బీసీల హత్యతో ఎదిగిన జగన్ రెడ్డి కుటుంబం బీసీలను ఉద్ధరిస్తుందా?

– బీసీలసభకు పేరుపెట్టడానికి జగన్ రెడ్డికి టీడీపీ నినాదం ‘జయహో బీసీ’నే దిక్కయింది.
• బీసీరిజర్వేషన్లు ఎత్తేసి 16,800 మందికి రాజ్యాధికారం దూరం చేయడం వారిని ఉద్దరించడమా? బీసీల సబ్ ప్లాన్ నిధులు రూ.34 వేలకోట్లు దిగమింగడం బీసీలకు న్యాయంచేయడమా?
• జగన్ రెడ్డికి బీసీలపై కక్ష, ఈర్ష్యాద్వేషాలు ఉండబట్టే, బీసీలకోసం టీడీపీతెచ్చిన పథకాలన్ని రద్దుచేసి, ప్రభుత్వ నామినేటెడ్ పదవుల్లో బలహీనవర్గాలకు మొండి చెయ్యి చూపించాడు
• జగన్ పాలనలో 26మంది బీసీనేతల్ని అత్యంత కిరాతకంగా హత్యచేశారు, 650 మందిపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడ్డారు. 2500 మందిని తప్పుడు కేసులతో వేధించారు
– టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యులు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర

బీసీలపై ఎనలేని ప్రేమాభిమానాలున్నట్టు, వారిని నమ్మించే ప్రయత్నంచేస్తున్న జగన్ రెడ్డికి, ఆయన ప్రభుత్వానికి బీసీల సభకు పేరేదొరక్కపోవడం సిగ్గుచేటని, టీడీపీ ప్రపంచ వ్యాప్తంగా ఎలుగెత్తిచాటిన ‘జయహో బీసీ’ నినాదామే అధికారపార్టీకి దిక్కయిందని, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, మాజీమంత్రి కొల్లు రవీంద్ర ఎద్దేవా చేశారు.

మంగళగిరిలోని పార్టీ జాతీయ కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడిన వివరాలు, ఆయన మాటల్లోనే ..“రాష్ట్రంలోని బీసీలంతా జగన్ పాలనలో మాకు ఇదేం ఖర్మరా అని బోరుమంటున్నారు. బీసీల కోసం సభలు పెడుతున్న ప్రభుత్వం.. బీసీలకు చేసిందేమీ లేక, చెప్పుకోవడానికీ ఏమీ లేక చివరికి తెలుగుదేశం పార్టీ బీసీ నినాదమైన ‘జయహోబీసీ’తోనే సభ పెడుతుండడం సిగ్గుచేటు. బీసీలను సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా ప్రోత్సహిం చింది, అండగా నిలిచిందీ తెలుగుదేశంపార్టీ, చంద్రబాబు నాయుడే. జగన్ రెడ్డి మూడున్న రేళ్లలో బీసీలకు ఏంచేశారో చెప్పే ధైర్యం లేదు. రూ.34వేలకోట్ల బీసీ సబ్ ప్లాన్ నిధుల్ని దారి మళ్లించి బీసీలను నయవంచన చేశారు. బీసీలకు చెందిన 8వేల ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నందుకు సభపెడుతోందా? 26మంది బీసీలను అతికిరాతకంగా చంపినందుకా, 650మంది బీసీలపై దాడులు, దౌర్జన్యాలకు పాల్పడినందుకా, 2500 మందిపై తప్పుడు కేసులు పెట్టి వారినివేధించినందుకా బీసీ సభ పెడుతున్నారా?

జగన్ రెడ్డి కుటుంబం ఎదిగిందే బీసీల శవాలపై….
బీసీల శవాలగుట్టలపై జగన్ రెడ్డి కుటుంబప్రస్థానం మొదలైందన్న విషయం ప్రజలందరికీ తెలుసు. జింకా వెంకటనరసయ్య అనే బీసీ వర్గానికి చెందిన వ్యక్తిని జగన్ రెడ్డి తాత రాజారెడ్డి హత్యచేసి, అతని బైరైటీస్ గనుల్ని దురాక్రమణ చేసుకునన్నాడు. ఇప్పుడు జగన్ రెడ్డి.. బీసీలఆస్తుల్ని లాక్కుంటూ, వారిని హతమారుస్తూ, వారి సమాధులపై నడుస్తూ, తనఅవినీతి సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ, వారినే ఉద్ధరించానన్నట్లు కటింగ్ ఇస్తున్నాడు. ఇది బీసీలను ఉద్దరించడమా… అణచివేయడమా?
బీసీలను మంత్రుల్ని చేశానంటున్న జగన్ రెడ్డీ… ఎంత మంది బీసీ మంత్రులు స్వతంత్రంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఇచ్చాడో చెప్పగలడా?

బీసీలను మంత్రులుగా నియమించి.. వారి వెనుక రెడ్లనుషాడోలుగా నియమించడం వాస్తవంకాదా? రాష్ట్రం మొత్తాన్ని ఐదు భాగాలుచేసి.. విజయసాయిరెడ్డి, వై.వీ.సుబ్బారెడ్డి, సజ్జలరామకృష్ణారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆళ్ల రామకృష్ణారెడ్డిలకు పంచిపెట్టడం నిజంకాదా? ఇదేనా బీసీలను ఉద్దరించడమంటే. ఏ శాఖగురించి మాట్లాడాలన్నా, సదరు మంత్రి కాకుండా, పోలోమంటూ సకలశాఖామంత్రి సజ్జలే బయటకిరావడం, ఆయా మంత్రుల్ని డమ్మీలను చేయడంకాదా? రాష్ట్రాన్ని ఏలుతున్నది రెడ్లయితే, వారిలో కడపరెడ్లది అగ్రస్థానం. ముఖ్యమంత్రి, సజ్జల, డీజీపీ, సీఎస్ అందరూ కడప రెడ్లే అన్నది నిజంకాదా? ఇదేనా బీసీలకు ప్రాధాన్యమి వ్వడమంటే?

జగన్ రెడ్డికి సలహాలివ్వడానికి కూడా బీసీలు పనికిరారా?
జగన్ రెడ్డి బీసీలగురించి ఎంతగొప్పగా ఆలోచిస్తున్నాడో చెప్పడానికి ఆయన చేస్తున్న పనులు, ఆలోచనలే నిదర్శనం. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వడానికి కూడా బీసీలు పనికి రారనే దురభిప్రాయం జగన్ కు ఉండబట్టే, ఒక్కసలహాదారు పదవికూడా బీసీలకు ఇవ్వలేదు. సలహాదారులగానే కాదు, యూనివర్శిటీ వీసీల నియామకాల్లో కూడా అగ్రతాంబూలం రెడ్లదే. టీటీడీ ఛైర్మన్, ఏపీఎస్ ఆర్టీసీ ఛైర్మన్, ఏపీఐఐసీ ఛైర్మన్ లాంటి పదవుల నిర్వహణలో కూడా బీసీలను అణగదొక్కారు. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన 56 కార్పొరేషన్లు పేరుకేతప్ప, బీసీలకు ఉపయోగపడేవికావు. 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన జగన్ రెడ్డి.. ఎంత బడ్జెట్ కేటాయించారో, ఎంత ఖర్చు చేశారో చెప్పే ధైర్యం ఉందా?

ఆదరణ సహా, బీసీపథకాలన్నింటికీ మంగళంపాడిన ఘనుడు జగన్ రెడ్డే
బీసీల సంక్షేమం కోసం టీడీపీ ప్రభుత్వం భారీ స్థాయిలో అమలు చేసిన ఆదరణ, స్కిల్ డెబలప్ మెంట్, బెస్ట్ అవైలబుల్ స్కూల్స్, కార్పొరేషన్ల రుణాలు వంటి పథకాలన్నింటినీ జగన్ రెడ్డి నిలిపేయడమే బీసీ సంక్షేమమా? బీసీల కోసం ప్రత్యేకంగా ఇంత ఖర్చు చేశామని చెప్పే సాహసం చేయగలరా? చంద్రబాబు నాయుడు బీసీలకు అమలుచేసిన అన్ని పథకాలకు జగన్ రెడ్డి అధికారంలోకి రాగానే మంగళంపాడేశాడు.
వైసీపీలోని బీసీ నేతలకు పౌరుషం, బీసీలంటే ప్రేమ ఉంటే.. బీసీలకు రద్దు చేసిన ఆదరణ, బీసీ విదేశీవిద్య, స్కిల్ డెవలప్ మెంట్, స్టడీ సర్కిల్స్, పెళ్లి కానుకలు, కార్పొరేషన్ల ద్వారా రుణాలు వంటి పథకాల గురించి జగన్ రెడ్డిని ప్రశ్నించండి. నిలదీయండి. టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్య పథకంలో భాగంగా ఇతర దేశాలకు వెళ్లిన బీసీ విద్యార్థులు అక్కడ నానాఅవస్థలు పడుతుంటే, జగన్ రెడ్డి వారిగురించి పట్టించుకున్న పాపానపోలేదు. విద్యార్థులగురించి ఆలోచించకపోగా, విచారణ పేరుతో వారిఇళ్లకు పోలీసుల్నిపంపి తల్లిదండ్రుల్ని, కుటుంబసభ్యుల్ని ఎంతలా భయభ్రాంతులకు గురిచేశాడో చెప్పాల్సిన పనిలేదు.

ఈ దారుణాలేవీ తనకు తెలియనట్టు ముఖ్యమంత్రి నటిస్తుంటే, బీసీ మంత్రులు తమ పదవుల కోసం ఆయన ముందు మోకరి ల్లుతున్నారు. చంద్రబాబునాయుడు బీసీలకు ఇచ్చిన పెళ్లికానుక కూడా జగన్ రెడ్డి నిలిపేశాడు. టీడీపీప్రభుత్వం ఏర్పాటు చేసిన బీసీభవన్లు, కమ్యూనిటీహాళ్లను కూడా వారికి కేటాయించడానికి జగన్ ప్రభుత్వానికి మనసు రావడంలేదు. ఆ భవనాలన్నీ నిరుపయోగంగామారి, అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాలుగా మారినా జగన్ రెడ్డి చోద్యం చూడడం తప్ప చేసిందేమీ లేదు.
వైసీపీ ప్రభుత్వం వేసిన కార్పొరేషన్ల ఛైర్మన్, డైరెక్టర్ల పదవీకాలం కూడా 7వతేదీతో ముగియనుంది. కార్పొరేషన్ల డైరెక్టర్లు, ఛైర్మన్లుగా ఉండి బీసీలకు పైసా ఖర్చుపెట్టకుండా దిగిపోయిన వ్యక్తులుగా జగన్ ప్రభుత్వం వారికి ప్రపంచంలో ఎక్కడాలేని గుర్తింపునిచ్చింది.

బీసీ కార్పొరేషన్ల ఛైర్మన్లు, డైరెక్టర్లకే అంతగొప్ప అవకాశమిస్తే, జగన్ రెడ్డి సాదాసీదా బీసీలను ఎంతబాగా ఉద్ధరిస్తాడో ప్రత్యేకంగా చెప్పాలా? స్థానిక సంస్థల పదవులు కూడా బీసీలకు దక్కకుండా, వారి కుర్చీల్లో కూర్చొని తనవర్గం వారే పెత్తనం చేస్తున్నా, జగన్ రెడ్డి స్పందిం చడు. బీసీల అభ్యున్నతికోసం కేంద్రప్రభుత్వమిచ్చే నిధుల్ని కూడా జగన్ రెడ్డే నొక్కేస్తు న్నాడు. ఆఖరికి ప్రజలఓట్లతో గెలిచిన ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్పంచ్ లు, స్థానికప్రజాప్రతినిధులు ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో, ప్రజలకు ముఖం చూపించలేక కూలీపనులకు వెళుతు న్నారు. బీసీరిజర్వేషన్లు ఎత్తేసిన జగన్ రెడ్డి, తద్వారా16,800 మందికి రాజ్యాధికారం దూరం చేసి, వికృతానందంపొందుతూ, తిరిగి వారిని ఉద్ధరిస్తున్నట్టు మాట్లాడుతున్నాడు.

బీసీలను బానిసలుగా మార్చాలన్నదే జగన్ ధ్యేయం…
తెలుగుదేశం పార్టీలోని బీసీ నేతలపై జగన్ రెడ్డికి చెప్పలేనంత కక్షా, ఈర్ష్యాద్వేషాలున్నాయి. కాబట్టే నాతోసహా టీడీపీలో కీలకనేతలైన అచ్చెన్నాయుడు, యనమల రామకృష్ణుడు, అయ్యన్నపాత్రుడిపై తప్పుడుకేసులు పెట్టిస్తూ, నిత్యం పైశాచిక ఆనందం పొందుతున్నాడు. బీసీనేతల్ని, బీసీలను బానిసలుగా మార్చి అణగదొక్కాలనిచూస్తున్న జగన్ రెడ్డి ఏముఖం పెట్టుకొని బీసీ సభ పెడుతున్నాడు? తరతరాలుగా చెరువులపై మత్స్యకారులకు ఉన్న హక్కుల్ని జీవోనెం-217తో జగన్ ప్రభుత్వం కాలరాసినా బీసీ మంత్రులు నోరెత్తరు. రాష్ట్రంలో ఉన్న రజక, నాయూబ్రాహ్మణ, చేనేతసోదరులెంత మంది? ఎంత మందికి ప్రభుత్వం సాయం అందిస్తోంది? కరెంట్ బిల్లు ఎక్కువచ్చిందని, నాలుగు చక్రాల వాహనముందని, ఇంటివిస్తీర్ణం ఎక్కువనే కుంటిసాకులతో అర్హులైనవారికి కూడా అన్యాయం చేస్తున్నారు. బీసీ చిన్నారుల్ని విద్యకుదూరంచేస్తూ, బీసీకాలనీల్లోని పాఠశాలల్ని మూసేయించారు.

బీసీ విద్యార్థులకు చంద్రబాబు అమలు చేసిన పథకాలెక్కడ జగన్ రెడ్డి?
జగన్ రెడ్డి చెబుతున్న విద్యాకానుక భారీ హోర్డింగ్ లు, పత్రికాప్రకటనలకే పరిమితమైంది తప్ప, బీసీవిద్యార్థులకు చేరడంలేదు. టీడీపీప్రభుత్వం 16లక్షలమంది విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ ఇస్తే, జగన్ రెడ్డి ఆసంఖ్యను 10లక్షలకు కుదించాడు. 6 లక్షలమంది విద్యార్థులు ఒకేసారి ఎలా అర్హత కోల్పోయారో ముఖ్యమంత్రి సమాధానంచెప్పాలి. బీసీ మంత్రులు పదవుల కక్కుర్తితో సొంత వర్గాలనే జగన్ రెడ్డి కాళ్లదగ్గర తాకట్టుపెట్టారు. బీసీలకు తాము ఇదిచేశామని చెప్పుకోలేని దుస్థితిలో బీసీమంత్రులు, వైసీపీప్రభుత్వం ఉందికాబట్టే, ఆఖరికి బీసీ సభపేరుని కూడా కాపీకొట్టింది. ‘‘జయహో బీసీ’’ అనేది టీడీపీ నినాదం. బీసీలను ఉద్ధరిస్తున్నానంటూ బటన్ నొక్కుడు కార్యక్రమాలతో వారిని వంచిస్తున్న జగన్ రెడ్డికి బీసీలంతా ఏకతాటిపై నిలిచి తామేమి టోచూపించే రోజుదగ్గర్లోనే ఉంది. వైసీపీ ప్రభుత్వంలో తమకు జరుగుతున్న దగా, మోసం, అన్యాయానికి ప్రతీకారంగా ‘‘బీసీలంతా ఏకమై జగన్ రెడ్డి పీకనొక్కడం ఖాయం” అని రవీంద్ర హెచ్చరించారు.

Leave a Reply