– సిరిపురంలోని సీబీసీఎన్సీ స్థలానికి ఎసరు పెట్టిన వైసీపీ నేతలు
– తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య
జగన్ రెడ్డి పరిపాలనలో ఏ ఒక్కరి ఆస్తులకూ భద్రత లేకుండా పోయింది. ఎప్పుడు ఎవరు వచ్చి ఈ స్థలం నాది, నాకు ఇవ్వకపోతే చంపేస్తా అంటూ బెదిరిస్తారో తెలియని పరిస్థితులు రాష్ట్రంలో నెలకొన్నాయి. తాజాగా విశాఖపట్నం, సిరిపురంలోని సీబీసీఎన్సీ స్థలాన్ని అధికార పార్టీ పెద్దలు కొట్టేయబోతున్నట్లు సమాచారం తెలుస్తోంది. మాయమాటలు చెప్పి దళితుల ఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చిన మీరు నేడు వారి ప్రార్థనా స్థలాలకు చెందిన స్థలాలనే మీ పార్టీ నేతలు కొట్టేస్తుంటే చోద్యం చూస్తూ కూర్చుంటారా?
యథా రాజా….తదా ప్రజా అన్న చందంగా వైసీపీ నేతల తీరు కనబడుతోంది. సీఎం దగ్గర్నుండి కార్యకర్త వరకు భూకబ్జాలు, దోపిడీలు, బెదిరించి లాక్కోవడం వంటి చర్యలకు దిగుతున్నారు. జగన్ రెడ్డి మీకు క్రైస్తవుల పట్ల మీకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా తక్షణమే సిరిపురం సీబీసీఎన్సీ ఆస్తులపై కన్నేసిన మీ నేతలను తక్షణమే కట్టడి చేయాలి. ఇప్పటికైనా రాష్ట్రంలోని క్రైస్తవ ఆస్తుల పరిరక్షణకు ఒక కమిటీ వేసి వాటిని కాపాడాలని డిమాండ్ చేస్తున్నాం.