Suryaa.co.in

Andhra Pradesh

మత్తుపదార్థాలపై ఏపీ పోలీస్ శాఖ పూర్తిస్థాయిలో విచారించాకే మాట్లాడిందా..?

• డ్రగ్స్ గుజరాత్ నుంచి కాకినాడకు, అక్కడి నుంచి విజయవాడకు, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రవాణా అవుతున్నాయనిసమాచారం.
• ఈ వాస్తవాలు కేంద్రప్రభుత్వ అధికారులవిచారణలో బయటపడ్డాయని సమాచారం.
• గుజరాత్ లోపట్టుబడిన హెరాయిన్ విజయవాడచిరునామాతో ఉండటంపై డీజీపీ,విజయవాడ సీపీల వ్యాఖ్యలు పరస్పర విరుద్ధంగాఉన్నాయి.
• గుజరాత్ పోర్ట్ లో పట్టుబడినహెరాయిన్ పై డీఆర్ఐ విచారిస్తుండగానే ముందుగానే ఏపీపోలీస్ వారు ఎందుకు భుజాలు తడుముకున్నారు?
• పోలీస్అధికారులై ఉండి, డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయనాయకులు మాట్లాడవద్దని, సున్నితమైన అంశమని ఎలా చెబుతారు?
– అలీషాకుఉన్నలింకేమిటో డీజీపీకి తెలుసా?
• డ్రగ్స్ వ్యవహారంపై రాజకీయపార్టీలు మాట్లాడటం మంచిదికాదని, చాలా సున్నితమైన అంశమని, భద్రతకుసంబంధించిన అంశమనిడీజీపీ ఎలా చెబుతారు?
• ఈ మొత్తం వ్యవహారంలోని వాస్తవమెంతో డీజీపీకి తెలుసునా?
• లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ లో 972కిలోల గంజాయిని డీఆర్ఐ విభాగం పట్టుకుందని, దానివిలువ రూ.1.45కోట్లు ఉంటుందనే వార్త బయటకు వచ్చింది.
• దానిపై డీజీపీకున్న సమాచారం ఏమిటి?
• డ్రగ్స్ దందా, దానివెనకున్న వ్యక్తులు, వారికి సహకరిస్తున్నవారెవరో తెలియకుండా డీజీపీ మాట్లాడటం నేరస్తులను తానే ప్రోత్సహిస్తున్నట్లుగా ఉన్నాయి
టీడీపీ రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్

డ్రగ్స్, గంజాయి జాడ్యం ప్రస్తుతం రాష్ట్రాన్నిపట్టిపీడిస్తోందని, సదరు అంశం పోలీస్ దర్యాప్తులో ఉందని, అలీషా అనేవ్యక్తి సముద్రపు డాన్ అని, అతనుప్రస్తుతం పోలీస్ వారి విచారణలోఉన్నాడనే వార్తలు పత్రికల్లో వచ్చాయని, ఈ మత్తుపదార్థాల వ్యవహారంపై పోలీస్ శాఖ విచారించాక నిర్ధారణకువచ్చిందా..లేదా అన్నదే సందేహమని, సదరుశాఖ ఎందుకు తత్తరపడుతోందో తెలియాలని టీడీపీ సీనియర్ నేత, రాజ్యసభ సభ్యులు కనకమేడల రవీంద్రకుమార్ తెలిపారు. బుధవారం ఆయన మంగళగిరి లోని పార్టీ జాతీయ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు.ఆ వివరాలు ఆయన మాటల్లోనే …
“ఏపీ నుంచి ఢిల్లీకి గంజాయిరవాణా-దేశంలో ఎక్కడ గంజాయిదొరికినా దాని మూలాలు ఆంధ్రప్రదేశ్ వి కావడం మామూలైపోయింది” అంటూ మరోవార్తను నేడుపత్రికల్లోచూస్తున్నాం. లక్నో-ఆగ్రా ఎక్స్ ప్రెస్ లో రవా ణా అవుతున్న 972కిలోలగంజాయిని డీఆర్ఐ విభాగం పట్టుకుందని, దానివిలుద రూ.1.45కోట్లు ఉంటుందని, ఏపీ నుంచి ప్రయాగ్ రాజ్ మీ దుగా ఢిల్లీకి తరలిస్తుండగా అధికారులుపట్టుకున్నారని రాశారు. గంజా యితోపాటు ముగ్గురిని పట్టుకొని విచారిస్తున్నారని పేర్కొన్నారు. సము ద్రపు డాన్ ఎవరు అనే వార్తకూడా నేడువెలుగులోకి వచ్చింది. హెరాయిన్ అక్రమరవాణా అనేది కేవలం విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకే పరిమితమని నిన్నటివరకుఅనుకున్నాం. కానీ దానిలింకులు కాకినాడ లో కూడా ఉన్నాయి. ఈ వ్యవహారంలోఎవరి పాత్ర, ప్రమేయం ఎంతుంద నేది తేలాల్సిఉంది. కొత్తగా వచ్చిన వార్తేమిటంటే వైసీపీఎమ్మెల్యే ద్వారం పూడి చంద్రశేఖర్ రెడ్డికి సన్నిహితుడైన వ్యక్తి ఈ వ్యవహారంలో ఆరోపణ లు ఎదుర్కొంటున్నాడు.
తూర్పుగోదావరి జిల్లాలో మహ్మద్ షేక్అలీషా అనేపేరు, సదరువ్యక్తిని గురించి తెలియని వారుండరు. అతనికి, డ్రగ్స్ వ్యాపారంచేయడానికి నిధులు ఎక్కడినుంచి వస్తున్నాయి…అతని వెనకు న్న బిగ్ షాట్లు ఎవరుఅనేది పరిశీలించాల్సిఉంది. అలీషాకు అధికారపార్టీ నేతలకు ఏమైన సంబంధాలున్నాయా అనేదికూడా తేలాలి. విజయవాడ లోని ఆషీట్రేడింగ్ కంపెనీ యజమానిఅయిన మాచవరపు సుధాకర్ అనేవ్యక్తి, కాకినాడలోఉన్న అలీషాకు చెందిన శాన్ మెరైన్ కంపెనీలో పనిచేసేవాడని, అలీషా ఆదేశాలతోనే సుధాకర్ విజయవాడలో ఆషీ ట్రేడిం గ్ కంపెనీ పెట్టాడనేది సమాచారం. ఆ విధంగా అలీషా బయటకు కనిపిం చకుండా సుధాకర్ తో డ్రగ్స్ వ్యాపారం సాగిస్తున్నాడా? అలానే గుజరాత్ లోని ముంద్రాపోర్టు లో పట్టుబడినహెరాయిన్ విజయవాడ చిరునామాతో ఉన్నట్లు డీఆర్ఐ అధికారులుగుర్తించారని, అదితెలిశాక వారు విస్తుపో యారని కూడా చెప్పుకుంటున్నారు. మచిలీపట్నం(బందర్) పోర్టులో ఎగుమతి, దిగుమతులు అనేవి జరగడంలేదు. మచిలీపట్నంపోర్టు పేరుతో కంటెయినర్లు తీసుకొచ్చి, కాకినాడ పోర్టులో కార్యకలాపాలు సాగుతున్నాయని, ఆ వ్యవహారమంతా అలీషానే నడిపిస్తున్నాడని చెప్పుకుంటున్నారు.
డ్రగ్స్ ను గుజరాత్ నుంచి కాకినాడకు, అక్కడి నుంచి విజయవాడకు, ఆ తరువాత రాష్ట్రవ్యాప్తంగా, దేశవ్యాప్తంగా రవాణా చేస్తున్నట్లు, ఈ విషయాలు అధికారులవిచారణలో బయటపడ్డాయని సమాచారం. షేక్ అలీషా తూర్పుగోదావరి జిల్లాలోని అధికారపార్టీ వ్యక్తు లకుఅనుంగు అనుచరుడు. కాకినాడ పోర్టులోని మెరైన్ ఆఫీసులో ఒక ఆఫీస్ బాయ్ గా జీవితంప్రారంభించిన అలీషా, నేడు అంతర్జాతీయస్థాయి లో మాదకద్రవ్యాల వ్యాపారంచేస్తున్నాడని, శాన్ మెరైన్ కంపెనీ, అట్లాస్ మైనింగ్ కంపెనీ, అట్లాస్ ఆఫ్ షోర్ , బ్రైట్ ఆఫ్ షోర్ కంపెనీలపేర్లతో కార్య కలాపాలు సాగిస్తున్నాడని, వాటిలో అధికారపార్టీనేతల భాగస్వామ్యం కూడా ఉందనే సమాచారం వెలుగులోకివస్తోంది. వీటిలో వాస్తవమెంత అనేది తెలియాల్సి ఉంది.
కాకినాడపోర్టులో అధికారపార్టీ వారి భాగస్వామ్యం ఎంతనేది కూడా తేలాలి. లక్షలకోట్ల విలువైన హెరాయిన్ రాష్ట్రంకేంద్రంగా చలామణీ కావడమనేది కేవలం ఒక్కరివల్లే అయ్యేపని కాదు. సదరు వ్యవహారంలో అధికారపార్టీనేతల ప్రమేయం కచ్చితంగా ఉండే తీరాలి. ఈ వ్యవహారంలోని గుట్టుమట్లనుచేధించే పనిలో డీఆర్ ఐ వారున్నారు. మొత్తానికి ఏపీ డ్రగ్ డాన్ ఎవరనేదికూడా బయటకురావాలి . సాక్షిపత్రికలో చాలాప్రముఖంగా “ఆఫ్ఘాన్ టూ గుజరాత్ వయా విజయవాడఅని, డ్రగ్స్ రాకెట్ కు సింహద్వారం గా విజయవాడ, గుజరాత్ లోరూ.9వేలకోట్లవిలువైనహెరాయిన్ జప్తు, విజయవాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీపేరిట ఆఫ్ఘాన్ నుంచి దిగుమతి, డీఆర్ఐ దర్యాప్తులో వెల్లడి, డీఆర్ఐ అదుపులో ఆషీ ట్రేడింగ్ కంపెనీ ప్రతినిధులు” అని రాశారు.
గుజరాత్ లో హెరాయిన్ పట్టుబడిన మరుసటిరోజునే, సాక్షిలో ఆ విధంగా రాశారు. అదిజరిగిన 24గంటల్లో విచారణజరగకుండా, వాస్త వాలు తెలియకుండానే ఏపీ పోలీస్ అధికారులు మీడియాతో మాట్లాడా రు. ఈనెల 20వ తేదీన విజయవాడ పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ, గుజరాత్ లో పట్టుబడిన హెరాయిన్ కు విజయవాడకుసంబంధంలేదని, కంపెనీ మాత్రమే విజయవాడ చిరునామాతో ఉందని చెప్పుకొచ్చారు. అలానే ఒకవర్గానికిచెందిన మీడియా కావాలనే సదరువ్యవహారంపై అత్యు త్సాహం చూపుతోందని, కేంద్రప్రభుత్వ సంస్థ అయిన డీఆర్ఐ వారువిచా రణ జరుపుతున్నారని కూడాచెప్పారు. అది ఇంకా పూర్తికాలేదని కూడా విజయవాడ సీపీచెప్పారు. విచారణ పూర్తికాకముందే, విజయవాడ పోలీసులు ఎలాంటి సమాచారంలేకుండా, డీఆర్ఐ వారు ఎలాంటిప్రకటన చేయకముందే, విజయవాడ సీపీఅలా ఎందుకుమాట్లాడారు?
అలానే ఈ నెల 24వతేదీన స్వయంగా రాష్ట్రడీజీపీ గారు మాట్లాడుతూ, “అసత్యప్రచారాలతో ప్రజలనుతప్పుదోవ పట్టించవద్దు, ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా మాత్రమే విజయవాడ కేంద్రంగా ఉంది, వారికార్యకలా పాలు ఇసుమంతైనా రాష్ట్రంలో లేవు, ఈ విషయాన్నిఇప్పటికే డీఆర్ ఐ అధికారులు మరియుకేంద్రప్రభుత్వ సంస్థలు ధ్రువీకరించాయని ” చెప్పారు. డీజీపీ ఈ సందర్భంగా మరో అడుగు ముందుకేసి మాట్లాడారు. రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు వ్యాఖ్యలుచేయడం సరికాదని, వాటినిఖండిస్తున్నామనికూడా అన్నారు. ఈ వ్యవహారంలోప్రజలను తప్ప్పుదోవపట్టించేలా మాట్లాడవద్దనికూడా అన్నారు.24వ తేదీనే డీజీపీ కార్యాలయంనుంచి ఆయనపేరుతో ఒకప్రకటన కూడా వెలువడింది.
విజయవాడ పోలీస్ కమిషనర్, డీజీపీ మాట్లాడిన మాటల్లో విరుద్ధమైన అంశాలున్నాయి. కమిషనర్ గారేమో దర్యాప్తుజరుగుతోందని, కేంద్రప్ర భుత్వసంస్థలు దర్యాప్తుచేస్తున్నాయని, అదింకా పూర్తికాలేదని, విజయ వాడలోని ఆషీ ట్రేడింగ్ కంపెనీకి గుజరాత్ పోర్టులోపట్టుబడిన హెరాయిన్ తో సంబంధంలేదని ప్రకటించారు. విచారణ పూర్తికాకుండానే, కేంద్రప్రభుత్వ విచారణ సంస్థలనుంచి సమాచారం లేకుండా ఆయన అలా ప్రకటనలుచేయడం సమంజసమా? ఆయనలా మాట్లాడితే డీజీపీ గారు మరో అడుగుముందుకేసి, రాజకీయనాయకులు, సున్నితమైన అంశాలు, భద్రతాపరమైన అంశాలన్నారు.
కమిషనర్ అలా మాట్లాడితే, డీజీపీఅయినా ఏంజరిగిందో, జరుగుతోందో తెలుసుకోకుండా మాట్లాడితే ఎలా?
డీఆర్ఐ వారు విచారిస్తుండగానే ముందుగానే ఏపీపోలీస్ వారు ఎందుకు భుజాలు తడుముకున్నారన్నదే తమసందేహం. పోలీస్అధికా రులై ఉండి, రాజకీయనాయకులు మాట్లాడవద్దని, సున్నితమైన అంశమ ని ఎలా చెబుతారు?వైసీపీపోలీస్ అధికారులైతే అలా మాట్లాడినా తమకు అభ్యంతరంలేదు.కానీ ప్రభుత్వంలో ఉన్న పోలీస్ అధికారులు, పోలీస్ శాఖ హెడ్ సమాచారంలేకుండా, విచారణపూర్తికాకుండానే పరస్పరవిరుద్ధ మైన ప్రకటనలు మధ్యలో చేయవచ్చా? అందుకు వారిసర్వీసు నిబంధ నలు అంగీకరిస్తాయా? అలా మాట్లాడమని వారిసర్వీసుకోడ్ లో ఉందా? ఇవన్నీ పోలీస్ అధికారులు ఆలోచించాలి.
అదేవిధంగా ఎక్కడఏంజరిగినా రాజకీయనేతల వ్యాఖ్యలనుపోలీస్ అధికా రులు ఖండించడమనేది రాష్ట్రంలో ఈమధ్యన ఫ్యాషన్ అయిపోయింది. ఈ ధోరణి చాలాప్రమాదకరమైనది, విచిత్రమైనది కూడా. పోలీసులు అధికార పార్టీకి చెందినవారా…లేకప్రభుత్వానికిచెందిన వారా అనేదిప్రజలుకూడా గమనిస్తున్నారు. ప్రభుత్వంవేరు…. అధికారపార్టీ వేరు. అధికారపార్టీ వాణి ని పోలీసుల వినిపించాల్సిన పనిలేదు. ప్రభుత్వవాణిని మాత్రమే వారు వినిపించాలి. అలానే విపక్షాలని, రాజకీయపార్టీలని పోలీసులు సంబోధిం చకూడదు. ముఖ్యంగా పోలీస్ శాఖ అనేదిచాలా చాలా నిష్పక్షపాతంగా ఉండాలి. అలాంటిశాఖకు చెందిన అధికారులు విపక్షాలవ్యాఖ్యల్ని, వారి చర్యల్ని ఖండించడమనేది ఎంతమాత్రం సమర్థనీయంకాదు.
ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడి ఇంటిపై వైసీపీఎమ్మెల్యే జోగిరమేశ్ దాడి చేసినప్పుడుకూడా పోలీసులు పరస్పరవిరుద్ధమైన ప్రకటనలేచేశారు. ఒక అధికారేమో రమేశ్ చర్చలకువెళ్లాడంటే, మరొకరేమో దాడిచేయడానికి వెళ్లలేదన్నారు. మాజీముఖ్యమంత్రితోచర్చలుజరపడానికి 20కార్లలో మారణాయుధాలు, కర్రలతో వెళతారా? అలావెళ్లమని అధికారపార్టీఎమ్మె ల్యేకి పోలీస్ వారే అనుమతిఇచ్చారా? చంద్రబాబుగారితో చర్చలు జరప డానికి కర్రలు, మారణాయుధాలతో వెళ్లమని పోలీసులేచెప్పారా? అలా వెళ్లలేదని జోగిరమేశ్ చెప్పకుండా డీజీపీ చెప్పడం ఇంకావిచిత్రం. ఇలా అనేక అంశాల్లో పోలీసుఅధికారుల వైఖరి చాలా విచిత్రంగాఉంటోంది.
పోలీస్ అధికారులకు నాదొక విజ్ఞప్తి. ఏ అంశమైనా సరే మాట్లాడేముందు వారు సంయమనం పాటించాలి. పూర్తిసమాచారంలేకుండా, వాస్తవాలు తె లుసుకోకుండా వారు మాట్లాడకూడదు. వారు పోలీసులుకాకుండా, అధికారపార్టీ వ్యక్తులైతే తాము వారివ్యాఖ్యలను తప్పుపట్టం. అలాకాక ప్రభుత్వ బాధ్యతలనే అధికార హోదాలో కొనసాగుతూ, పక్షపాతధోరణితో వ్యవహరించవద్దని పోలీస్ శాఖను కోరుతున్నాం. వారుఅలా వ్యవహరించి నందుకు ప్రతిఫలమే నేడు గంజాయి, డ్రగ్స్ వ్యవహారంలో ప్రజలను తప్పుదారి పట్టించేలా మాట్లాడినతీరు. కేంద్రప్రభుత్వ సంస్థలవిచారణ జరుగుతుందనిచెబుతూనే, వారుధ్రువీకరించకుండా, ధ్రువీకరించారని చెప్పడం చాలా అసంబద్ధం. అది పోలీస్ స్థాయికి,హోదాకు తగిందికాదు.
డీఆర్ఐ విచారణలో సముద్రపు డాన్ అలీషా ఉన్నారు. అతనికి, అధికార పార్టీనేతలతో సంబంధాలున్నాయంటున్నారు. అలానే డ్రగ్స్ రవాణాకు కాకినాడపోర్టుకి లింకులున్నాయి. ఏపీనుంచి ఢిల్లీకి రవాణాఅవుతున్న గంజాయిని డీఆర్ఐ అధికారలుపట్టుకున్నారని, విచారిస్తున్నారని కూడా చూస్తున్నాం. కాకినాడకు విజయవాడకు ఉన్నలింకేమిటి? ఆషీ ట్రేడింగ్ కంపెనీకి ఉన్నసంబంధమేంటి? ఈవ్యవహారం ఇంతలోతుగా ఉంటే, ఆషీ ట్రేడింగ్ కంపెనీ చిరునామా తప్ప, విజయవాడలోఏం జరగలేదని డీజీపీ చెప్పడమేంటి?
ఒకవేళ డీజీపీచెప్పిందే నిజమనుకుంటే, ఆషీ ట్రేడింగ్ కంపెనీ 2020, 2021లో ఏడెనెమిది సార్లు జీఎస్టీ చెల్లింపులుచేసినట్లు సమాచారంఉంది. వాటికికూడా డీజీపీ సమాధానంచెప్పాలికదా? ప్రతిపక్షా లు అంటేరాజకీయపార్టీలు అనేకఅంశాలు మాట్లాడుతుంటాయి. వాటినే పోలీసులుఎందుకుఖండిస్తున్నారు. అధికారపార్టీ కూడా ఏదిపడితే అది మాట్లాడుతోంది. మరిఏనాడూ పోలీస్అధికారులుగానీ, డీజీపీగానీ ఆపార్టీ వారి వ్యాఖ్యలనుఎందుకుఖండించ లేదు? కొంతమంది వైసీపీఎమ్మెల్యేలు అధికారపార్టీనేతలు బరితెగించిమరీ, పోలీసులను బూతులుతిడుతున్నా రు. కొందరైతే తంతామనికూడా అంటున్నారు.
ఇన్నిజరుగుతుంటే డీజీపీ ఏనాడైనా సరే, ఏమిటా వ్యాఖ్యలని అధికారపార్టీ వారిని తప్పుపట్టారా?
అందుకే అంటున్నాం..అధికారపార్టీవారితో ఒకలా..ప్రతిపక్షంవారితో మరోలా డీజీపీస్థాయిలోఉన్నవ్యక్తి వ్యవహరించడం సరికాదు. సర్వీసులోఉన్న డీజీపీకి సర్వీసురూల్స్ వర్తిస్తాయి. అధికారాలతో బాధ్య తాయుతంగా వ్యవహరించాల్సిన డీజీపీ తనవ్యాఖ్యలతో,తనలోని డొల్లతనాన్ని బయటపెట్టుకుంటున్నారు. అది ఆయనకు మంచిదికాదు.. పోలీస్ అధికారులకు మంచిదికాదు…రాష్ట్ర శాంతిభద్రతలకు మంచిదికా దు. ఎందుకంటే విచారణమధ్యలోనే డీజీపీ, ఈవిధమైనప్రకటనలు చేయడంద్వారా సదరువ్యవహరాల్లో ఉన్ననేరస్థులను ఆయనే ప్రోత్సహిం చిన వారవుతారు. నేరస్తులెవరోతెలియకుండానే వారికి సంబంధంలేదు… వీరికి సంబంధంలేదు, కేవలం మాట్లాడటానికి వెళ్లారు అనిఎలా చెబుతా రు? తప్పనిసరై ప్రాణాలుమీదకువచ్చినా, అధికారపార్టీ వారు ప్రతిపక్షాల వారిపై దాడిచేసినా, దాడిచేసినవారిపై చిన్నచిన్న స్టేషన్ బెయిల్ కేసులు పెడుతూ, మీరుఅనుసరిస్తున్నధోరణి లోకూడా మీ యొక్క పక్షపాత ధోర ణి కనిపిస్తోంది.
ఇప్పటికే పోలీస్ శాఖ పట్ల, న్యాయస్థానాలు చాలా తీవ్రమై న వ్యాఖ్యలుచేశాయి. పోలీస్ స్టేషన్లలోనే పౌరులహక్కులకు భంగం కలు గుతోందని, పోలీసులు అధికారపార్టీకి కొమ్ముకాయడంవల్లే అనేక నేరాలు జరుగుతున్నాయని కూడా తెలుస్తోంది. అనేకకేసుల్లోడీజీపీ ఇప్పటికే కిందిస్థాయిలో ఉన్నవారుచేసినదానికి కోర్టులకుహాజరయ్యారు.అయినా కూడా ఆయన తనపద్ధతి మార్చుకోకుండా అధికారపార్టీవారికి వత్తాసు పలుకుతున్నారంటే, పోలీస్ శాఖ చేసే విచారణనిష్పక్షపాతంగా ఉంటుంద ని ఎలానమ్మాలి? డీజీపీసహా, అనేకమందిపోలీసులు న్యాయస్థానాల ముందు దోషులుగా నిలబడినపరిస్థితులను చూస్తున్నాం. ఇకముందు కూడా చూస్తాం. అలాంటి దుస్థితిని పోలీసులు తెచ్చుకోవడం సమంజసంకాదని ఈ సందర్భంలో మనవిచేస్తున్నాం.
ఏదిఏమైనా సము ద్రపు డాన్ లు, వారికున్న లింకులు, వారితోకాకినాడకు చెందిన వ్యక్తుల కుఉన్న లింకులు, సుధాకర్ కుఉన్నలింకు, ఆషీ ట్రేడింగ్ కంపెనీతో సముద్రపు డాన్ కుఉన్నలింకులు, సదరుకంపెనీ కట్టిన జీఎస్టీ చెల్లింపు లపై నిష్పక్షపాతంగా విచారణజరపకుండా, పూర్తివాస్తవాలు తెలుసుకో కుండా మధ్యలోనే ప్రకటనలుచేయడంద్వారా డీజీపీ నేరస్తులకు మధ్ధతి స్తున్నారా…వారిని ప్రోత్సహిస్తున్నారా అనే అనుమానం కలుగుతోంది. పోలీసులపైనే అనుమానంకలిగేలా డీజీపీప్రవర్తించడం ఏమాత్రం మంచిది కాదు. కాకినాడకు డ్రగ్స్ దందాతో లింకులున్నాయని తేలినప్పుడు, కాకినాడకుచెందిన అధికారపార్టీనేతలప్రమేయంఉందని ఆరోపణలు వచ్చి నప్పుడు, మచిలీపట్నంపోర్టుపేరుతో కాకినాడ పోర్టుకు డ్రగ్స్ సరఫరా అయ్యాయని, అక్కడినుంచి విజయవాడకు, ఆతరువాతరాష్ట్రంలోని ఇతర ప్రాంతాలకు సరఫరా అవుతున్నాయని తెలుస్తోంది. వీటన్నింటిపై నిష్ప క్షపాతంగా విచారణజరపడమేకాకుండా, కేంద్రప్రభుత్వసంస్థలకు సహకరిం చేలా ఏపీపోలీసులుపనిచేయాలి.
అలా కాకుండాప్రతిపక్షాలపై వ్యాఖ్యలు చేయడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని చెబుతున్నాం. డ్రగ్స్ డాన్ ఎవరు… అతనివెనకున్న వారెవరు అనేది తేల్చితే, పోలీసులకుప్రజలే మెడల్స్ వేస్తారు. వీలైతే ఆపనిచేయండి. అంతేగానీ అధికారపార్టీ వారిచేతిలో దాడులకుగురైన వారిపైనే తప్పుడుకేసులుపెడుతూ , ప్రభుత్వపెద్దల మెప్పుపొందాల్సిన పనిలేదు. అధికారపార్టీవారిపై డ్రగ్స్ ఆరోపణలు వచ్చి నప్పుడు వారినిర్ధోషిత్వం తేలకముందే, ప్రతిదానికీ డీజీపీ మాట్లాడటం, వారిప్రమేయం లేదని చెప్పడం ప్రజాస్వామ్యానికి మంచిదికాదు. పోలీసులు వారివిధినిర్వహణను వారుసక్రమంగానిర్వర్తించి, ప్రజల విషయంలో చిత్తశుద్ధితో ఉండాలని సూచిస్తున్నాం.

LEAVE A RESPONSE