Suryaa.co.in

Andhra Pradesh

అక్రమ మైనింగ్ లో కాసు శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఎవరు?

– కృష్ణా నదిని పూడ్చే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు
– అక్రమ బ్లీచింగ్ తయారీ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం
-అక్రమ వ్యాపారాలన్నీ ఎమ్మెల్యే కనుసనల్లోనే
– మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు

మైనింగ్ అనుమతులు తీసుకుంటే అక్కడ ఉన్న ప్రోక్లైన్లను అకస్మాత్తుగా ఎందుకు తరలించారు అని మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ప్రశ్నించారు. కృష్ణా నది తీరాన ఉన్న రేగుల గడ్డలో అక్రమమైన మైనింగ్ లీజు వరలక్ష్మికి అనుమతులు ఇచ్చింది టీడీపీ ప్రభుత్వం కాదన్నారు. అక్రమ మైనింగ్ లో కాసు శ్రీకాంత్ రెడ్డి, ప్రసాద్ రెడ్డి ఎవరని ప్రశ్నించారు. కేంద్ర జల వనరుల శాఖ – పర్యావరణ అనుమతులు లేకుండా అక్రమంగా మైనింగ్ చేసుకుంటూ కృష్ణా నదిని పూడ్చే హక్కు వీళ్ళకి ఎవరిచ్చారు అని ప్రశ్నించారు.అసలు ముంపు గ్రామాల్లో లీజులు ఎలా ఇస్తారు అని ప్రశ్నించారు.ప్రమాదభరితమైన నాటు పడవల ద్వారా కూలీలను తీసుకెళ్తున్నారని ఏమైనా ప్రమాదం జరిగితే పరిస్తితి ఏమిటి అని ప్రశ్నించారు.

మైనింగ్ విషయంలో మతినేని వంతనులేని సంబంధం లేని ప్రకటనలు చేసింది ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి అని అన్నారు.యరపతినేని శ్రీనివాసరావుకి మతి ఉంది. గతి ఉంది అని అన్నారు.అక్రమ బ్లీచింగ్ తయారీ ద్వారా సుమారు వెయ్యి కోట్ల రూపాయల కుంభకోణం జరిగిందని, కుంభకోణం బయటపడుతుందని ఉద్దేశంతో తయారీ మిల్లులు కూడా తగలబెట్టారన్నారు. ఎమ్మెల్యే సూచించినటువంటి మిల్లులకు మాత్రమే రాయిని తోలాలని సూచించిన పెయింట్స్ కంపెనీలకు అనుమతులు ఇస్తారన్నారు. అక్రమ వ్యాపారాలన్నీ ఎమ్మెల్యే కనుసనల్లోనే జరుగుతున్నాయని,రాష్ట్రంలో వైసీపీ ఎమ్మెల్యేలు 35 మంది ఎంపీలు 8 మంది టీడీపీకి టచ్ లో ఉన్నారని వ్యాఖ్యానించారు.175 కి 175 కాదు కదా ఏడు సీట్లు కూడా రావని వ్యాఖ్యానించారు.

LEAVE A RESPONSE