దేశ రాజధానిలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 500 దాటింది. ప్రపంచంలో నివాసయోగ్యం కాని నగరాలు ఏదైనా ఉన్నదా అంటే దీనికి సమాధానం ఢిల్లీ అని చెప్పవచ్చు. గత ఎనిమిది సంవత్సరాలుగా ఇదే పరిస్థితి. ఢిల్లీ, యుపి, హర్యానా పంజాబ్ రాష్ట్రాలలో పంటలను తగులపెట్టడం వలన అలాగే పరిశ్రమల నుండి వెలువడుతున్న విష వాయువుల వల్ల విపరీతమైన దుస్థితి ఏర్పడింది. ఈ పాపం నాది కాదు అంటే నాది కాదని రాష్ట్రాలు ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. రూపాయి విలువ దిగజారలేదని డాలర్ విలువ పటిష్టమైందని ఆర్థిక మంత్రి సెలవిస్తారు.
గుజరాత్ లో మొర్బా నగరంలో హ్యాంగింగ్ బ్రిడ్జి కూలి 141 మంది చనిపోతే నా బాధ్యత కాదని స్వయానా ఆ రాష్ట్ర పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్ మంత్రి, రైతులు పంట వ్యర్థాలను తగలబెడితే నాకేమి సంబంధమనిపంజాబ్ ముఖ్యమంత్రి ఇలా ప్రతి ఒక్కరు బాధ్యతలు విస్మరించి నిస్సిగ్గుగా మాట్లాడుతున్నారు. కొత్తగా ముద్రించే కరెన్సీ నోట్లపై లక్ష్మీదేవి ఫొటోతో పాటు వినాయకుడి ఫొటోను ముద్రించాలని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. కరెన్సీ నోట్లపై ఒకవైపు మహాత్ముడి ఫొటో, మరోవైపు లక్ష్మీదేవి, వినాయకుడి ఫొటోలను ముద్రించవచ్చని చెప్పారు. ముస్లిం దేశమైన ఇండోనేషియాలో కరెన్సీ నోట్లపై మన గణేషుడి ఫొటో ఉండగా లేనిది మనం మాత్రం మన కరెన్సీపై ఎందుకు ముద్రించకూడదని కేజ్రీవాల్ ప్రశ్నించారు.
ఒక్కొక్కసారి మనం ఎంత కష్టపడ్డా ఫలితం మాత్రం దక్కదని కేజ్రీవాల్ గుర్తుచేశారు. అలాంటి సమయాల్లో మన శక్తియుక్తులకు దైవానుగ్రహం కూడా తోడైతే ఫలితం దక్కుతుందని ఆయన వివరించారు. మరి ఎయిర్ క్వాలిటీ మెరుగుపడడానికి ఏ దేవుణ్ణి కొలవాలో ఎవరిని ఫోటో పెట్టి పూజించాలో సెలవిస్తే మంచిది. ఢిల్లీలో ప్రమాద ఘంటికలు మోగిస్తోన్న వాయుకాలుష్యం శుక్రవారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 456, అలాగే రెస్పిరబుల్ పార్టీకులెట్ మ్యాటర్ 525, నైట్రోజెన్ డయాక్సయిడ్ 36, సల్ఫర్ డయాక్సయిడ్ 15, ఓజోన్ 75, కార్బన్ మోనాక్సయిడ్ 24 గా ఉంది. మరికొద్ది రోజులు సైతం ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.
గాలి నాణ్యత క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రజలు ముఖ్యంగా వయోజనులు, పిల్లల విషయంలో అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. శ్వాసకోశ సమస్యలు ఎదురయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఢిల్లీ సహా పరిసర ప్రాంత ప్రజలు గడపదాటి బయటకు రావాలంటే మాస్కు ధరించక తప్పని పరిస్థితి నెలకొంది. ఇందుక్కారణం కరోనా కొత్త వేవ్ కాదు. కోరలు చాచిన వాయు కాలుష్యం ఈ దుస్థితిని తీసుకొచ్చింది. చలికాలం వచ్చిందంటే చాలు ఢిల్లీలో పీల్చే గాలి విషంగా మారుతుంది.
రుతుపవనాల తిరోగమనం అనంతరం ఉత్తరాదిన ఏర్పడే ప్రత్యేక వాతావరణ పరిస్థితులు ఒక కారణమైతే మానవ తప్పిదాలు ఈ వాయుకాలుష్యం స్థాయులను మరింత పెంచి పీల్చేగాలిని విషతుల్యం చేస్తున్నాయి. ఢిల్లీ నగరంలోని వాహన ఉద్గారాలకు తోడు పొరుగు రాష్ట్రాలు పంజాబ్, హర్యానాలో రైతులు పంట వ్యర్థాలను కాల్చడం వల్ల ఏర్పడే పొగ శీతాకాలంలో సహజసిద్ధంగా ఏర్పడే పొగమంచులో కలిసిపోయి ఊపిరి పీల్చుకోలేని ఉక్కిరిబిక్కిరి పరిస్థితిని సృష్టిస్తున్నాయి. భవన నిర్మాణ పనుల కారణంగా ఏర్పడే దుమ్ము, ధూళి అన్నీ కలగలిపి గాలి నాణ్యతను దారుణంగా దెబ్బతీస్తున్నాయి.
పొల్యూషన్ మానిటరింగ్ మెకానిజం లేక, ప్రజలకు కాలుష్యం దుష్ప్రభావాలు తెలియక తీవ్ర సమస్యలు కొని తెచ్చుకుంటున్నారు. పర్యావరణ కాలుష్యం ప్రపంచ వ్యాప్తంగా సమస్యగా మారింది. ప్రభుత్వాలు అవలంబిస్తున్న పారిశ్రామిక మరియు సాంకేతిక విధానాలు ప్రకృతి విధ్వంసానికి కారణాలు అవుతున్నాయి. ఆక్సిజన్, నైట్రోజన్, కార్బన్ డయాక్సైడ్, ఆర్గాన్ మరియు నీటి ఆవిరి సమతుల్యంగా ఉంటేనే వన్యప్రాణి మరియు వ్యవసాయానికి, మానవుని అభివృద్ధికి తోడ్పడుతుంది. వాయువులు, కణాలు మరియు జీవ అణువులతో సహా హానికరమైన లేదా అధిక పరిమాణంలో ఉన్న పదార్థాలను భూమి యొక్క వాతావరణంలోకి ప్రవేశపెట్టినప్పుడు వాయు కాలుష్యం సంభవిస్తుంది.
ఇది మానవులకు వ్యాధులు, అలెర్జీలు మరియు మరణానికి కారణం కావచ్చు; ఇది జంతువులు మరియు ఆహార పంటలు వంటి ఇతర జీవులకు కూడా హాని కలిగించవచ్చు మరియు సహజమైన లేదా నిర్మించిన వాతావరణాన్ని దెబ్బతీస్తుంది. మానవ కార్యకలాపాలు మరియు సహజ ప్రక్రియలు రెండూ వాయు కాలుష్యాన్ని సృష్టించగలవు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం, వాయు కాలుష్యం ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఏటా 8 మిలియన్ల మంది మరణాలకు కారణమైంది. పరిశ్రమలు, రవాణా మొదలైన ప్రజల కార్యకలాపాల ద్వారా తయారైన విష పదార్థాలు సమాజాన్ని చుట్టే గాలిని కలుషితం చేస్తాయి. ప్రధాన కాలుష్య కారకాలు దహన, చెత్తను తగులబెట్టినప్పుడు, రసాయన ప్రతిచర్యల వల్ల దుమ్ము మరియు మసి. ఆటోమొబైల్ పెట్రోలియం వాహనాల ద్వారా ఎగ్జాస్ట్ గ్యాస్ వంటి సల్ఫరస్ వాయువులో ఉండే నత్రజని ఆక్సైడ్లు . కాలుష్యం ప్రజల ఆరోగ్యన్ని , ఆస్తిని , జంతువులు మరియు మొక్కలను ప్రతికూలంగా ప్రభావితం చేస్తుంది.
సహజ పరిస్థితులు, క్షీణత మరియు శ్వాసకోశ వ్యాధులు వంటి శ్వాసకోశ వ్యాధులు, శ్వాసనాళ ఆస్తమా (ఉబ్బసం) వంటి వివిధ వ్యాధుల ప్రేరణ. వాయు కాలుష్యం తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలకు కారణమయ్యే PM 2.5 , PM 0.5 వంటి చక్కటి రేణువుల హానికరమైన పదార్థాలను కలిగి ఉంది. వేగవంతమైన పారిశ్రామికీకరణకు అనుగుణమైన బొగ్గు, ఆటోమొబైల్ ఎగ్జాస్ట్ గ్యాస్‌లో కంబషన్ పెరుగుదల, పెద్ద నగరాల్లో ఇంధనం వినియోగం వేగంగా పెరగడం వంటి పెట్రోకెమికల్ ఇంధన ఇంధనాల యొక్క అధిక వినియోగం కాలుష్యానికి కారణమని చెప్పబడింది. పర్యావరణ సాంకేతికతలు మరియు పర్యావరణం సరిగా లేకపోవడం. పరిశ్రమల ద్వారా భయంకరమైన పొగలు, వ్యర్థాలు, వాసనలు వస్తున్నా పట్టించుకోని కాలుష్య నియంత్రణ అధికారులుతో నివాసితులకు అసౌకర్యానికి అనారోగ్యానికి గురి అవుతున్నారు.
వాయు కాలుష్యంతో సహా పర్యావరణ కాలుష్య నియంత్రణకు ఎంతో అవసరం. ఏసీ లు, రిఫ్రిజిరేటర్లు విపరీతంగా వాడడం వలన క్లోరోఫ్లోరో కార్బన్లు, ద్రావకాలు మరియు రిఫ్రిజిరేటర్లకు ఉపయోగించే వాయువుల ద్వారా ఓజోన్ పొరను నాశనం చేసి వాతావరణంలో కార్బన్ డయాక్సైడ్ వాయువు సాంద్రత పెరగడం వల్ల గ్రీన్హౌస్ ప్రభావం వాతావరణంలో పర్యావరణ విధ్వంసం సమస్యగా దృష్టిని ఆకర్షిస్తున్నాయి.
కరోనా పారద్రోలడానికి యజ్ఞాలు యాగాలు,లైట్లు ఆర్పీ మొబత్తి వెలిగించి, చప్పట్లు కొట్టి వైరస్ ని నియంత్రించవచ్చు, కాషాయాలు త్రాగి స్వస్థత చేకూర్చమని ప్రజలకు సలహాలిస్తున్న దేశంలో. ఆర్థిక పరిస్థితి బాగుపడాలంటే లక్ష్మీదేవి ఫోటో పెడితే ఆర్థిక రంగం పరిగెడుతుంది అన్న మేధావులున్న దేశంలో కాలుష్య సమస్యకు పరిష్కారం దొరుక్కపోదు.