నెల్లూరు నాలుగవ అదనపు మున్సిపల్ మేజిస్ట్రేట్ వారి కోర్టులో జరిగిన దొంగతనం సంఘటన జరిగిన తరువాత కావలి డి.ఎస్.పి గారిని విచారణ అధికారిగా నియమించారు. వారు ఇచ్చిన రిపోర్టు కు , ఎస్పీ గారు పత్రికా విలేకరుల సమావేశంలో చెప్పిన విషయానికి తేడా ఉంది .
దొంగతనం జరిగిన తీరు పోలీసులు చెప్పిన ,చూసిన తర్వాత సామాన్యంగా పోలీసులు వెంటనే చేసే పని కుక్కలను రప్పించడం , క్లూ కనుక్కోవడం కోసం ప్రయత్నం చేస్తారు దొంగలు ఎక్కీ పోయిన మెట్లమీద ఏమైనా ఆధారాలు ఉన్నాయా, చెప్పులు కానీ, సిగరెట్ ముక్కలు కానీ ,కాలి వేలిముద్రలు , బీరువా మీద చేతి వేలి ముద్రలు , తదితరాలు వెంటనే తీసుకునే అలవాటు సామాన్యంగా ఉంటుంది.
అసలు పై కేసుకు సంబంధించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్స్, ఐప్యాడ్ తదితరాలు పోలీసులు కోర్టుకు అంద చేయలేదని జిల్లా జడ్జి కోర్టు వారు నిర్ధారించారు. బయటకు వచ్చింది . మరి కేసుకు సంబంధించిన పై ఆధారాలు పోలీసులు కోర్టుకు అంద చేయనప్పుడు దొంగతనం చేసిన దొంగలు ఆ కేసుకు సంబంధించిన ల్యాప్టాప్, ఐప్యాడ్సె, సెల్ ఫోన్స్ పోలీసులు ఏ విధంగా సేకరించారు . అవి అని ఎలా అని నిర్ధారించారు?
అంటే ఇదంతా ఎవరికి వాళ్ళు అబద్ధాలు చెబుతున్నట్లుగా క్లియర్ గా అర్థం అవుతోంది. ఈ అబద్ధాలు చెప్పడంలో పొంతన కుదరక వాస్తవాలు బయటికి వస్తున్నాయి .బరి తెగించిన ఈ ప్రభుత్వాన్ని, వ్యవస్థను కేసుకు సంబంధించిన విలువైన ఆధారాలను ఈ విధంగా ఎవరికి వారు మసిపూసి మారేడు కాయ చేయడం అనేది చాలా దుర్మార్గం, క్షమించరాని నేరం . ప్రభుత్వం అంటే భయం లేకుండా పోవడం.
దీనిని బట్టి చూస్తే జరిగింది ఒక రకం అసలు జరగని దానిని జరిగినట్టుగా చిత్రీకరించినట్లు గా అర్థం అవుతోంది .ఇందులో వివరంగా ఆలోచిస్తే అబద్ధాలు చెప్పిన వారి మీద, ప్రజలను తప్పుదారి పట్టించిన వారి మీద కొత్త కేసులు పెట్టి వాస్తవాలను బయటకు తీసి సమాజానికి చెప్పవలసిన అవసరం ఉందనిపిస్తుంది.
ఎందుకంటే ఈ కేసులో స్వయంగా జిల్లా జడ్జి గారు హైకోర్టుకు తెలియజేసిన వివరము ,జిల్లా ఎస్పీ గారు ప్రజలకు తెలియజేసిన పత్రికా ప్రకటన పూర్తిగా కాంట్రాడిక్షన్ గా ఉన్నది. ఎవరు నిజం చెప్పారు ఎవరు అబద్ధం చెప్పారు ప్రజలను ఎవరు తప్పుదారి పట్టించారు అనే విషయం పూర్తిగా తెలియవలసిన అవసరం ఉంది. ఏది ఏమైనా ఇలాంటి పరిస్థితి రావడం ఈ సమాజానికి ఈ దేశానికి మంచిది కాదు. వ్యవస్థ అంటే భయం లేకుండా పోవడం వల్ల ఇదంతా జరుగుతుంది.
అధికారం చేతిలో ఉందని ఇష్ట ప్రకారం వ్యవహారాలు చేస్తే ఏ రోజుకైనా తప్పు చేసిన వారు,చేసినవారిని ఆ తప్పు నుండి తప్పించుటకు ప్రయత్నం చేసిన వారు శిక్ష అనుభవించవలసిందే .
– కరణం భాస్కర్
బిజెపి ,
మొబైల్ నెంబర్ 7386128877 .