(రమణ)
నిజానికి కృష్ణలంకకు – కృష్ణా నదికి అడ్డుగా రీటైనింగ్ వాల్ 2011లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వంలో పరిశీలన, ఎస్టిమేషన్స్ కూడా జరిగాయి. 2011లో ఎస్టిమేషన్ రూ . 40 కోట్లు. తర్వాత 2014 కి 93.22 కోట్లు చేశారు.
2014లో విభజిత ఆంధ్రలో తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎస్టిమేట్లను రూ. 104 కోట్లకు పెంచి, 2014 లో టెక్నికల్ శాంక్షన్ ఇచ్చారు… రామలింగేశ్వర నగర్ నుంచి యనమల కుదురు దాకా రిటైనింగ్ వాల్ కట్టడానికి .
M/s SEW & PMPL joint venture, కంపెనీలకు June 2, 2015 న Rs 93.22 కోట్లకు (-)5.40% లెస్ కింద – ఇంకొక కంపెనీ వేసిన ECV Rs.98. 54 కోట్లతో పోల్చి – రెండేళ్ల వ్యవధి తో ఇచ్చారు. కానీ Krishna Delta Chief Engineer శ్రీనివాస్ తన December 8, 2016 న చేసిన ఇన్స్పెక్షన్ లో కొన్ని మార్పులు సూచించారు. రిటెయినింగ్ వాల్ కట్టేటప్పుడు ఆ deviations అవసరమయ్యాయని ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు. ఇసుకతో కూడిన మట్టిలో కాంక్రీట్ పైల్స్ కాకుండా ఐరన్ స్టీల్ కేసింగ్ వేస్తే పటిష్ఠంగా వుంటుందనే సూచనను తెలుగుదేశం ప్రభుత్వం పరిగణనలోనికి తీసుకొంది.
ప్రభుత్వం దాన్ని ఒప్పుకొని revised ఎస్టిమేట్స్ ప్రకారం రీటెయినింగ్ వాల్ అంచనాలని 2017 లో రూ. 138 కోట్లకు పెంచి డబ్బులు రిలీజ్ కూడా చేసింది. 2018 నాటికి ఆ జాయింట్ వెంచర్ కాంట్రాక్ట్ కంపెనీ 40% పనులు పూర్తి చేసింది. రిటైనింగ్ వాల్ కు సంబంధించిన ఇది మొదటి ఫేజ్. కోటి నగర్ నుండి యనమలకుదురు వరకు.
ఫేజ్ 2 – వారధి నుండి కోటి నగర్ వరకు, ఫేజ్ 3 – పద్మావతి ఘాట్ నుండి వారధి వరకు. మూడో ఫేజ్ ఇంకా పూర్తిగా అవలేదు.
స్థూలంగా చెప్పాలంటే, విభజన ముందు కాంగ్రెస్ ప్రభుత్వం అనుకొంది. విభజన తర్వాత 2014-19 ఫేజ్ 1, తెలుగుదేశం ప్రభుత్వం మొదలుపెట్టింది, నిధులు విడుదల చేసింది. దాదాపు పూర్తి అయింది. ఫేజ్ 2.. 2019-24 మధ్యలో జగన్ ప్రభుత్వం పూర్తి చేసింది.