• ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి రూ. 50లక్షలు ఫీజు చెల్లించి లాయర్ అభిషేక్ మనూ సింగ్విని నియమించుకునేంత ధనవంతుడు కాదు
• జగన్ రెడ్డి చెల్లెలు సునీత తనకు రక్షణ కల్పించాలని పోలీసులను కోరడం మహిళల భద్రతా లోపానికి నిదర్శనం
– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
వివేకా హత్య కేసుకు అడుగడుగున అడ్డు తగులుతున్న అదృశ్య శక్తి ఎవరు? అని పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ప్రశ్నించారు. మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం, ఎన్టీఆర్ భవన్ లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. విలేకరుల సమావేశంలో టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య ఏమన్నారో ఆయన మాటల్లోనే…!
‘‘ఆంధ్రప్రదేశ్ ని కుదిపేసిన జగన్ రెడ్డి బాబాయి వివేకానంద హత్య కేసు సంచలనంగా మారిన విషయం జగద్విదితం. దర్యాప్తుకు అడ్డుపడుతున్న అజ్నాత వాసి ఎవరు? వివేకా హత్య కేసులో ముద్దాయిగా ఉన్న వ్యక్తులకు కోట్లు రూపాయలు ఖర్చు చేస్తుందెవరు?
వివేకా హత్య కేసులో ముద్దాయిలను కాపాడేందుకు సుప్రీం కోర్టులో ఒక కేసుకు రూ. 50లక్షలు అపిరీయన్స్ తీసుకునే లాయర్లని నియమిస్తున్న అదృష్య శక్తి ఎవరు? అభిషేక్ మనూ సింగ్వీ లాంటి ప్రఖ్యాత లాయర్లని నియమించిందెవరు? కేసు దర్యాప్తు చేస్తున్న సిబిఐ అధికారులను భయపెడుతున్నదెవరు? దేశంలో ఎన్నడు సిబిఐ అధికారులని బెదిరించిన సంఘటనలు ప్రజలెవ్వరు చూడలేదు.
దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయడానికి లోకల్ కోర్టు నిరాకరించింది. హైకోర్టు కూడా బెయిల్ ని ఇవ్వలేదు. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ కోసం సుప్రీం కోర్టుని ఆశ్రయించడానికి రూ. 50లక్షలు ఫీజు చెల్లించి అభిషేక్ మనూ సింగ్విని నియమించుకునేంత ధనవంతుడు కాదు. అతనికి సాయం చేస్తున్న అదృశ్య శక్తి ఎవరో ప్రజలందరికి తెలియాలి. వివేకా హత్య కేసులో దేవిరెడ్డి శివశంకర్ రెడ్డిని మించిన కుట్రదారులు ఎవరున్నారో తెలియాలి. దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి సాక్ష్యులని ప్రభావితం చేసే శక్తివంతుడని సుప్రీం కోర్టు నిర్ణయానికి వచ్చింది. వివేకా హత్య వెనుక ఉన్న అదృశ్య శక్తులెవరో త్వరితగతిన విచారణ జరిపి బయట పెట్టాలి.
స్వయాన జగన్ రెడ్డి చెల్లెలు, వివేకా కూతురు సునీత తమకు ప్రాణ హాని ఉంది భద్రత కల్పించమని కడప ఎస్పీ, పోలీసులని కోరిందంటే ఇక రాష్ట్రంలోని మహిళలకు భద్రత ఉందా? మండుటెండలో ఢిల్లీ వీధుల్లో తన తండ్రి మరణానికి కారణమైన వారికి శిక్ష పడేలా చేయటం కోసం తిరుగుతున్న జగన్ రెడ్డి చెల్లెలు సునీతకు అన్నగా జగన్ రెడ్డి తాను అండగా ఉండి విచారణ జరిపిస్తానని భరోసా ఇవ్వలేకపోయారు. ముద్దాయిలకు శిక్ష పడేలా చేస్తానని చెప్పలేక పోయారు. తన చెల్లెలకు అండగా నిలబడలేని వ్యక్తి, రాష్ట్ర మహిళలకు అండగా నిలబడతారా?
జగన్ రెడ్డి వివాహాం, తన చెల్లెలు సునీతా రెడ్డి వివాహాం ఒకే రోజు జరిగింది. (నాటి పెళ్లి పత్రికను మీడియాకు చూపారు)
అన్న, చెల్లెలు వివాహం ఒకే రోజు జరిగింది. ఆ విశ్వాసం, ప్రేమ, అభిమానం కూడ లేదు జగన్ రెడ్డికి లేదు. సొంత తల్లికి అన్నం పెట్టలేని వాడు, పినతల్లికి బంగారు గాజులు వేస్తాడన్న రీతిలో జగన్ రెడ్డి వ్యవహరిస్తున్నారు. ఆడపిల్లకి సాయం లేని, మానవత్వం లేని పదవులు ఉంటే ఎంత, ఊడితే ఎంత. సొంత చెల్లి షర్మిలను రాష్ట్రంలో అడుగు పెట్టడానికి వీళ్లేకుండా తరిమికొట్టారు. సొంత చెల్లెల్లకు న్యాయం చేయలేని అన్న రాష్ట్రంలోని మహిళల్ని అక్క, చెల్లెమ్మలని అండగా ఉంటానని చెప్పడం హాస్యాస్పదం. వివేకా హత్య కేసును నీరుగారుస్తున్న అజ్నాత వ్యక్తి గురించి విచారణ జరిపి బయటపెట్టాలని సిబిఐని ప్రశ్నించే ధైర్యం జగన్ రెడ్డికి ఉందా?
మీ అరాచకత్వం, దౌర్జన్యం, నిరంకుశత్వం, దుర్మార్గంతో సిబిఐ మీద కూడ కేసులు బనాయిస్తున్న పరిస్థితి. మా మీద కేసులు పెడుతున్నారని హైకోర్టుని సిబిఐ ఆశ్రయించిన ఘనత అదృశ్య శక్తిది కాదా. సిబిఐ చేయాల్సిన పకడ్బంది దర్యాప్తు చేయకపోవడానికి కారణం ఏంటో అర్దం కావటం లేదు. గ్రీన్ ట్రిబ్యూనల్ దగ్గర పోలవరం గురించి మాట్లాడటానికి వెళ్లాల్సిన అభిషేక్ మనూ సింగ్వీ వివేకా హత్య కేసు ముద్దాయి దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి బెయిల్ మంజూరు చేయించే పనిలో ఉన్నారు. జగన్ రెడ్డికి పోలవరం, 5 కోట్లు ఆంధ్ర ప్రజలు ఏమైనా పర్వాలేదా? శివశంకర్ రెడ్డి బెయిల్ కు ప్రాధాన్యత ఇవ్వడం వెనుకున్నదెవరు?
వైసీపీ ప్రభుత్వం న్యాయవాదులకు ఖర్చు చేస్తున్నా దానిపై సుప్రీం కోర్టు వివరణ కోరింది. అయినా సిగ్గు,ఎగ్గు లేకుండా విలేకరుల సమావేశం పెట్టి ఏదేదో మాట్లాడుతున్నారు. ప్రభుత్వం చట్టాలు, న్యాయస్ధానాలు, పోలీసులు, ఎవరికి బయపడటం లేదనేది ప్రజలు తెలుసుకోవాలి. ఇటువంటి వారికి ఓట్లేసి గెలిపించకూడదని ప్రజలు తెలుసుకోవాలి. జగన్ తమ వ్యక్తిగత కేసులు కోసం ప్రజా ధనాన్ని వృధా చేస్తున్నారు. జీవోలు ఇచ్చి మరీ లాయర్లకి అడ్వాన్సులు కోటి రూపాయలు చెల్లించారు.
అడ్వాన్సే కోటి ఉంటే మొత్తం ఫీజు ఎంత ఉంటుందో? లాయర్ కి ఇంత పెద్ద మొత్తంలో ఫీజు ఇచ్చిన రాష్ట్ర ప్రభుత్వం దేశంలో ఎక్కడా ఉండదు. అనవసర విషయాలు పుంకానా, పుంకాలు రాసే సాక్షిలో న్యాయవాదులకు ప్రభుత్వం చేస్తున్న ఖర్చుపై సుప్రీం కోర్టు వివరణ కోరిన అంశాన్ని మాత్రం ఎక్కడో ఒక చిన్న వార్తగా ప్రచురించారు. వీటన్నిటి వెనుక ఉన్న అదృశ్య శక్తి ఎవరో బయట పెట్టాల’’ని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.