Suryaa.co.in

Telangana

ఈ దేశంలో కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరున్నారు?

-పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు
-హిందువుల పండుగలను అని అంటున్నారు మరి మేము ఎవరం
-మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్

హైదరాబాద్ నగరంలో, రాష్ట్ర వ్యాప్తంగా,హైదరాబాద్, రాచకొండ, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో 39 వేల గణపతి మండపాలు ఏర్పాటు చేశారు.వినాయక నిమజ్జనం పై విసృత ఏర్పాట్ల పై అనేక సార్లు సమీక్షలు జరిగాయి.సీఎం కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక పండుగలను గొప్పగా జరుపుకోవాలని నిర్ణయించారు.

హైదరాబాద్ నగరంలో బోనాల పండుగలను చాలా గొప్పగా జరుపుకున్నాం.తెలంగాణ రాష్ట్రం ముఖ్యమంత్రి గారు రాష్ట్రం ఏర్పడిన తరువాత మన సంస్కృతి సంప్రదాయాలు గొప్ప ఉండాలని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.దేశంలో అనేక పండుగలు ఒకలగా జరిగితే,తెలంగాణ రాష్ట్రం లో ఒకలాగా జరుపుతున్నాం.

ఇవాళ మాట్లాడిన కొంత మంది వ్యక్తులు మాట్లాడారు వెంటనే బతుకమ్మ పండుగ జరుపుతారు.కానీ వినాయక చవితి పండుగ ను జరుపరు అని.కానీ తెలంగాణా రాష్ట్రంలో జరిపినట్టు ఎక్కడ కూడా జరుపరు. సమేక్యతను ప్రతిబించేలా ఈ వినాయక చవితి ఉంటుంది. హైదరాబాద్ నగరంలో వినాయక నిమజ్జనం కోసం అనేక ఏర్పాట్లు చేశాం.చిన్న చిన్న పాండ్ లు ఏర్పాటు చేశాం…అయితే అవ్వి మురుగు నీరు అంటున్నారు.హైదరాబాద్ చాలా అద్భుతమైన ఏర్పాట్లు చేశాం.. నిన్న 5 డేస్ సందర్భంగా చాలా గణేష్ నిమజ్జనం చేశారు.ప్రభుత్వం ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేశాం.

ప్రభుత్వం ఏర్పాట్లు చేయకపోతే మేము చేస్తాం అంటున్నారు ఎలా చేస్తారు? .మీరు ఇంత మంది పోలీస్ లను ఎక్కడ నుండి తెస్తారు.పండుగలను రాజకీయాలకు వాడుకోవడం కరెక్ట్ కాదు. హిందువుల పండుగలను అని అంటున్నారు మరి మేము ఎవరం…..మేము స్వతహాగా మేము వినాయకులనుtalasani-item-pic పెట్టేవాళ్ళం….బోనాలు చేసేవాళ్ళం….కృష్ణాష్టమి పండుగను ఘనంగా జరిపే వాళ్ళం… పండుగలు చేయాలి అంటే ఎవరైనా చెప్పాలా….ప్రభుత్వం, మా బాధ్యత.మేము ముందే అన్ని ఏర్పాట్లు చేశాము….3 నెలల ముందే అన్ని ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించాం.ప్రభుత్వం ఇంత బాగా ఏర్పాటు చేసినందుకు ఇంకా ప్రభుత్వం ను రెచ్చగొట్టే వ్యాఖ్యలు కరెక్ట్ కాదు.ఇలాంటి వాక్యాలు బాధించాయి…అన్ని శాఖల అధికారులతో సమీక్ష చేసి అందుబాటులో ఉంచేలా ఏర్పాట్లు చేశాం.

మీరు హిందువులు అంటే మేము ఎవరం.తెలంగాణ రాక ముందు ఇలాంటి ఏర్పాట్లు ఎలా ఉన్నాయి అందరికి తెలుసు.గ్రేటర్ పరిధిలో ఉండే వినాయక ఆర్గనైజర్ లతో నేను కోరేది ఒక్కటే అన్ని ఏర్పాట్లను చేశాము.ప్రభుత్వం మీద బురద చల్లేందుకు అనేక అవాస్తవాలను మాట్లాడారు.కరోనా వల్ల కొంత ఇబ్బందులు పడ్డాం ఈసారి ఘనంగా జరుపుతామని తెలుపుతున్న. ఎవరి ఆరోపణలు పట్టించుకోవాల్సిన పని లేదు…ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది ఘనంగా చేశాం ఎవరు ఇబ్బందులు పడాల్సిన పని లేదు. ఈ దేశంలో కేసీఆర్ కంటే గొప్ప హిందువు ఎవరున్నారుయాదాద్రి ఆలయం నిర్మాణం,సాగునీటి ప్రాజెక్టులకు దేవుళ్ళ పేర్లు పెట్టడం..బోనాలను ప్రభుత్వ పండుగగా జరపడం ఇవన్నీ ఎవరు చేస్తారు?

LEAVE A RESPONSE