Suryaa.co.in

Andhra Pradesh

పాలన వ్యవస్థ గాడి తప్పినప్పుడు… ప్రజలకున్న చిరు ఆశ న్యాయ వ్యవస్తే

– నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణంరాజు

ఎగ్జిక్యూటివ్ గాడి తప్పి, దారి తప్పి పయనిస్తున్నప్పుడు ప్రజలకు ఉన్న చిరు ఆశ జ్యుడీషరీ యేనని నరసాపురం ఎంపీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు రఘు రామకృష్ణంరాజు అన్నారు. న్యాయ వ్యవస్థ న్యాయం చేస్తున్నప్పటికీ, అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేస్తున్న పోలీసులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం, అన్యాయాన్ని ప్రోత్సహిస్తున్నట్లుగా ఉందన్నారు.

పోలీసు ముష్కరులు అక్రమంగా అరెస్టు చేస్తున్న వారిని రిమాండ్ కు పంపించకుండా వెనక్కి తిప్పి పంపడం ద్వారా న్యాయస్థానాలు న్యాయమే చేస్తున్నాయని అన్నారు. అయితే, తప్పుడు కేసులు బనాయించి అమాయకులను అరెస్టు చేస్తున్న పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. శుక్రవారం రచ్చబండ కార్యక్రమంలో భాగంగా రఘురామకృష్ణంరాజు మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ… యధా రాజా థదా పోలీస్ అని, పాలకుల ప్రాపకం కోసం పనిచేస్తున్న ఓ నలుగురు ఐదుగురు పోలీసు అధికారులను కృష్ణ జన్మాస్థానానికి పంపిస్తే బుద్ధి వస్తుందన్నారు. ఏపీ సి ఐ డి అధికారి సునీల్ నాయక్ సైతం ఇదే విషయాన్ని ప్రస్తావించారని గుర్తు చేశారు. తాము అరెస్టు చేసిన వారిని కోర్టు వదిలివేయమని చెబుతుంది తప్పితే, స్టిచర్స్ పాసు చేయలేదని పేర్కొన్నారన్నారు.

న్యాయాన్ని కాపాడిన చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్
మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కు హైకోర్టులో బెయిల్ లభిస్తుందని అనుకున్నామని కానీ చీప్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ ఎటువంటి ఆధారాలు లేకుండానే ఐపీసీ 474 సెక్షన్ కింద కేసులు నమోదు చేయడాన్ని తప్పు పట్టారన్నారు. సి ఐ డి పోలీసులు 15 రోజులపాటు రిమాండ్ అడగగా, ఐపీసీ 474 సెక్షన్ కింద కేసు నమోదు చేయడానికి ఆధారాలు లేవని తోసిపుచ్చుతూ, ఇతర సెక్షన్ల కింద స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపాలని ఆదేశించారని తెలిపారు. అయ్యన్నపాత్రుడును అరెస్టు చేయడానికి బీసీ సామాజిక వర్గానికి చెందిన అధికారిని పురమాయించడం పరిశీలిస్తే, తమ ప్రభుత్వ పెద్దల దమన నీతి స్పష్టమవుతుందన్నారు.

అయ్యన్నపాత్రుడును విశాఖపట్నం ఎందుకు తరలించారు అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ అయ్యన్నపాత్రుడును పోలీసు కస్టడీకి ఇచ్చి ఉంటే, ముసుగులు వేసుకుని వచ్చి తనని దండించినట్లుగానే ఆయన్ని దండించే వారన్నారు. ముందు మైల్డ్ గా ఆయనకు కోటింగ్ ఇచ్చి, రాత్రి తీరిక గా వాయిద్దామని భావించినట్లుగా ఉన్నారని, అందుకే 15 రోజుల కస్టడీని అడిగి ఉంటారని తెలిపారు. దైవ అనుగ్రహం ప్రజల ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు అవిరాల కృషి వల్ల చిరుకొట్టుడుతోనే అయ్యన్నపాత్రుడు బయటపడడం సంతోషాన్ని కలిగించే విషయమని అన్నారు. ఈ కేసు లో అయ్యన్నపాత్రుడుకు బెయిల్ మంజూరు చేస్తూ, కస్టడీకి నిరాకరించిన చీఫ్ మెట్రోపాలిటన్ న్యాయమూర్తి కి ధన్యవాదాలు తెలియజేశారు.

నిస్సిగ్గుగా హైకోర్టుకు అప్పీల్ కు వెళ్తారా?
అయ్యన్న ను సిఐడి పోలీసులు 15 రోజుల కస్టడీకి కోరగా చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ తిరస్కరిస్తే, సిఐడి పోలీసులు నిస్సిగ్గుగా హైకోర్టుకు అప్పీల్ కు వెళ్లడం విడ్డూరంగా ఉందని రఘురామకృష్ణంరాజు అన్నారు. కోటానుకోట్లు తినేసిన వారు ఉండగా, రెండు సెంట్ల స్థల వివాదము గురించి తప్పుడు అభియోగాలను మోపి, 15 రోజుల కస్టడీకి ఇవ్వాలని దుర్మార్గమని మండిపడ్డారు. సిఐడి పోలీసుల ఈ ధమన నీతి పై హైకోర్టు స్టిచర్స్ పాస్ చేస్తుందని అనుకుంటున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి దాఖాలు చేస్తున్న పిటిషన్లపై కోర్టులలో కేసులు ఎందుకు లిస్ట్ అవుతున్నాయో, ఆయనకు వ్యతిరేకంగా దాఖాలు చేసే పిటిషన్లు ఎందుకనీ లిస్ట్ కావడం లేదో అర్థం కావడం లేదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి భగవంతుడి అండదండలు పుష్కలంగా ఉన్నాయేమోనన్న రఘురామకృష్ణం రాజు, ఇంత అన్యాయం చేసే వాడిని… ఇంత పక్షపాతంగా భగవంతుడు అనుగ్రహిస్తాడా? తనదైన శైలి లో సెటైర్లు వేశారు. దుర్మార్గులకు దేవుడు సహకరిస్తాడని తాను అనుకోవడం లేదన్నారు. ఎవరి సహకారంతో కేసులు లిస్ట్ అవుతున్నాయో అందరికీ తెలుసు నన్నారు. తాను లా అండ్ జస్టిస్ కమిటీలో సభ్యునిగా ఉన్నానని ఈ విషయాన్ని కమిటీ సమావేశంలో లేవనెత్తుతానని తెలిపారు. రిజిస్ట్రార్లకు మార్గదర్శకాలు ఉండాలని రఘురామకృష్ణంరాజు అన్నారు.

పవన్ కు భద్రత కల్పించాలని అమిత్ షాకు లేఖ రాస్తా
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇంటి వద్ద కొంతమంది వ్యక్తులు రెక్కీ నిర్వహించడం ఆందోళన కలిగించే అంశమని రఘురామకృష్ణంరాజు అన్నారు. ఏపీ పర్యటనకు వెళ్లినప్పుడు జరగరాని సంఘటన జరిగితే, ఒకవేళ జరిపిస్తే దానికి ఈ సంఘటనను లింకు చేసి అవకాశం ఉందన్నారు. పవన్ కళ్యాణ్ ను ఎప్పటినుంచో గుర్తు తెలియని వ్యక్తులు ఫాలో అవుతున్నారని ఈ తరహా ఘటనలు జరిగిందని చెప్పే ప్రమాదం లేకపోలేదనే మీ మాంస తన మనసులో ఉందన్నారు. ఒక రాజకీయ పార్టీ అధినేతగా పవన్ కళ్యాణ్ కు భద్రత కల్పిస్తామని రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రాకపోవడం విడ్డూరంగా ఉందన్నారు.
పవన్ కళ్యాణ్ కదలికలపై రెక్కీ నిర్వహించడం పై సమగ్ర దర్యాప్తు జరిపి దోషులను శిక్షించాలని కోరుతూ, ఆయనకు తగిన భద్రత కల్పించాలని కేంద్ర హోమ్ శాఖ మంత్రి కి ఒక బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా లేఖ రాస్తానని రఘురామకృష్ణం రాజు తెలిపారు. అలాగే ప్రధానమంత్రిని కలిసి నివేదిస్తానని చెప్పారు. ఎటువంటి ముష్కర మూక మధ్యలో మనము ఉన్నామో ప్రజలందరికీ తెలుసునన్నారు.ఒక ఎంపీగా ఉండి కూడా తాను సొంత రాష్ట్రానికి వెళ్లలేని పరిస్థితి నెలకొందన్న ఆయన, ఈ ఘటనపై పవన్ కళ్యాణ్ కేంద్రానికి లేఖ రాస్తే న్యాయం జరుగుతుందన్నారు.

రాజధానిగా అమరావతి ఉంటుంది
రాష్ట్ర రాజధానిగా అమరావతి ఉంటుందని రఘురామకృష్ణం రాజు మరొకసారి పునరుద్ఘాటించారు.. విశాఖపట్నం నగరం మహానగరంగా అభివృద్ధి చెందుతుందని, రాయలసీమ ప్రాంతం వ్యవసాయ రంగంలోనూ పారిశ్రామికంగా మరింత పురోగతి సాధిస్తుందనితెలిపారు. విశాఖలో ముఖ్యమంత్రి ఆస్తులను కొనుగోలు చేయవచ్చు కానీ రాజధాని విశాఖపట్నం తరలి వెళ్ళదని అన్నారు . రానున్నది ప్రజా ప్రభుత్వమని, వచ్చే టర్మ్ ప్రస్తుత ముఖ్యమంత్రి, సీఎం గా కొనసాగరని అన్నారు. ఈనెల 11వ తేదీన విశాఖ పట్టణానికి విమానాశ్రయ ప్రారంభానికి ప్రధానమంత్రి హాజరవుతున్న నేపథ్యంలో విశాఖ అనే రాజధాని అన్నట్లుగా ఏదో బిల్డప్ ఇవ్వాలని ప్రభుత్వ పెద్దలు ప్రయత్నించినా, భగవంతుడు అలా జరగనివ్వలేదన్నారు.

మూడు రాజధానుల ఏర్పాటు పై హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ ఏడు నెలల తర్వాత సుప్రీంకోర్టులో రాష్ట్ర ప్రభుత్వం పిటిషన్ దాఖలు చేసిందని గుర్తు చేశారు. ఈనెల 21వ తేదీన రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై వాదనలు కొనసాగనున్నట్లు కేసు తొలుత లిస్ట్ అయిందన్నారు. అయితే ఉన్నట్టుండి గురువారం రాత్రి తొమ్మిదిన్నర గంటల తరువాత ఈ కేసు శుక్రవారం నాడు లిస్ట్ కావడం ఆశ్చర్యానికి గురి చేసిందని తెలిపారు.

ఒక్కొక్క కేసు వారాలు, వారాలు… నెలల తరబడి వాయిదా పడుతుండగా, ఈ కేసు మాత్రం ముందే లిస్ట్ కావడం వెనుక ఆంతర్యం ఏమిటన్నది అంతు చిక్కడం లేదని రఘురామకృష్ణం రాజు విస్మయం వ్యక్తం చేశారు. గత మంగళవారం ఇదే కేసుపై వాదనలు కొనసాగగా…ఫ్రీ ఫిక్స్ డ్ అభిప్రాయంతో ఉన్న ప్రధాన న్యాయమూర్తి, కేసు స్వీకరిస్తానంటే తమకు అభ్యంతరం లేదన్నప్పటికీ… సమంజసమా?, కాదా అని నిర్ణయించాలని కోరగా 14వ తేదీకి వాయిదా వేశారన్నారు. రాష్ట్ర విభజనపై అభ్యంతరాన్ని వ్యక్తం చేస్తూ తనతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్, మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి లతో పాటు మరో 40 మంది దాఖలు చేసిన పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు.

వాటితో పాటు రాజధానిపై రైతులు దాఖలు చేసిన పిటిషన్లు కూడా శుక్రవారం లిఫ్ట్ చేయడం జరిగిందని వివరించారు. రైతుల తరపు న్యాయవాదులు ఆదినారాయణరావు, మురళీధర్ రావు అప్రమత్తంగా ఉండి, సీనియర్ న్యాయవాదులైన పాలినారీమాన్, వికాస్ సింగ్ లను సంప్రదించారని అన్నారు.. ప్రభుత్వం తరఫున తమ పార్టీ రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ… తమ రాజధాని ఎక్కడో నిర్ణయించుకోవడానికి లేదంట?

మేము రాజధాని ఎక్కడో నిర్ణయించుకుంటే… మీకు ఆ హక్కు లేదని చెప్పారు. మూడు రాజధానుల ఏర్పాటు పై నిర్ణయాన్ని వెనక్కి తీసుకున్న తర్వాత కూడా రాజధాని ఎక్కడో నిర్ణయించుకోవడానికి వీల్లేదంటున్నారని ధర్మాసనం దృష్టికి తీసుకువచ్చారని తెలిపారు. దీనితో రాత్రి 11:30 గంటలకు కాగితాలు వచ్చాయని, సబ్జెక్టు ఏమిటో తెలియదని బెంచ్ పేర్కొనగా, సోమవారము నాడు తమ వాదనలను వినాలని నిరంజన్ రెడ్డి పదేపదే కోరడం జరిగిందన్నారు. ప్రస్తుత ప్రధాన న్యాయమూర్తి ఆఖరి పని దినం రోజే వాదనలను వినాలని తన వాదనల ద్వారా ఒత్తిడి తీసుకు వచ్చే ప్రయత్నాన్ని చేశారన్నారు.

దీనితో పాలినారీమన్ తన వాదనను వినిపిస్తూ… అమరావతి రైతుల బ్యాక్ గ్రౌండ్ కు సంబంధించి వాదనలకు ముందు తాను ఒక నోటును సమర్పిస్తానని ధర్మాసనానికి తెలియజేశారని రఘురామకృష్ణంరాజు వివరించారు. సోమవారం వద్దని ఆయన కోరారని, అయినా నిరంజన్ రెడ్డి మాత్రం అత్యవసరమైన విషయమని సోమవారం వాదనలను వినాలని కోరారన్నారు. సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ వాదనలు వినిపిస్తూ ఆరేడు నెలల తర్వాత రాష్ట్ర ప్రభుత్వం పిటీషన్ దాఖలు చేసిందని, సోమవారమే వాదనలు వినాలని కోరడం భావ్యం కాదన్నారని తెలిపారు. దీనితో ధర్మాసనం 14వ తేదీకి వాయిదా వేసిందన్నారు.. ఈనెల తొమ్మిదవ తేదీన సుప్రీం కోర్ట్ నూతన ప్రధాన న్యాయమూర్తిగా ధనంజయ చంద్ర చూడ్ పదవి బాధ్యతలను చేపట్టనున్నారని తెలిపారు. ఇప్పటికీ నోటీసులు జారీ చేయలేదు కాబట్టి ఇదే బెంచ్ కొనసాగే అవకాశం ఉందని, బెంచ్ మారే అవకాశం కూడా లేకపోలేదన్నారు.

ఫ్రీ పోన్ అవుతున్న సీఎం కేసులు
మిగతా కేసులు సంవత్సరాల తరబడి వాయిదా పడుతుంటే, ముఖ్యమంత్రి దాఖలు చేసిన కేసులు మాత్రం ఫ్రీ పోన్ అవుతున్నాయని రఘురామకృష్ణం రాజు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఈ వ్యవహారంలో రిజిస్టార్ ను తప్పుపడుతున్నట్లుగా పేర్కొన్నారు. ఏపీ హైకోర్టులో కూడా ఆయన వ్యతిరేకంగా దాఖలు చేసిన కేసులు ఏవి కూడా లిస్ట్ కావని అన్నారు. రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గానికి చర్చి, స్మశాన వాటికల అభివృద్ధి మరమ్మత్తుల కోసం కోటి రూపాయల నిధులను రాష్ట్ర ప్రభుత్వం రఘురామకృష్ణంరాజు అభ్యంతరాన్ని వ్యక్తం చేశారు. ఒక మతాన్ని ప్రభుత్వం ప్రోత్సహించవద్దన్న ఆయన, ఈ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొన్నారు.

LEAVE A RESPONSE