– సింగరేణి గనుల విషయంలో మీ వల్ల ఏం జరిగిందో చర్చకు సిద్ధం
– దళిత మహిళ దేశ ప్రెసిడెంట్ గా పోటీ చేస్తే మద్దతు ఎందుకు ఇవ్వలేదు
కేంద్ర బడ్జెట్ పై శాసనసభలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు
హైదరాబాద్: డిస్కం లు, సింగరేణి గనులు ప్రైవేట్ పరం చేస్తున్నామంటూ గౌరవ శాసనసభ్యులు కేటీఆర్ మాట్లాడడం సరైంది కాదని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు అన్నారు. ఈ విషయాన్ని ఎవరు? ఎక్కడ? ప్రస్తావించారో చెప్పకుండా అడ్డగోలుగా.. ఏది పడితే అది మాట్లాడుతూ సభను తప్పుదోవ పట్టించవద్దని డిప్యూటీ సీఎం కేటీఆర్ కు సలహా ఇచ్చారు.
సింగరేణి గనుల విషయంలో మీ వల్ల ఎంత లాభం జరిగింది ఒక రోజంతా సభలో చర్చకు మేం సిద్ధమని డిప్యూటీ సీఎం సవాల్ విసిరారు. మా హయాంలో సింగరేణి గనులకు ఏం జరిగిందో వివరించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మీరు పదేళ్లు రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు.. మీరు బాగా పరిపాలన చేసి ఉంటే.. ప్రస్తుతం రాష్ట్రంలో ఎన్ని సమస్యలు ఎందుకు ఉంటాయని ప్రశ్నించారు. బిజెపి ప్రభుత్వం గతంలో ప్రవేశపెట్టిన బిల్లులన్నింటికి BRS నేతలు మద్దతు తెలిపిన విషయం అందరికీ తెలుసని అన్నారు.
కేంద్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి జరిగిన అన్యాయం గురించి చర్చ జరిపి తీర్మానం చేసి.. కనీసం అక్కడ డియాండ్స్ డిస్కషన్ చేసేప్పుడైనా తెలంగాణకు ప్రయోజనాలు చేసేలా చర్చకు పెడితే.. ఆ సబ్జెక్ట్ కాకుండా అన్ని విషయాలు మాట్లాడుతున్నారు. మీ చర్చ అంతా ఆవు కథలా ఉందని డిప్యూటీ సీఎం చమత్కరించారు.
ముఖ్యమంత్రి తప్పేమీ చెప్పలేదు. బీఆర్ఎస్.. బీజేపీతో కలిసి గతంలో అనేక సందర్భాల్లో ఉన్నారు. బీజేపీ ప్రవేశ పెట్టిన అనేక బిల్లులకు బీఆర్ఎస్ మద్దతు ఇచ్చిందన్నారు. ఇప్పుడు కూడా అదే ప్రయత్నంలో ఉన్నారు. అది మంచిదికాదు.. తెలంగాణ ప్రజల గురించి ఆలోచన చేయాలని చెప్పారు.
రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేప రామ్ నాథ్ కోవింద్ ని పెడితే మీరు మద్దతు ఇచ్చారని ముఖ్యమంత్రి చెప్పారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ, తెలంగాణ బిల్లును పాస్ చేయడానికి కృషి చేసిన నాటి స్పీకర్ మీరాకుమార్, వారు రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేస్తుంటే.. వారికి మద్దతు ఇవ్వలేదు. సరికదా.. ఎయిర్ పోర్ట్ నుంచి ప్రొటోకాల్ మర్యాదలు కూడా పాటించలేదు.
రామ్ నాథ్ కోవింద్ దళితులు కాబట్టి మద్దతు ఇచ్చాం.. అంటున్నారు. మీరా కుమార్ దళితులు కాదా? తెలంగాణ రాష్ట్ర ఏర్పపాటును సాకారం చేసిన మీరా కుమార్ కు మద్దతు ఇవ్వాల్సిన అవసరం లేదా? తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ ముఖ్యమా..? లేక తల్లిని చంపి బిడ్డను బతికించారన్న బీజేపీ మీకు ముఖ్యమా? పార్లమెంట్ లో తలుపులు మూసేసి తెలంగాణ ఇచ్చారన్న బీజేపీ అభ్యర్థికి మీరు మద్దతు ఇచ్చారు అన్నారు