Suryaa.co.in

Andhra Pradesh

ఎక్కడ చర్చ పెట్టినా చంద్రబాబు ఎంత నీచుడో తేల్చడానికి సిద్ధం

– కేసినో వ్యవహారంలో బైడెన్ కూడా కలవొచ్చు
– నిజ నిర్ధారణ చేసుకోకుండా ఆరోపణలేంటి
– సోము పాఠాలు నేర్చుకోవాలనే ఉద్దేశ్యం లేదు
– బుద్ధి మార్చుకోవాలని సోము వీర్రాజుకు సూచన
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 25: చంద్రబాబు ఎక్కడ చర్చ పెట్టినా అతను ఎంత నీచుడో తేల్చడానికి సిద్ధంగా ఉన్నానని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) తెలిపారు. మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. కేసినో వ్యవహారంలో గవర్నర్ తో పాటు రాష్ట్రపతిని కలవమనండి, అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను కూడా కలవచ్చని చెప్పారు. అంతర్జాతీయ సంస్థలకు కూడా టీడీపీ ఫిర్యాదు చేయవచ్చన్నారు. సిగ్గు, శరం లేకుండా కే కన్వెన్షన్ జరిగిందని చెప్పిన వారు మాట మార్చి గుడివాడలో జరిగిందని అంటున్నారన్నారు. మంత్రిగా, నాలుగుసార్లు ఎమ్మెల్యేగా గెల్చిన వ్యక్తిపై ఆరోపణలు చేసేటపుడు ముందు, వెనుక చూసుకోవాలన్నారు. నిజ నిర్ధారణ చేసుకోకుండా ఆరోపణలు చేయడమేంటని అన్నారు. సోము వీర్రాజు దగ్గర పాఠాలు నేర్చుకుని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాకుండా పనికిమాలిన పార్టీగా మిగిలిపోయే ఉద్ధేశ్యం మాకు లేదన్నారు. తాళ్ళు కట్టుకోవాలా, అవసరం కోసం దేవుళ్ళను, మతాన్ని అడ్డు పెట్టుకోవాలో చెప్పనక్కర్లేదని, ముందు వాళ్ళు మారితే చాలని అన్నారు.

సంక్రాంతి ఎలా జరుపుకోవాలో సోము వీర్రాజు చూపించేది ఏముంటుందని, గుడివాడ పుట్టినప్పటి నుండి అక్కడి ప్రజలు జరుపుకుంటున్నారని అన్నారు. భూమి ఉన్నంత వరకు సంక్రాంతి పండుగ జరుగుతుందని, మధ్యలో సోము వీర్రాజు చూపించేది ఏంటని అన్నారు. నా కన్నా గొప్పవాడు లేడని, నా దగ్గరే ప్రపంచమంతా తెలుసుకోవాలని అనుకుంటే డిపాజిట్లు కోల్పోతారన్నారు. బీజేపీకి డిపాజిట్లు ఎలా రావాలో ఆ పార్టీ కార్యకర్తలకు శిక్షణ ఇవ్వాలన్నారు. పండుగలు ఎలా చేసుకోవాలి, అంట్లు తోముకోవాలి, బట్టలు ఎలా ఉతుక్కోవాలో ఇళ్ళలో ఉండేవారికి తెలుసన్నారు. గేటును టచ్ చేస్తే చంద్రబాబును శవంగా పంపిస్తానని అంటే పోలీసులు కేసు కడతారన్నారు. అలా కాకుండా చంద్రబాబు 420, వెధవ, ఆడవాళ్ళను అడ్డం పెట్టుకుని ఎంతకైనా దిగజారతాడని అంటే ఏ కేసూ పెట్టరన్నారు. చంపుతానని అంటే అది వాస్తవమైనా, కాకపోయినా కేసు పెడతారన్నారు. మొరిగే కుక్క కరవదని, మొరగడం న్యూసెన్స్ గా ఉండడంతో మూతిపై కొడతారన్నారు. కొబ్బరి చిప్పల వాడు నిన్న, ఈ రోజు ఏ భాష మాట్లాడానని ప్రశ్నించారు. ఇటు వైపు నేనొక్కడినే మాట్లాడుతున్నానని, అటువైపు 420 గాళ్ళు మాట్లాడుతున్నారన్నారు.

చంద్రబాబు ఇంటి దగ్గర పడు టాడని, రెచ్చగొట్టి చాలా మంది వీళ్ళను పంపుతాడన్నారు. ఎవరో ఒకరిని రెచ్చగొట్టి తిట్టుకునేలా చేస్తాడని, దూరం నుండి కాలక్షేపం చేస్తుంటాడన్నారు. బుద్ధా వెంకన్న, నేను తిట్టుకుంటా ఉంటామని చంద్రబాబు భ్రమ పడుతున్నాడన్నారు. చంద్రబాబు 420 బుద్ధులు నాకు చిన్నప్పటి నుండి తెలుసని అన్నారు. చంద్రబాబు కొంపే వ్యభిచార కొంప అని చెప్పానన్నారు. చంద్రబాబు, అతని మిత్ర బృందం రోజూ టీడీఎల్పీ ఆఫీస్ లో పేకాట ఆడుతుంటే ఎన్టీఆర్ పిలిచి చెప్పుతో కొట్టాడన్నారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులే ఈ విషయాన్ని చెప్పారని మంత్రి కొడాలి నాని తెలిపారు.

LEAVE A RESPONSE