• సంకల్పసిద్ధి స్కాం కుట్ర తేల్చకుండా ఎమ్మెల్యే వంశీ డ్రామాలేమిటి?
• సంకల్పసిద్ధి స్కామ్ లో తనపాత్ర, ప్రమేయం లేకుంటే తన అనుచరుల్ని పోలీసులకు అప్పగించి, వారి ఫోన్ కాల్ డేటా బహిర్గతం చేయమని వంశీ ఎందుకు అడగటంలేదు?
• సంకల్పసిద్ధి స్కామ్ లో తనపాత్ర లేదంటున్న ‘జంపింగ్ జపాంగ్’ వంశీకి ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా తక్షణమే తనఇద్దరు అనుచరులు రంగా, నానిలను పోలీసులకు సరెండర్ చేయాలి
• కేసు విచారణలో దొరికిన 10 మొబైల్ ఫోన్ల కాల్ డేటాను, ఓలుపల్లి రంగా, గుర్రంనానిల ఫోన్ కాల్ డేటా తో సరిపోల్చాలని పోలీసుల్ని కోరుతున్నాం
• విజయవాడ బందర్ రోడ్ లోని ప్రముఖ స్టార్ హోటల్లో నవంబర్ 10-14మధ్య సంకల్పసిద్ధి యాజమాన్యం, వంశీ అనుచరులు, ఇతరముఖ్యుల మధ్య జరిగాయంటున్న చర్చల వివరాలు పోలీసులకు తెలుసా? తెలిస్తే హోటల్ యొక్క సీసీపుటేజ్ ను పోలీసులు పరిశీలించారా?
– టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్
సంకల్పసిద్ధి స్కామ్ లో ప్రమేయమున్న గన్నవరం వైసీపీఎమ్మెల్యే ఆయనపార్టీ ఫిరాయింపులు, గోడలుదూకే ప్రావీణ్యాన్ని గుర్తించి రాష్ట్రంలో అందరూ ముద్దుగా ‘జంపింగ్ జపాంగ్’ అని పిలుచుకునే వల్లభనేని వంశీ రూ.1100కోట్ల కుంభకోణం బయటపెట్టారన్న అక్కసుతో తమపైనా, మీడియాస సంస్థలపైనా చిందులు తొక్కుతున్నాడని, ఆ క్రమంలోనే నిన్నడీజీపీకి తమపై ఫిర్యాదుచేశాక, డ్రామాలు ఆడాడని టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఎద్దేవా చేశారు.
మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడిన వివరాలు ఆయనమాటల్లోనే … “రాష్ట్రంలోనే సంచలనంగా మారిన సంకల్పసిద్ధి స్కామ్ కు సంబంధించిన వాస్తవాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తుండటంతో వైసీపీఎమ్మెల్యే వల్లభనేనివంశీ వెన్నులో వణుకు మొదలైంది. ఈ కుంభకోణంలో వైసీపీకిచెందిన ఇద్దరు ప్రజాప్రతినిధులు వారి అనుచరుల సహాయసహాకారాలతో వందలకోట్లు కొల్లగొట్టారని ఇప్పటికే రాష్ట్రప్రజానీకంతో పాటు మీడియా కోడైకూస్తోంది.
దుకాణాల నిర్వహణ, ఎర్రచందనంమొక్కల పెంపకం, రియల్ ఎస్టేట్ వ్యాపారాల పేరుతో పేదలబలహీనతను సొమ్ముచేసుకొని, రూ.1100కోట్లు కొల్లగొట్టారని రూఢీఅవుతోంది. రూ.లక్షచెల్లిస్తే, 300రోజుల్లో రూ.3లక్షలని, రూ.2.10లక్షలతో ఎర్రచందనం మొక్కలుకొంటే, 14ఏళ్లతర్వాత రూ.1కోటి75లక్షలు చెల్లిస్తామంటూ ఆచరణసాధ్యంకాని మాటలతో ప్రజల్ని వంచించారు.
టీడీపీ నేతలపై తప్పుడు ఫిర్యాదులు చేసినంత మాత్రాన వంశీ సఛ్చీలుడు కాలేడు
సంకల్పసిద్ధి సంస్థ మోసానికి బలైనవారి నుంచి సేకరించిన సమాచారమేగాక, మీడియా నుంచి సేకరించిన వార్తలతో తానుఇదివరకే సంకల్పసిద్ధిసంస్థ మోసాలు.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ, కొడాలినానీల ప్రమేయం, వారిఅనుచరుల పాత్రను ప్రజలముందుంచాను. వంశీ ఫిర్యాదు చేయాల్సింది తనపైనో, మాపార్టీనేత బచ్చులఅర్జునుడిపై కాదు. వంశీ చేయాల్సిన మొట్టమొదటి పని తన అనుచరుడు, సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులకు అన్ని రకాలుగా అండదండలు అందించిన ఓలుపల్లిరంగా, అల్లాపురం గ్రామానికి చెందిన గుర్రం నానిలను పోలీసులకు సరెండర్ చేయాలి.
అది చేయకుండా డీజీపీ వద్దకువెళ్లి, నాపై (పట్టాభిపై) కేసుపెట్టాలి… టీడీపీనేతల్ని విచారించాలని, వారిపై పరువునష్టం దావావేస్తానని నక్కవినయాలు ప్రదర్శించినంతమాత్రాన వంశీ ఎప్పటికీ నిర్దోషికాలేడు. సంకల్పసిద్ధి స్కామ్ కు సంబంధించి తనపాత్ర ఏమీలేదని నిరూపించుకోవాలనుకుంటే, కేసు విచారణాధికారైన విజయవాడ పోలీస్ కమిషనర్ ని కలవకుండా, డీజీపీ ఆఫీస్ గేటు వద్ద వంశీ డ్రామాలు ఆడటమేంటి? వంశీ పెట్టే తప్పుడు కేసులను న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో తమకు బాగాతెలుసు. వంశీ తాటాకు చప్పుళ్లకు భయపడేదిలేదు.
వంశీకి తన అనుచరుల్ని పోలీసులకు సరెండర్ చేయడానికి భయమెందుకు?
సంకల్పసిద్ధి సంస్థ సీఎండీగా ఉన్న గుత్తా వేణుగోపాలకృష్ణ వెనుక ఓలుపల్లిరంగా, గుర్రం నానిలే ఉన్నారని, వారిద్దరూ వంశీ ప్రధానఅనుచరులని గన్నవరం ప్రజలే చెబుతున్నారు. నిజంగా స్కామ్ లో తనప్రమేయం, తన అనుచరులప్రమేయం లేనప్పుడు, వంశీ వారిని ఎందుకు పోలీసుల ముందుంచలేదు? తనఫోన్ రికార్డ్స్ తో పాటు, వారి ఫోన్ రికార్డుల వివరాలను పోలీసులు పరిశీలించుకోవచ్చని ఎందుకు చెప్పలేకపోతున్నాడు? అవేవీ చేయ కుండా డీజీపీకి ఫిర్యాదుచేసినంత మాత్రాన నిజం బయటపెట్టకుండా టీడీపీనేతలు వెనక్కు తగ్గుతారనుకోవడం వంశీ మూర్ఖత్వమే. తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మాట్లాడేవారంతా వంశీకి పకోడిగాళ్లు, పులిహోరగాళ్లలా కనిపిస్తే, స్కామ్ లు చేయడంకోసం పనిగట్టుకొనిమరీ మా పార్టీనుంచి తాడేపల్లి కొంపలోకి గోడదూకి, పార్టీ ఫిరాయించిన వంశీని ‘జంపింగ్ జపాంగే’ అనాలి. వంశీ గురించి ఇలాచాలా మాట్లాడగలం.. అతనికి దమ్ముంటే తాములేవనెత్తిన అంశాలకు సమాధానం చెప్పాలి.
అదుపులోకి తీసుకున్న వారి ఫోన్ కాల్ డేటాను తక్షణమే బయటపెట్టాలి
సంకల్పసిద్ధి స్కామ్ కు సంబంధించి 5గురిని అరెస్ట్ చేశామని, గుత్తా వేణుగోపాలకృష్ణ, గుత్తా కిషోర్, మావూరి వెంకటనాగలక్ష్మీ, జాకీర్ హుస్సేన్ లను అదుపులోకి తీసుకొని, వారినుంచి 10మొబైల్ ఫోన్లు, 4 ల్యాప్ ట్యాప్ ల తోపాటు బంగారం, వెండి సీజ్ చేశామని విజయవాడ పోలీస్ కమిషనర్ (సీపీ) క్రాంతిరాణా టాటా చెప్పారు. గుత్తా వేణుగోపాలకృష్ణ, ఇతరులకు సంబంధించి 14రకాల ఆస్తులను గుర్తించామని కూడా సీపీ చెప్పారు. ఆ ఆస్తులేమిటో, వాటి వివరాలేమిటో, సదరుఆస్తుల అసలుహక్కుదారులెవరో, బినామీలెవరో, అవి ఎక్కడున్నాయో కూడా పోలీసులు బయటపెట్టాలని డిమాండ్ చేస్తున్నాం.
10 మొబైల్ ఫోన్లు సీజ్ చేసిన పోలీసులకు వాటియొక్క కాల్ రికార్డ్స్ పరిశీలించడానికి ఎంతసమయం పడుతుంది? కాల్ రికార్డ్స్ డేటా బయటకువస్తే, సంకల్పసిద్ధి స్కామ్ లో అసలుదొంగలెవరో తేలుతుంది కదా! ప్రతిపక్షనేతల ఫోన్లు చెక్ చేయడానికి ఎక్కడలేని ఉత్సుకతచూపే పోలీసులు, రూ.1100కోట్ల స్కామ్ లో సూత్రధారులైనవారి ఫోన్లలోని సమాచారాన్ని ఎందుకు బహిర్గత పరచరు? పదిమొబైల్ ఫోన్లలోని కాల్ రికార్డ్స్ వివరాలను తక్షణమే పబ్లిక్ డొమైన్ లో పెట్టాలని టీడీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. ప్రాథమిక విచారణలోనే సంకల్పసిద్ధి సంస్థ నిర్వాహకులు ప్రజలనుంచి రూ.170కోట్లు వసూలుచేశారని కూడా సీపీ చెప్పారు. ప్రాథమిక విచారణలోనే రూ.170కోట్లుతేలితే, అసలువిచారణలో రూ.1100కోట్లు ఉండటంలో ఆశ్చర్యం లేదని గట్టిగా చెప్పగలం.
సంకల్పసిద్ధి సంస్థ బాధితులు సీఐడీ విచారణ కోరారని విజయవాడ సీపీయే స్వయంగా మీడియాతో చెప్పారు. అలాంటప్పుడు విచారణచేపట్టకుండా సీఐడీ ఎందుకు మౌనముద్రదాల్చిందో సీఐడీ బాస్ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి. సంకల్పసిద్ధి సంస్థ స్కామ్ బాధితులు పోలీస్ విచారణకంటే ముందే సీఐడీ విచారణకోరారని కూడా తెలుస్తోంది. క్రాంతిరాణా ని విలేకరులు దానిగురించి ప్రశ్నిస్తే, కొందరు సీఐడికి ఫిర్యాదుచేశారని తమవిచారణలో తెలిసిందని, సీఐడీవిచారణ ఎంతవరకు వచ్చిందో తనకు తెలియదని చెప్పారు. సంకల్పసిద్ధి స్కామ్ లో సీఐడీ పాత్రేమిటో కూడా తేలాలి. విజయవాడ పోలీస్ కమిషనర్ సీఐడీవిచారణపై ఎందుకు విలేకరుల ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా దాట వేశారు? సంకల్ప సిద్ధి స్కామ్ లో సీఐడీ పాత్రపై ఆ విభాగం చీఫ్ సునీల్ కుమార్ సమాధానం చెప్పాలి.
నవంబర్ 10నుంచి14మధ్య విజయవాడ బందర్ రోడ్ లోని ప్రముఖ స్టార్ హోటల్లో సంకల్పసిద్ధి స్కామ్ లో ప్రధానపాత్రధారులుగా చెప్పబడుతున్న ఓలుపల్లి రంగా, గుత్తా వేణుగోపాల కృష్ణ, మరికొందరు ముఖ్యుల మధ్య చర్చలుజరిగాయి. సదరు సమావేశానికి సంబంధించిన వివరాలను పోలీసులు సేకరించారా? హోటల్ లోని సీసీకెమెరా దృశ్యాలు పరిశీలించారా? సీసీ పుటేజ్ పరిశీలించి, సదరుసమావేశంలో పాల్గొన్న ముఖ్యుల్లో సీఐడీ అధికారులు కూడా ఉన్నారా అన్నవిషయాలు బహిర్గతపరచాలి. ఈ వాస్తవాలన్నీ బయటకొస్తే, డీజీపీ ఆఫీసు వద్ద డ్రామాలాడిన వంశీ, అతని అనుచరులకు సంకల్పసిద్ధి నిర్వాహకులకు ఉన్న అక్రమ సంబంధం బహిర్గతమవుతుంది.
స్కామ్ ని విచారిస్తున్న విజయవాడ సీపీనికాదని, వంశీ డీజీపీని కలవడమేంటి?
ఓలుపల్లి రంగా, గుర్రంనాని మొబైల్ ఫోన్లను కూడా సీజ్ చేసి, వాటిలోని కాల్ రికార్డ్స్ ను కూడా బయటపెట్టాలి. తక్షణమే పోలీసులు కాల్ రికార్డ్స్ బయటపెట్టాలని జంపింగ్ జపాంగ్ వంశీ కూడా డిమాండ్ చేయాలి. చిత్తశుద్ధితో చేయాల్సిన పనులుచేయకుండా, కేసు విచారి స్తున్న విజయవాడ సీపీ క్రాంతిరాణాను కలవకుండా వంశీ డీజీపీదగ్గరకు ఎందుకెళ్లాడు? డీజీపీ ఆఫీసు గేటుదగ్గర వంశీ ఎన్నిడ్రామాలాడినా స్కామ్ నుంచి తప్పించుకోలేడు.
తాను లేవనెత్తిన అంశాలపై వంశీ ఏంసమాధానం చెబుతాడు? సంకల్పసిద్ధి స్కామ్ లో పోలీసులు ఎవరి ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలించారు? ఓలుపల్లి రంగా, గుర్రంనానిల ఫోన్ కాల్ రికార్డ్స్ పరిశీలించారా? పోలీసులకు దొరికిన ఫోన్లలోని కాల్ రికార్డ్స్ తో, వంశీ బినామీలైన రంగా, నానీల ఫోన్ రికార్డ్స్ ఏమైనా మ్యాచ్అయ్యాయా అనేవివరాలపై డీజీపీ సమాధానం చెప్పాలి. ఓలుపల్లిరంగా, గుర్రంనానిల ఫోన్ కాల్ రికార్డ్స్ బయటపెడితే, అసలు వాస్తవాలు వాటంతటవే బయటకొస్తాయి. అదేవిధంగా విజయవాడసీపీ చెప్పిన 14రకాల ఆస్తుల వివరాలుకూడా ఆరాతీసి, వాటిసమాచారం బయటపెట్టాలి.
జంపింగ్ జపాంగ్ కు ఏమాత్రం నీతి, నిజాయితీ ఉన్నా తక్షణమే తనఇద్దరు అనుచరులు రంగా, నానిలను పోలీసులకు సరెండర్ చేయాలి. అదిచేయకుండా డ్రామాలాడినంత మాత్రాన వంశీ నిప్పులాంటినిజాన్ని దాచలేరు. వంశీ హైకోర్ట్ కి వెళ్లి, తన నియోజకవర్గంలో జరిగిన సంకల్పసిద్ధి స్కామ్ పై సీబీఐ విచారణ కోరడమేకాక, ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దర్యాప్తును కోరి తనచిత్తశుద్ధిని నిరూపించుకోవాలి” అని పట్టాభి సవాల్ చేశారు.