కేసీఆర్ కు రైతుల ఉసురు తగలక తప్పదు!

– కేసీఆర్ చేసిన దరిద్రం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు

కేసీఆర్ జగన్నాటకం వల్ల ఎంతో మంది రైతులు వరి వేయకుండా తన పొలాలను బీడు భూములుగా పెట్టుకున్నారు. అదేవిధంగా సగం మంది రైతులు పండించిన పంటను తక్కువ ధరకే అమ్ముకున్నారు.
మొదట.. వడ్లను మేమే కొంటున్నాము దేశంలో ఏ రాష్ట్రం కొనటం లేదు. ప్రతి గింజనూ కూడా మేమే కొంటాము.

రెండోది.. అసెంబ్లీలో లో ఎన్ని కష్టాలు ఎదురైనా వరిని మేమే కొంటాం . ఇంకా ఎంత ఎక్కువ వరి వేసిన మేము కొంటాము అని చెప్పాడు.
మూడవది.. కేంద్ర ప్రభుత్వం వడ్లను కొన్నడన్లేదు. మేము కూడా కొన్ము అని చేతులెత్తేశాడు.
నాల్గవది.. వరి వేస్తే రైతులకు ఉరే అని చెప్పాడు. వరి వేసిన వాళ్లకు మీకు రైతు బంధు కూడా ఇవ్వను. వడ్లు వేస్ట్ అని చెప్పి.. వచ్చే సంవత్సరం రైతు కొనుగోలు కేంద్రాలు ఉండవు కాబట్టి మీ ఇష్టం అని చెప్పాడు.

ఐదవది… కేంద్ర ప్రభుత్వం పంజాబ్ రాష్ట్రం లాగానే, ప్రతి గింజను పండించిన పంట మొత్తాన్ని కొనాలి అని చెప్పే నాటకం మొదలు పెట్టాడు.
ఆరోది.. ఢిల్లీలో ధర్నా పెట్టి కేంద్ర ప్రభుత్వం వరిని కొనాలని చెప్పేసి, పంజాబ్ లాగా మొత్తం వరిని కొనాలని చెప్పేసి నాటకం మొదలు పెట్టాడు. అందుకు కేంద్ర ప్రభుత్వం పంజాబ్లో మొదటి పంట వరి వేస్తారు. రెండో పంటను గోధుమ వేస్తారు. ఈ ఐదు సంవత్సరాలలో పంజాబ్ కంటే ఎక్కువ వరిని, బియ్యం తెలంగాణలోని ఎక్కువ కొన్నామని బట్టబయలు చేశారు దానికి కేసీఆర్ ఢిల్లీలో నాటకం బంద్ చేసి హైదరాబాద్ వచ్చేసి ప్రెస్ మీట్ పెట్టాడు.
ఏడవది.. కేంద్ర ప్రభుత్వానికి మొదట్లోనే ఎండాకాలం పంటలో బాయిల్డ్ రైస్ ఇవ్వమని సంతకం పెట్టింది ఈ దరిద్రపు ముఖ్యమంత్రి. ఇప్పుడు ఏమంటాడంటే… సంతకం పెట్టలేదు అంటాడు. తర్వాత మెడ మీద కత్తి పెట్టి సంతకం పెట్టించాడు అని చెప్తాడు.

ఎనిమిది … ఇప్పటినుంచి తెలంగాణ ప్రభుత్వం వడ్ల ను కొంటాం అని నాటకం మొదలు పెట్టాడు. తీరా సగం మంది రైతులు నష్టపోయారు. పండించిన పంటను తక్కువ ధరకు బజార్లో అమ్ముకున్నారు. కేసీఆర్ చేసిన దరిద్రం వల్ల ఎంతో మంది రైతులు నష్టపోయారు. అన్ని నాటకాలు చేయకుండా మొదట్లోనే వడ్ల కొని ఉంటే, ఇంత మంది రైతులు నష్టపోయే వారు కాదు.
రైతుల ఉసురు కచ్చితంగా కేసీఆర్ కు తగులుతుంది.
వరి వేసిన రైతులు ఎవ్వరు కూడా మర్చిపోరు నిన్ను. జీవితాంతం మీ పాలనను మిమ్మల్ని సహించరు.

– పెంజర్ల మహేందర్ రెడ్డి
(ఓసి సంఘం మరియు EWS ఎకనామికల్ వీకర్ సెక్షన్ జాతీయ అధ్యక్షుడు )