టీచర్లు సమయానికి రాలేరా?

ఫేసియల్ రికగ్నైజేషన్ యాప్ అంటే ఉపాథ్యాయులు లేక ఉపాథ్యాయునిలు ఉదయం తొమ్మిది గంటలకే పాఠశాలకు వచ్చి ఆ యాప్ లో ఫోటో డౌన్లోడ్ చేయాలి. ఇది రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన పద్ధతి..
దీనిని ఉపాధ్యాయసంఘాలు ఎందుకు ఖండిస్తున్నాయంటారు?

మేము చదువుకునేటప్పుడు పాఠశాలకు ప్రేయర్ జరగక ముందే మేము రావాలని, మా ఉపాథ్యాయులు మమ్మల్ని ఆదేశించేవారు. ఆ తరువాత ఒక్క నిమిషం ఆలస్యంగా వచ్చిన మమ్మల్ని బయటే నిలబెట్టి, ఈత బెత్తాలతో ఆలస్యాన్ని బట్టి బాది లోపలికి అనుమతించేవారు. ఈత బెత్తాల దెబ్బలకు చేతులు వాసి పోయినా, గుడ్లనిండా నీళ్ళు నింపుకొని కిక్కిరుమనకుండా లోపలికి అనుమతించిందే గొప్పభాగ్యమని పరుగెత్తుకుంటూ వచ్చి, గోనె సంచి పరుచుకొని కూర్చునేవాళ్ళం.

నేను చిన్నప్పుడు అంటే 1999 లలో మా ఉపాథ్యాయులు ఒకటి లేక రెండు బస్సులు మారి, కొందరు అయితే దాదాపు మూడు కిలోమీటర్లు నడిచి లేక సైకిల్లు తొక్కుకుంటూ, ఠంచనుగా మాకంటే ముందే పాఠశాలకు వచ్చి ఉండేవారు. ఆ దినాలలో వారి జీతమంతా దాదాపు మూడు వందలనుండి వెయ్యి లోపే ఉండేది. అయినా మా ఉపాథ్యాయులు అంత డెడికేషన్ గా ఉండేవాళ్లు. ఇప్పుడు ఆ డెడికేషన్ కనిపించట్లేదని ప్రభుత్వానికి అనేక ఫిర్యాదులు వెళుతున్నాయి. ప్రస్తుతం ఉపాథ్యాయులు దాదాపు 50 వేల నుండి లక్ష వరకు జీతాలు తీసుకుంటున్నారు , విద్యార్థులకు ప్రభుత్వాలకి జవాబు దారితనంగా ఉండాల్సిన బాధ్యత వారికి ఉంది కదా! ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి ప్రజల మద్దతు తప్పనిసరిగా ఉండాలి కదా! ఉపాథ్యాయ సంఘాల వాళ్ళు చెబుతున్న కారణాలు చాలా సిల్లీగా ఉన్నాయి. ఇలాంటి ఒత్తిడి వల్ల హాజరు తగ్గుతుందట?
అంటే మీరు మీ విద్యార్థులకు కూడా ఇదే బోధిస్తారా ఏంటి ?
ఉపాధ్యాయ సంఘాల వారు.. కొంచెం ఆలోచించండయ్యా?
ఏమైనా అంటే ప్రభుత్వ కక్ష సాధింపంటారా?
క్రమశిక్షణగా మా బిడ్డలను పెంచాల్సిన మీరే, క్రమశిక్షణా చర్యలు తీసుకోకూడదని జీతాలిస్తున్న ప్రభుత్వాన్ని బెదిరిస్తారా ఏంటి….
విధ్యాలోకంలో మార్పులు తెచ్చి రాష్ట్రాన్ని విధ్యాంద్రప్రదేష్ గా మార్చాలి అని జగనన్న చేసే యజ్ఞంలో మిమ్మల్ని మీ డ్యూటీ సరిగ్గా చేయమంటున్నారు
అంతే కానీ మిమ్మల్ని బరువులు మోయమని చెప్పలేదు కదా..

ఓ సామాన్యుడు

Leave a Reply