• అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయ్
• రాజకోట రహస్యం తెలిసిన ముఖ్యమంత్రి నోరువిప్పకుండా ఎన్నాళ్లు మౌనంగా ఉంటారు?
• ముఖ్యంగా అవినాశ్ రెడ్డిపాత్రను సాక్షులు బయటపెట్టాక కూడా ముఖ్యమంత్రి ఎందుకునోరు విప్పడు?
• అసలు దోషులను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు తటపటాయిస్తోంది?
• ప్రత్యక్షసాక్షులు అవినాశ్ రెడ్డి ప్రమేయాన్ని ఎత్తిచూపాక కూడా ఎందుకు ఆలోచిస్తున్నారు
• లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకొని సీబీఐ తక్షణమే ఎంపీ అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవాలి
• లేకపోతే విచారణాధికారులు భయపడుతున్నారనే సంకేతాలు ప్రజల్లోకి వెళతాయి
• హత్యకు రూ.40కోట్ల సుపారీ ఇచ్చిన అంశంపై సీబీఐ, ఈడీలు రంగంలోకి దిగాలి
• వివేకానందరెడ్డి హత్యపై తప్పుడుకథనాలు వండివారుస్తున్న సాక్షి మీడియాను యాజమాన్యాన్ని కూడా సీబీఐ విచారించాలి
• వివేకాకు అక్రమసంబంధం ఉందని, ఆయన కూతురు, అల్లుడే ఆయన్నిచంపించారని నీతిమాలినరాతలు రాయడం వెనక ఉన్నవారెవరో తేల్చాలి
– తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ
అమరావతి: వివేకానంద హత్య కేసులో ముఖ్యమంత్రి జగన్ రెడ్డిని సిబిఐ ఎందుకు విచారించడం లేదని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి సయ్యద్ రఫీ ప్రశ్నించారు.
మంగళగిరిలోని తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వివేకా హత్యకేసులో ప్రమేయమున్నట్లు ఇప్పటికే చార్జిషీటులో పేర్కొన్న ఎంపీ అవినాశ్ రెడ్డిని వెంటనే అదుపులోకి తీసుకొని విచారిస్తే అసలు నిజాలు బయటకు వస్తాయని అన్నారు. కీలక పాత్రధారి, సూత్రధారులను సిబిఐ ఎందుకు అరెస్ట్ చేయడంలేదన్న సందేహాలు ఏపీ ప్రజలందరి మెదళ్లను తొలి చేస్తున్నాయని చెప్పారు. సయ్యద్ రఫీ విలేకరుల సమావేశం వివరాలు ఆయన మాటల్లోనే…
వివేకానందరెడ్డి హత్యకేసువిచారణలో సీబీఐకి వాంగ్మూలం ఇచ్చిన దస్తగిరి తనను ఉదయ్ కుమార్ రెడ్డి పిలిచి మాట్లాడాడని, 20ఎకరాల పొలం, కావాల్సినంత డబ్బుఇస్తామని ప్రలోభపెట్టారని కోర్టులో వాంగ్మూలమిచ్చారు. వై.ఎస్.ప్రతాపరెడ్డి, టైపిస్ట్ ఇనయతుల్లా, వాచ్ మెన్ రంగన్న ఇతరత్రా సాక్షులంతా వారి వాంగ్మూలాలను సీబీఐకి చెప్పడం జరిగింది. వివేకా హత్య జరిగినప్పుడు స్వయంగా రక్తపుమరకలు కడిగిన పనిమనిషి లక్ష్మీదేవికూడా తాను ఎవరి వత్తిడితో అలా చేసిందో సీబీఐ వారికి చెప్పింది.
ఘటనా స్థలానికి చేరాక సీఐ శంకరయ్య అక్కడ జరుగుతున్న తతంగాన్ని గమనించి, సాక్ష్యాలు రూపుమాప డానికి వీల్లేదని, అలా చేస్తే మీరుచిక్కుల్లో పడతారని చెప్పారు. ఆ తర్వాత వివేకా మృతదేహానికి కుట్లువేసిన ఆర్ఎంపీ వైద్యులు గజ్జల జయప్రకాశ్ రెడ్డి కూడా తానే శవానికి కుట్లు వేసినట్లు చెప్పాడు. శవాన్ని ఫ్రీజర్లో (ఐస్ బాక్స్) పెట్టి, ఎక్కడా రక్తపుమరకలు కనిపించకుండా చేయడంలో ఆర్ ఎంపీ వైద్యుడే కీలకపాత్ర పోషించారు.
వై.ఎస్.ప్రతాప్ రెడ్డి మనవడైన అభిషేక్ రెడ్డికూడా మొన్నటికి మొన్న సీబీఐ విచారణలోతాను ఘటనాస్థలానికి వెళ్లేటప్పటికీ అక్కడ కడప ఎంపీ అవినాశ్ రెడ్డి, అతని అనుచరలుఉన్నారని చెప్పాడు. ఈ విధంగా మొత్తం సీబీఐ విచారణలో 9మంది ప్రత్యక్షసాక్షులు వారివారి వాంగ్మూలాల్లో అవినాశ్ రెడ్డి పేరే ప్రధానంగా వెల్లడించారు. వివేకాహత్యకేసు విచారణ మొదలు పెట్టినప్పటి నుంచీ సీబీఐ 212 మందిని విచారించడం జరిగింది.
వారంతా ఏమేమిచెప్పారనేది సీబీఐకే తెలుసు. సాక్షులందరి కథనాలప్రకారం కడపఎంపీ అవినాశ్ రెడ్డి పాత్ర వివే కాహత్యలో ప్రధానంగా ఉందని రూఢీ అవుతున్నా సీబీఐ అధికా రులు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయడంలేదని టీడీపీ ప్రశ్నిస్తోంది.
అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐని ఎవరు అడ్డుకుంటున్నారు? సీబీఐ అధికారి రాంసింగ్ పై ఎవరి ప్రమేయంతో కేసులు పెట్టారు? సీబీఐ తీరుతో ప్రజలం తా రాజకీయనేతలు, పలుకుబడి కలిగినవారికి ఒకన్యాయం… సామాన్యులకు ఒకన్యాయమా అని రాష్ట్రప్రజలు వాపోతున్నారు. వివేకాహత్యోదంతంలో ఇప్పటివరకు సీబీఐ విచారించిన సాక్షులందరిదీ ఒక ఎత్తు అయితే ఆయన మరణాన్ని గుండెపోటుగా చిత్రీకరించిన సాక్షి మీడియా వ్యవహారశైలి మరోఎత్తు.
సాక్షిమీడియా ఆనాడు ఎందుకు అలా కథనాలు ప్రసారంచేసిందో తేల్చాలి. సాక్షి మీడియాకు చెందిన ఏ విలేకరి, ఏ సంపాదకుడి ప్రమేయంతో గుండెపోటుగా బ్రేకింగ్ న్యూస్ వేశారో సీబీఐ తేల్చాలి. సాక్షి మీడియా వివేకా హత్యోదంతానికి సంబంధించి ఇప్పటికీ సాక్షి అబద్ధాలు, అసత్యాలే ప్రచారంచేస్తోంది. సీబీఐ విచారణను, అధికారుల తీరుని తప్పుపడుతూ సీబీఐ చిలుకపలుకులు అని రాయడం అందులో భాగమే. వివేకా హత్య జరిగినప్పుడు సాక్షిపత్రికలో అతి జుగుప్సాకరంగా, అసహ్యకరంగా నాటిహత్యను చంద్రబాబుకి ఆపాదిస్తూ నారాసురరక్త చరిత్ర అనిరాశారు.
అదే సాక్షిలో ఇప్పుడు చనిపోయిన వ్యక్తిని హేళనచేస్తూ అతని వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ బాబాయ్ అమ్మాయిల పిచ్చోడు అని, రెండోపెళ్లి వ్యవహారమని రాస్తున్నారు. ఇలాంటి నీతిమాలిన రాతలు రాస్తూ ఎప్పటికప్పుడు పచ్చిఅబద్ధాలు బొంకే సాక్షిమీడియాను సీబీఐ విచారించకపోతే ఎలా? సాక్షిమీడియాను విచారించకుండా సీబీఐని అడ్డుకుంటున్న అదృశ్యశక్తి ఎవరు?
వివేకాహత్య వ్యవహారంలో రూ.40కోట్ల సుపారీ వ్యవహారాన్ని కూడా సీబీఐతేల్చాలి. అవసరమైతే ఈడీ (ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్ట రేట్) కూడా రంగంలోకి దిగి, రూ.40కోట్ల సుపారీ తతంగం తేల్చాలని టీడీపీతరుపున డిమాండ్ చేస్తున్నాం. వివేకా హత్య పులివెందుల రాజకోటలో జరిగింది. రాజకోట రహస్యం ఏమిటో తెలిసిన అప్ప టిప్రతిపక్షనేత, ఇప్పటి ముఖ్య మంత్రి జగన్మోహన్ రెడ్డి ఎందుకు నోరువిప్పదని ప్రశ్నిస్తున్నాం. సీబీఐ విచారణలో తనపార్టీ ఎంపీ పేరువచ్చాక కూడా అతన్ని అరెస్ట్ చేయాలని ముఖ్యమంత్రి ఎందుకు చెప్పలేకపోతున్నాడు?
ప్రత్యక్షసాక్షులందరూ ఇప్పుడు సీబీఐకి ఎవరిపేర్లయితే చెప్పారో, అవే పేర్లను తనతండ్రి హత్యకుగురైన సమయంలోనే వివేకా కుమార్తె సునీత సిబిఐకి ఇచ్చిన ఫిర్యాదులో కూడా పేర్కొన్నారు. వివేకాహత్య కేసులో తనకుటుంబసభ్యుల పేర్లు ఒక్కొక్కటిగా బయటకువస్తున్నా జగన్మోహన్ రెడ్డి ఎందుకు కిమ్మనడంలేదు? గతంలో జగన్మోహన్ రెడ్డి కోడికత్తి డ్రామాఆడి, బాగా రక్తికట్టించాడు. అధికారంలోకి రావడానికి దాన్ని ప్రచారాస్త్రంగా వాడుకున్నాడు. తీరా ముఖ్యమంత్రి అయ్యాక కోడికత్తి కేసు ఏమైందో… కత్తి విసిరినవాడు ఏమయ్యాడో రాష్ట్రప్రజలందరికీ తెలిసిందే.
వివేకా హత్యకేసులో అసలు దోషులను అరెస్ట్ చేయడానికి సీబీఐ ఎందుకు తటపటాయిస్తోంది? అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వెంటనే లోక్ సభ స్పీకర్ అనుమతి తీసుకోవాలని సీబీఐని కోరుతున్నాం. అతన్ని విచారిస్తేనే హత్యవెనుకగల కారణాలు, పెద్ద తలకాయల ప్రమేయం బట్టబయలవుతుంది. వివేకాహత్య తాలూకా వాస్తవాలు తుడిచేస్తే చెరిగిపోవనే వాస్తవాలను అవినాశ్ రెడ్డి, మనోహర్ రెడ్డి, భాస్కర్ రెడ్డి గ్రహించాలి. వివేకాహత్య అనేది ఇప్పటికే దేశమంతా దావానలంలా వ్యాపించిందనే వాస్తవాన్ని గ్రహించి స్వచ్చందంగా వారు సీబీఐకి లొంగిపోతే మంచిదని సూచిస్తున్నాం.
హత్యకేసు విచారణలో కీలకంగా వ్యవహరిస్తున్న సీబీఐకి అవినాశ్ రెడ్డిని అదుపులోకి తీసుకోవడమనేది చాలా కీలకమైన అంశం.. హత్యచేయడం ఒకనేరమైతే, సాక్ష్యాలను రూపుమాపాలనిచూడటం ఇంకా పెద్దనేరం. ఇలా ఒక నేరాన్ని కప్పిపుచ్చడానికి మరికొన్ని నేరాలు చేసుకుంటూ వెళ్లారు. వివేకా కేసులో హంతకులు పులివెందులలో సిబిఐ అధికారులను బెదిరిస్తున్నందున ఈ కేసును పొరుగు రాష్ట్రానికి తరలించి విచారించాల్సిందిగా విజ్జప్తి చేస్తున్నాం. చనిపోయిన వ్యక్తి అనే గౌరవంకూడా లేకుండా వివేకా వ్యక్తిత్వాన్ని హననంచేసేలా సాక్షిలో తప్పుడురాతలు రాయించిన వైనంపైకూడా సీబీఐ దృష్టిపెట్టాలి.
హత్యచేసిన వారు..చేయించినవారికి వత్తాసుపలుకుతూ సాక్షి కథనాలు రాయడం సిగ్గుచేటు. అలాంటి సాక్షి ప్రతినిధుల్నికూడా విచారిస్తేనే మరిన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని సయ్యద్ రఫీ పేర్కొన్నారు.