– ఏడాది కాలం లో 620 మంది రైతుల ఆత్మహత్యలు
– గురుకులాల్లో 50 మంది పిల్లలు చనిపోయినా పట్టించుకోవడం లేదు
– విద్యార్థులకు ఈ చలి కాలం లో కనీసం రగ్గులు కూడా ఇవ్వడం లేదు
– సీఎం పర్యటన పెద్ద పల్లి కి చీకటి అడుగు
– మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ,మాజీ ఎమ్మెల్యేలు దాసరి మనోహర్ రెడ్డి ,పుట్టా మధు ,గ్రంధాలయ సంస్థ మాజీ చైర్మన్ రఘు వీర్ సింగ్
హైదరాబాద్: తెలంగాణ లో మళ్ళీ సమైక్య రాష్ట్రం లో ఉన్న పరిస్థితులు పునరావృతం అవుతున్నాయి. రైతుల ఆత్మహత్యలు మళ్ళీ పెరుగుతున్నాయి. .ప్రభుత్వం విధానాల ఫలితంగా గత ఏడాది కాలం లో 620 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కేసీఆర్ హయం లో రైతు ఏ కారణం తో చనిపోయినా ఐదు లక్షల బీమా మొత్తం వచ్చేది. రైతు రుణమాఫీ సరిగా జరగలేదు ..రైతు భరోసా లేదు ..ఇరిగేషన్ సదుపాయాలు రాష్ట్రం లో కుంటుపడ్డాయి.
రైతుకు హామీలు ఎన్నో ఇచ్చారు .ఒక్కటీ అమలు చేయలేదు. ఆత్మహత్యలు పెరుగుతున్నా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు లేదు ఎందు కోసం సంబరాలు చేస్తున్నారు ? రైతు భరోసా ఇవ్వబోమని ప్రభుత్వం మంత్రులు రైతులను మానసికంగా సిద్ధం చేస్తున్నారు. బోనస్ యే బాగుంది రైతు భరోసా కన్నా అని మంత్రే ప్రకటనయిచ్చారు.
సన్న వడ్లు ఐదు లక్షల క్వింటాల్ లకు మాత్రమే 25 కోట్ల రూపాయలు బోనస్ మాత్రమే ఇచ్చారు. రైతు భరోసా కు 15 వేల కోట్లు కావాలి ..వాటిని ఎగ్గొట్టే ప్రయత్నం చేస్తున్నారు. కొంతమందికి బోనస్ ఇచ్చి చేతులు దులుపుకుంటున్నారు. పెద్దపల్లి లో లక్షా 55 వేల మంది రైతులు ఉన్నారు. ఇందులో 95 వేల మంది రైతులకు రుణమాఫీ కాలేదు. రేపు పెద్దపల్లి కి సీఎం రేవంత్ వస్తున్నారు ..మిగతా రైతులకు రుణమాఫీ ఎందుకు ఎగ్గొట్టారో సీఎం సమాధానం చెప్పాలి.
రైతు వ్యతిరేక ప్రభుత్వం ఇది. రైతు పండగ చేసుకోవడం చూసి రైతులు నవ్వుకుంటున్నారు. ఏ వర్గం కూడా రేవంత్ పాలనతో సంతృప్తిగా లేదు. ప్రతి ఒక్కరినీ ఈ ఏడాది లో మోసం చేస్తున్నారు. కోట్లాది రూపాయల ప్రజా ధనాన్ని సంబరాల పేరు తో వృధా చేస్తున్నారు. గురుకులాల్లో అద్వాన్నపు పరిస్థితులపై ప్రజలు చర్చించు కుంటున్నారు.
కేసీఆర్ హాయం లో ఒక్కో గురుకుల విద్యార్ధి పై లక్షా 20 వేల రూపాయలు ఖర్చు చేశారు. గురుకులాలను రేవంత్ ప్రభుత్వం నిర్వీర్యం చేసింది. గురుకులాల్లో 50 మంది పిల్లలు చనిపోయినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. విద్యార్థులు రోడ్ల పైకి వస్తున్నారు. ఓవరీసిస్ స్కాలర్ షిప్ లపై పట్టింపు లేదు. మానవత్వం మరచిపోయి మంత్రులు మాట్లాడుతున్నారు.
తొమ్మిదిన్నరేళ్ళ కేసీఆర్ పాలనలో గురుకులాల్లో ఇలాంటి అద్వాన్నపు పరిస్థితులు ఎందుకు లేవు ?విద్యార్థులు రోడ్ల పైకి ఎందుకు రాలేదు ? ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ పై అనవసరంగా నిందలు వేస్తున్నారు. పేద పిల్లల భవిష్యత్ ను రేవంత్ ప్రభుత్వం సర్వ నాశనం చేస్తోంది. ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ గురుకులాల పై ఒక్క సమీక్ష కూడా చేయలేదు.
గురుకులాల పరిస్థితిని తెలుసుకునేందుకు మా విద్యార్ధి విభాగం నేతలు వెళ్తుంటే ఎందుకు అడ్డుకుంటున్నారు ? విద్యార్థులకు ఈ చలి కాలం లో కనీసం రగ్గులు కూడా ఇవ్వడం లేదు. ప్రభుత్వ నిర్బంధకాండ ను తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇది మాటల ప్రభుత్వం తప్ప చేతల ప్రభుత్వం కాదు. ఇకనైనా ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి.
ఈ ప్రభుత్వం లో సమ న్యాయం లేదు: మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి …
కాంగ్రెస్ పార్టీ రకరకాల హామీలు ఇచ్చి వాటిని అమలు చేయక ప్రజలను మోసం చేసింది. ఏది మాట్లాడినా కాంగ్రెస్ నేతలు చిలువలు పలువలు చేసి మాట్లాడుతున్నారు. రాజకీయ అవసరాల కోసం కాంగ్రెస్ నేతలు ప్రజలను ఇంకా భ్రమల్లో ఉంచుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు పెద్ద పల్లి వస్తున్నారు. ఈ ప్రభుత్వం లో సమ న్యాయం ,సమ ధర్మం లేదు. కాంగ్రెస్ కార్యకర్తలకే న్యాయం జరుగుతోంది. పోలీసులు కాంగ్రెస్ నేతలు చెబితేనే fir లు పెడుతున్న దుస్థితి ఉంది.పెద్ద పల్లి జిల్లాకు ఇచ్చిన హామీల అమలుకు సీఎం రేవంత్ రెడ్డి కార్యాచరణ ప్రకటించాలి.
ప్రజలు సంతోషంగా లేనపుడు సంబరాలు ఎందుకు ?: మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు
రాష్ట్రం లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటితో ఏడాది పూర్తవుతుంది. రేపు యువ వికాసం కార్యక్రమం లో పాల్గొనేందుకు సీఎం రేవంత్ రెడ్డి పెద్దపల్లి వస్తున్నారు. అసలు యువవికాసం కింద ఏ హామీలు ఇచ్చారో కాంగ్రెస్ పెద్దలకు గుర్తుందా ? యువకులకు ఏం చేయకుండానే యువ వికాసం సంబరాలా ? సీఎం పర్యటన నేపథ్యం లో స్థానిక పోలీసులు నిర్బంధం అమలు చేస్తున్నారు.
సింగరేణి ని అస్తవ్యస్తం చేశారు. మంథని లో మేము కూడా స్థానిక ఎమ్మెల్యే పై చార్జీ షీట్ వేస్తాం. సీఎం పర్యటనను రైతులు యువకులు అడ్డుకోవాలి. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు సీఎం ను నిలదీయాలి. సీఎం పర్యటన పెద్ద పల్లి కి చీకటి అడుగు.