దు. ఈ రెండు పార్టీలకు రాజకీయాలు తప్పా వైఎస్సార్ సంక్షేమం గురించి పట్టదు.వైఎస్సార్ సంక్షేమ పాలన కోసమే పార్టీ పెట్టాం. వైఎస్సార్ ప్రతి పథకం అమలు చేసి చూపిస్తా.