ఎన్నికలు వస్తేనే కేసీఅర్ బయటకు వస్తాడు

– కల్వకుర్తి మండలం ఎల్లికల్ గ్రామంలో YSR తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల కి గ్రామస్థుల ఘన స్వాగతం

8 ఏళ్లు గా కేసీఅర్ చేస్తుంది పరిపాలన కాదు..మోసం. కేసీఅర్ ది స్వార్థ రాజకీయం. ఎన్నికలు వస్తేనే కేసీఅర్ బయటకు వస్తాడు.ఇప్పుడు మునుగోడు ఎన్నికలు కాబట్టి బయటకు వస్తున్నాడు. ఇన్ని రోజులు ఇవ్వని పథకాలు ఇప్పుడు అమలు చేస్తా అని చెప్తున్నారు. ఎన్నికలు ఉన్నప్పుడు కేసీఅర్ పథకాల పేరుతో స్విచ్ వేస్తాడు.ఎన్నికల్లో ఓట్లు వేయించుకొని తిరిగి ఫామ్ హౌజ్ కి వెళ్ళిపోతాడు.8 ఏళ్లుగా పథకాలు ఎందుకు అమలు చేయలేదు?కేసీఅర్ మోసం చేయని వర్గం … మోసపోని కుటుంబం లేదు.మాట మీద నిలబడే నాయకుడు కేసీఅర్ కాదు.మాట మీద నిలబడే న్యాయకత్వం కోసం పార్టీ పెట్టాం. వైఎస్సార్ తెలంగాణ పార్టీ వైఎస్సార్ ప్రతి ప్రతి పథకాన్ని అమలు చేస్తాం.

Leave a Reply