తెలంగాణలో వైశ్యులకు రక్షణ ఏదీ?

– కులపెద్దలే దానికి కారణం

తెలంగాణ రాష్ట్రంలో ఆర్యవైశ్యులకు రక్షణ లేకుండా పోయింది. కొంతమంది స్వార్థ రాజకీయాలతో, అమాయక ఆర్యవైశ్య కుటుంబాలు బలవుతున్నారు. దీనికి కారకులు వారి కుల పెద్దలే కారణం.
టిఆర్ఎస్ పార్టీలో ఉన్న ఆర్యవైశ్య ప్రజాప్రతినిధులంతా, నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల పైన ఉంది.
గతంలో నిజామాబాద్ ప్రాంతానికి చెందిన ఒక కుటుంబం, సామూహికంగా ఆత్మహత్య చేసుకున్న సంఘటన మరువకముందే, నిన్న కామారెడ్డి రామాయంపేట లో జరిగిన సంఘటన చాలా బాధాకరమైన విషయం.

ఆర్యవైశ్య సంఘాలు అసమర్ధులను నాయకులుగా ఎన్నుకొని నాయకులను చేస్తున్నారు. మీకు కష్టం వచ్చినప్పుడు కనీసం పరామర్శించడానికి కూడా రానటువంటి ఈ మూర్ఖులను, ఎందుకు మీరు నాయకులుగా చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు.

నిన్న ఆత్మహత్య చేసుకున్న శ్రీమతి గంగం పద్మా ఈమె కుమారుడు శ్రీ గంగం సంతోష్ లు వారి ఆత్మకు శాంతి కలగాలని, వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నాను.

మెదక్ జిల్లా రామాయంపేట కు చెందిన నిందితులు, మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్ మరియు వారి అనుచరులు, స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ యొక్క వేధింపుల వలన ఆత్మహత్య చేసుకున్నారు, 7 గు రి మీద సెక్షన్ 306 క్రింద కేసు నమోదు చేశారు, కానీ దానిలో ఎంతవరకు న్యాయం జరుగుతుందో చెప్పలేము. నిందితులంతా అధికార పార్టీ టిఆర్ఎస్ వారు.

ఇప్పటికైనా ఆర్యవైశ్య లో చైతన్యం రావాలి. రాలేదనుకోండి.. మీ పిల్లల భవిష్యత్తు అంధకారంలోకి తప్పకుండా వెళుతుంది.
జై ఓసి జై జై ఓసి.. ఓ సి ల ఐక్యత వర్ధిల్లాలి

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(అఖిలభారత ఓసి సంఘం, EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు)

Leave a Reply