– మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా?
– బుద్ధ భవన్ లో మహిళా కమిషన్ చైర్ పర్సన్ లేకపోవడంతో సెక్రటరీ కి ఫిర్యాదు లేఖను అందజేసిన మాజీ మంత్రి ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి, బీఆర్ఎస్ మహిళా నేతలు
హైదరాబాద్: మంత్రులు మహిళా అధికారులను ఇంటికి పిలుచునికి సమీక్షలు చేస్తున్నారని, మహిళా అధికారులు ఇబ్బందులు పడుతున్నారని వార్తలు వస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీ మహిళా కార్యకర్తలను, ఎమ్మెల్యేలను, అధికారులను, ఎమ్మెల్యేలను మంత్రులను అగౌరవ కారుస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఇందిరమ్మ రాజ్యం వస్తుందని అన్నారు.
మహిళలను అవమానించడమే ఇందిరమ్మ రాజ్యమా అని అడుగుతున్నాం. మహిళా అధికారులను మంత్రులు ఇంటికి పిలుచుకొని రివ్యూ చేశారని వచ్చిన వార్తల పై విచారణ చేపట్టాలని మహిళా కమిషన్ కి ఫిర్యాదు చేశాం. గత ప్రభుత్వంలో సి ఎస్ శాంతి కుమారి కి ఉన్నత పదవి కట్టబెట్టాం.
కానీ ఈ ప్రభుత్వం అనేక విధాల మహిళా అధికారులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మహిళా ప్రజాప్రతినిధుల పై కూడ గౌరవం లేకుండా మాట్లాడుతున్నారు. సీఎం వద్దకు వెళ్ళాలి అంటే తన తల్లి మహిళ మంత్రి భయపడుతున్నారని ఆమె కూతురు ఆరోపించారు. మహిళా జర్నలిస్టుల పై దాడులు చేశారు. కేసులు పెట్టారు. కొత్తగూడెం లో గిరిజన మహిళను వివస్త్ర చేసిన ఘటన వెలుగు చూసింది.
సీఎం ఢిల్లీ నివాసంలో కలిసే అవకాశం కూడా ఇవ్వకుండా అవమానించారు. మహిళలను కోటీశ్వరులు చేయకపోయినా పర్వాలేదు. మహిళల హక్కులకు భంగం కలిగేలా వ్యవహరించవద్దు. గురుకులాల్లో విద్యార్థినులు వేధింపులకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మహిళలకు ఇచ్చిన హామీలు ఏం అయ్యాయి?
మహిళా అధికారులను ఇండ్లకు పిలవకుండా స్వేచ్ఛగా పనిచేసేలా పరిస్థితులు కల్పించాలి. మహిళా అధికారులను వేధించకండి. రాజకీయ ప్రయోజనాల కోసం మహిళలను బలి చేయకండి.
పత్రిక ప్రకటనల ఆధారంగా సుమోటోగా కేసు నమోదు చేసి విచారణ చేయాలి. మహిళలను ఇండ్లకు పిలిచి సమీక్షలు చేయడం ఏంటి? సచివాలయం బ్రహ్మాండంగా నిర్మించారు. అందులో రివ్యూలు ఎందుకు పెట్టడం లేదు? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక బీఆర్ఎస్ అభ్యర్థి సునీత కన్నీరు పెట్టుకుంటే, మంత్రులు అవమానించారు. మిస్ వరల్డ్ కంటెస్టెంటట్లను ఇబ్బందులు పెట్టారు. మహిళలకు ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదు.