ఎన్టీఆర్ చెప్పిన మాటల క్యాసెట్లను ప్రజల ముందుంచుతా

Spread the love

– చంద్రబాబు బతుకేంటో గంట గంటకూ పెట్టుకుందాం చెప్పడానికి సిద్ధంగా ఉన్నా
– ఛాలెంజ్ చేస్తున్నా నా గురించి మాట్లాడండి
– మాట్లాడిన గంటకు బాబు ఎంత నీచుడో చెబుతా
– బాబు బతుకును ఉతికి ఆరేయకపోతే కొడాలి నానిని కాదు
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

అమరావతి, జనవరి 25: చంద్రబాబు బతుకేంటో, వాడెంత వెధవో, సన్నాసో, 420 గాడో చెప్పడానికి సిద్ధంగా ఉన్నానని, గంట గంటకూ పెట్టుకుందాం అని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) సవాల్ విసిరారు. మంగళవారం మంత్రి కొడాలి నాని మీడియాతో మాట్లాడారు. వర్ల రామయ్య సీఐగా ఉండగా గుడివాడలో తనను కొట్టాడని విజయవాడలో చంద్రబాబు దగ్గరుండే కుక్క మాట్లాడుతున్నారన్నారు l. సీఐగా పనిచేసిన సమయంలో 10 వ తరగతి చదువుతున్నానని, విద్యార్థిగా ఉండగా కొట్టినట్టు కాల్మనీ, సెక్స్ రాకెట్ గాడు చెబుతున్నాడన్నారు. కే కన్వెన్షన్ అవినీతి డబ్బులతో కట్టినట్టుగా మాట్లాడుతున్నాడన్నారు. కళ్యాణ మండపాన్ని 2010 లో నిర్మించానని, అప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉందని తెలిపారు.

టీడీపీలో ఉండగా కడితే నిజాయితీపరుడని, నీతివంతుడని, కష్టపడి డబ్బు సంపాదించాడని అంటారన్నారు. 1991 లో చంద్రబాబుకు హెరిటేజ్ కూడా లేదని, ప్లాట్ఫారంపై ఉండేవాడన్నారు. ముఖ్యమంత్రి అయిన తర్వాత జూదశాలలు, వ్యభిచార గృహాల నుండి కోటాను కోట్ల డబ్బును దండుకున్న 420 చంద్రబాబు అని అన్నారు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని, త్వరలోనే బడితపూజ ఉందని గుర్తుచేశారు. విజయవాడలో హింసకు గురైన మహిళలు ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారని, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదులు చేయడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. అధిక వడ్డీలకు అప్పులిచ్చి ఎంత మందిని వేధించావో వారంతా ముందుకు వస్తున్నారన్నారు. ఆసుపత్రిలో ఉంటే కొడాలి నాని కేసినో పెట్టాడు, మహిళలతో డ్యాన్స్లు వేయించాడు, వ్యభిచారం చేయించాడని 420 పార్టీలు, ఛానల్స్లో ప్రచారం చేయించాడన్నారు.

ఈ రోజు నుండి ఛాలెంజ్ చేస్తున్నానని, నా గురించి మాట్లాడాలన్నారు. మీరు మాట్లాడిన గంటకు చంద్రబాబు ఎంత నీచుడో, వాడెంత 420 వెధవో ప్రజల ముందు పెడతానన్నారు.ఎన్టీఆర్ చెప్పిన మాటలు, అప్పటి వీడియో, ఆడియో క్యాసెట్లను తీసుకువచ్చి రాష్ట్ర ప్రజలకు వివరించి చంద్రబాబు బతుకును ఉతికి ఆరేయకపోతే నా పేరు కొడాలి నాని కాదని అన్నారు. దమ్ముంటే ఎంత మంది వస్తారో రావాలని, సిద్ధంగా ఉన్నానని సవాల్ చేశారు . ఎన్టీఆర్, కేసీఆర్, వైఎస్ జగన్ల భిక్షతో ఎవరైనా రాజకీయాల్లోకి వచ్చారంటే నమ్మవచ్చన్నారు. వీరంతా సొంతంగా పార్టీలను పెట్టి ముఖ్యమంత్రులై పది మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చారన్నారు. చంద్రబాబు ఒక బిచ్చగాడని, టీడీపీని ఖర్జూరనాయుడు పెట్టాడా అని ప్రశ్నించారు. తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడన్నారు. కాళ్ళు పట్టుకుని అడుక్కు తినేవాడిలా టీడీపీలో చేరాడన్నారు. తండ్రుల కాలం నుండి టీడీపీ సానుభూతిపరులుగా ఉన్నామన్నారు. ఎన్టీఆర్ కుమారులతో కలిసి ట్రావెల్ చేశానని చెప్పారు. చంద్రబాబు నాకు భిక్ష పెట్టలేదని మంత్రి కొడాలి నాని స్పష్టం చేశారు.

Leave a Reply