-రాయలసీమ రైతులు శ్రీశైలం ప్రాజెక్టు కోసం భూములు ఇచ్చిన రైతులదా?
-రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం భూములు ఇచ్చిన భ్రమరావతి ప్రజలదా?
( డాక్టర్ జీవితేశ్వరరావు)
ఈరోజు తెలంగాణ , ఆంధ్ర ప్రదేశ్లో కృష్ణా డెల్టా సస్యశ్యామలంగా ఉందంటే అది శ్రీశైలం ప్రాజెక్ట్ కొసం సుమారు 60,000 ఎకరాలు భూములు ఇచ్చిన రాయలసీమ రైతులు పుణ్యమే. నా దృష్టిలో నిజమైన త్యాగం అంటే రాయలసీమ వాళ్ళది.అప్పటి రైతులు కులము, ప్రాంతము ఏమి అని చూడకుండా ప్రాజెక్టు వస్తే రాష్ట్రము రాష్ట్ర ప్రజలు బాగు పడతారని ఉద్దేశంతో రైతులు భూములు ఇచ్చినారు. వాళ్లు నిజమైన స్వాతంత్ర సమర యోధులు కంటే చాలా గొప్పవారు. ఆ ప్రాజెక్టు వలన లక్షలాది ఎకరాలు పంటలు పండి దేశ ప్రజలకు బువ్వ (అన్నము) పెడుతున్న ప్రాజెక్ట్. విద్యుత్ ఉత్పత్తి జరిగి రాష్ట్ర అభివృద్ధికి పాటు పటిన రైతులు అదీకాక రాష్ట్ర సంపదను పెంచిన శ్రీశైలం ప్రాజెక్ట్.
అప్పటి రాయలసీమ రైతులు ప్రాజెక్ట్ కోసము భూములు ఇచ్చేటప్పుడు కులము చూడలేదు, ప్రాంతము అని చూడకుండా అందరూ బాగుండాలి అనే మంచి ఉద్దేశంతో 60,000 వేల ఎకరాల ఏ స్వార్థం లేకుండా వారి భూములను శ్రీశైలం ప్రాజెక్ట్ కోసం ఇచ్చినారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం బ్రమరావతి లో ఆందోళన చేస్తున్న వాళ్లు నా దృష్టిలో రైతులే కాదు పెద్ద స్వార్ధపరులు. బేమరావతి అనేది ఒక పెద్ద బోగస్ ..! దాదాపు రెండు లక్షల కోట్లు అక్కడ పెట్టుబడి పెడితే తన బినామీలకు, తన వర్గం వాళ్లకు ఉపయోగం తప్పితే రాష్ట్ర జనానికి రూపాయి ఉపయోగం లేదు.
ఎలా అంటే..?
బేమరావతి వాళ్ళు అనే మాట మేము ఐదుకోట్ల ఆంద్రుల కోసం మా భూములను త్యాగం చేసాము అని అంటారు. మా ఎకరా భూమిలో 0.30 సెంట్లు భూమిని తీసుకుని, మిగిలిన 0.70 సెంట్లు భూమిని ఐదుకోట్ల ఆంద్రుల కోసం త్యాగం చేసాము అని అంటారు.
ఇది ఒక బోగస్
ఎలానో ఇక్కడ చూడండి. వాళ్ళు రాజధాని అనే దానికి ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు + ప్రభుత్వ భూమి అనగా అటవీ, డొంకలు, పోరంబోకు భూములు ఇతర ఇతర భూములు మొత్తం కలిపి 20,000 ఎకరాల ప్రభుత్వ భూములు రాజధానికి ఇచ్చింది. మొత్తం కలిపి ఇప్పుడు రాజధానికోసం తీసుకున్న భూమి 54,000 ఎకరాలు. ఇందులో అక్కడి వారు ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు లకు గానూ ఎకరాకి 0.30 సెంట్లు తీసుకుని మిగిలిన 0.70 సెంట్ల భూమి ఐదుకోట్ల ఆంద్రులకు కోసం త్యాగం చేసాము అని అంటారు.
ఇక్కడే అసలైన మోసం దాగి ఉంది..
అది ఏమి టంటే ఆ 0.70 సెంట్ల భూమిని ఇచ్చినట్లే ఇచ్చి , తిరిగి వాళ్ళ 0.30 సెంట్ల ప్లాట్లకు రోడ్లు, కాలువలు, ఇతర సదుపాయాలకోసం ఆ భూమిని వారికొరకే తిరిగి ఉపయోగించు కున్నారు.
అంతే కాదు ఇక్కడ మరో విషయం ఏమిటంటే వాళ్ళు ఇచ్చిన భూమికి సదుపాయాలు కల్పించడం కోసం వాళ్ళు ఇచ్చిన భూమి సరిపోక ప్రభుత్వం వారు ఇచ్చిన 20,000 ఎకరాల భూమిసైతం వారి అవసరాలకే వినియోగించుకున్నారు. అంటే ఆ ప్లాట్లకు వసతుల కల్పనకు వాళ్ళ భూమి సరిపోక ప్రభుత్వ భూమిని కూడా మరికొంత వాడుకున్నారన్న మాట. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం.
అక్కడి వారు ఇచ్చిన భూమి 34,000 ఎకరాలు.
వారు తిరిగి తీసుకున్నది ఎకరాకి 0.30 సెంట్లు
అంటే 34,000 ఎకరాలలో తిరిగి తీసుకున్నది = 10,200 ఎకరాలు మిగిలి ఉండవలసిన భూమి..
34,000
-10,200
…………
23,800 ఎకరాల భూమి
మరియు 20,000 ఎకరాల ప్రభుత్వ భూమి
23,800
+20,000
………….
43,800 ఎకరాల భూమి ఐదుకోట్ల ఆంద్రుల కోసం మిగలాలి.
కానీ ప్రభుత్వానికి మిగిలిన భూమి ఎంతో తెలుసా కేవలం 10,000 ఎకరాల భూమి మాత్రమే ..
43,800 ఎకరాల భూమి మిగల వలసిన దానికి, కేవలం 10,000 ఎకరాల భూమి మాత్రమే మిగిలితే దానిని ఎలా త్యాగం అంటారో ఆ గొప్ప మేధావులే చెప్పాలి. వాళ్ళు భూమిని కుడి చేత్తో ఇచ్చి ఎడమ చేత్తో వాళ్ళ ప్లాట్లకు రోడ్ల రూపంలో, కాలువలు, ఇతర అవసరాలకు వారికోసమే తిరిగి ఉపయోగించుకోని ఐదుకోట్ల ఆంద్రుల కోసం త్యాగం చేసామని బుకాయిస్తున్నారు. పైపెచ్చు వాళ్ళు ఎకరాకి కౌలు రూపంలో మెట్ట భూమికి 30,000/-
జరీబు భూమికి 50,000/-
రూపాయలు తీసుకుంటూ దానికి కూడా సం. రానికి ఒక సారి 10% పెంచుతూ ప్రభుత్వం ఇస్తుంది.
అంతేకాక ఆ భమరావతి నిర్మించడానికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయల పైన డబ్బు ఖర్చుచేస్తే తప్ప అభివృద్ది కాదు..!
అందులో మొదటి విడతగా చంద్రబాబు దిగిపోతు 54,000/- కోట్లకు టెండర్లు కూడా పిలిచారు. ఇంత డబ్బు ప్రభుత్వం వద్ద ఉండదు కనుక ఆ డబ్బంతా ప్రభుత్వం అప్పు తేవాలి అలా అప్పు తెచ్చి నిర్మించాలి. ఆ అప్పులు తాలూకు అసలూ, వడ్డీ మొత్తం మన ఐదుకోట్ల ఆంద్రులు జీవిత కాలం కట్టు కుంటూ పోవాలి. అక్కడి వారి భూములు విలువలు పెంచుకుంటూ పోయి వారు కోటీశ్వరులు గానూ ఆ అప్పులను కట్టు కుంటూ మనం భికారులు గానూ మిగిలి పోవాలి.
అసలు ఆ భమరావతిలో 70% భూములు మొత్తం భాభోరు భినామీ, బాబోరి వర్గం వారివే. అందుకే వారిని కోటీశ్వరులను చేస్తాను, AC గదులలో ఉంచుతాను అని అప్పుడేచెప్పాడు. అలా చెప్పి ఆ భూములు తీసుకుని మిగిల్న మనల్ని అప్పులు కడుతూ ఉండేలా భికార్లను చేయాలని చూసాడు. కేవలం వారి వర్గం వారిని ఆర్దికంగా పైకి తేవడానికే వేసిన ఎత్తుగడ ఇది. ఎక్కడైనా రాజధాని అంటే ప్రభుత్వ భూమి ఉన్న చోట నిర్మించి దాని చూట్టూ ఒక మాష్టర్ ప్లాన్ ఇచ్చి దాని ప్రకారం ప్రైవేట్ వ్యక్తులు నిర్మించుకోమని చెప్పాలి.
అంతేగానీ ఇలా వేల ఎకరాల ప్రైవేట్ భూములు తీసుకోని, అధిక వడ్డీకి అప్పులు చేసి రాజధాని నిర్మిస్తామని జనాలకు చెప్పి తమ సామాజిక వర్గం వారికి లబ్ది చేయడం కోసం ఐదుకోట్ల మందిని అప్పుల ఊబిలోకి నెట్టడం అమానుషం. కమరావతి లో అత్యదిక బాగం భూమి తుళ్ళూరు మండలంలోనే ఉంటుంది. దానిలో శాఖమూరు, రాయపూడి, ఐనవాలు తప్ప తుళ్ళూరు మండలంలో మిగిలిన గ్రామాలు మొత్తం భూములు బాబోరి వర్గం వారివే ఆ విషయం ఎవరిని అడిగినా చెప్తారు. కనుక ఆ భమరావతి కేవలం బాబోరు భినామీలకు, వారి వర్గం వారికి తప్ప మరెవరికీ దాని వల్ల వచ్చిన లబ్ది ఏమీ లేదు.
నిజం చెప్పాలంటే ఆ భమరావతి లొ ఆకరికి మన సీఎం వైఎస్ జగన్ 5% భూములను పేదలకు పంచుతాను అంటే అలా పంచడానికి వీలు లేదు, మా రాజధానిలో ధనికులు తప్ప పేదలు వస్తే మురికి వాడలా మారిపోతుంది. మావద్ద అంతా రిచ్ వాళ్ళే ఉండాలి అని చెప్పి కోర్టుకు పోయి పేదలకు పంచే ఇంటి స్థలాలను సైతం అడ్డు కున్న ఘనులు వాళ్ళు అలాంటి వాళ్ళు మన ఐదుకోట్ల మందికోసం త్యాగాలు చేసామంటే ఎలా నమ్ముతారు.
వారి భూములు ఇచ్చి నట్టే ఇచ్చి తిరిగి వాళ్ళ ప్లాట్లకే వసతులకోసం వాడు కున్నారు. కనుక ఆ భమరావతి పూర్తిగా వారికే లబ్ది తప్ప మరెవరికీ ఉపయోగ పడదు. అక్కడి ధరలలో ఏ ఒక్క సామాన్యుడు సైతం కొనగలిగే అవకాశమే లేదు. కనుక అది ఎప్పటికీ సామాన్యుడు లేని ప్రదేశం అభివృద్ది కావడం అసాద్యం కనుక అది దరలు ఎక్కువ, జనాలు తక్కువగా ఉండే ప్రదేశంగా మిగిలి పోద్ది.
అంతేకాక అక్కడి భూమి నల్లరేగడి కనుక అక్కడ ప్రవేట్ వ్యక్తులు నిర్మించే నిర్మాణాలకు కేవలం 11 అంతస్తుల వరకు మాత్రమే అనుమతులు ఇస్తారు అంతకు మించి నిర్మించడానికి అనుమతులు ఇవ్వరు. మూడు పంటలు పండే మంచి భూమిని నాశనం చేసి అంత అప్పు చేసి ప్రజలపై భారం వేసి ఆ భమరావతి నిర్మించడం అవసరమా …?
ప్రతి ఒక్కరూ ఆలోచించాలి
కేవలం అక్కడి వారి ఆర్దిక అభివృద్దికి తప్ప సామాన్యుడు ఉండలేడు కొనలేని చోట అధి ఎలా అభివృద్ది చెందుతుందో ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. గ్రాఫిక్స్ కాదు మనకు కావాల్సింది… నిజమైన అభివృద్ధి తో కూడుకున్న మన రాష్ట్రంలో రాజధాని