• తుగ్లక్ నిర్ణయాలను ఎత్తిచూపారన్న అక్కసుతో జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 లపై కక్షకట్టాడు
• జగన్ కుటుంబం యొక్క 60 ఏళ్ల రక్తచరిత్ర ప్రజలకు తెలియచేసిందనే ఆయన, ఆయన తండ్రి ఈనాడుపై కక్షకట్టారు
• పాదయాత్ర సమయంలో రాజశేఖర్ రెడ్డిని ప్రజానాయకుడికి ప్రజలకు పరిచయం చేసిన ఆంధ్రజ్యోతి తర్వాత ఆయనకు నచ్చకుండా పోవడానికి కారణం, ఆయన అవినీతిని ప్రశ్నించడమే
• జగన్ పార్టీ పెట్టినప్పుడు విస్తృతమైన కవరేజ్ ఇచ్చిన టీవీ-5 ఛానల్, నేడు జగన్ ఆగ్రహానికి గురికావడానికి కారణం.. అమరావతి ఉద్యమానికి అండగా నిలవడమే
• జగన్ ముఖ్యమంత్రిగా దిగిపోయేలోపు తానంటే గిట్టని పత్రికలు, ఛానళ్లను పిలిచి ఒక్క మీడియాసమావేశమైనా నిర్వహించి, తాను ఎవరికి భయపడనని నిరూపించుకోవాలి
• ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకం జగన్ కు ఉంటే, ఆయన ఒంటరిగా పోరాడే పులే అయితే తనకు గిట్టని మీడియా సంస్థల్ని స్వేచ్ఛగా పనిచేసుకోనివ్వాలి
– టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు
మంగళగిరి : వైసీపీప్రభుత్వంలో మీడియాపై జరుగుతున్న దాడులు ప్రస్తుతం రాష్ట్రంలో చర్చనీ యాంశంగా మారాయని, జగన్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటినుంచీ ప్రతిపక్షాల కంటే ఎక్కువగా మీడియాను టార్గెట్ చేశారని, ఏ సభలో, ఏ సంద ర్భంలో మాట్లాడినా ఆయన మీడియాసంస్థల్ని, చంద్రబాబుని, పవన్ కల్యాణ్ ను అనకుండా ఊరుకోవడం లేదని టీడీపీ నేత కొలికపూడి శ్రీనివాసరావు తెలిపారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి గానీ, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గానీ ప్రత్యేకంగా మీడియా సంస్థల్నే టార్గెట్ చేయడం వెనక దాగిన వాస్తవాలు ఇప్పటి తరానికి తెలియాల్సి ఉందని శ్రీనివాసరావు అభిప్రాయపడ్డారు.
జగన్ కుటుంబం యొక్క 60 ఏళ్ల రక్తచరిత్ర ప్రజలకు తెలియచేసిందనే ఆయన, ఆయన తండ్రి ఈనాడుపై కక్షకట్టారు
జగన్ కుటుంబానిది దాదాపు 60ఏళ్ల రక్తచరిత్ర. జగన్ తాత రాజారెడ్డి కడప జిల్లా రైల్వేకోడూరు సమీపంలో మంగంపేట బైరటీస్ గనుల యజమానిని మోసగించి, అతన్ని హత్యచేసి, ఆ గనులకు యజమాని అయిన వైనాన్ని ఆనాడే ఈనాడు పత్రిక ప్రపంచానికి తెలియచేసిందని శ్రీనివాసరావు చెప్పారు. ఆ విధంగా జగన్ కూడా నేడు దేశంలో అత్యంత ధనికుడైన వ్యక్తిగా ఎలా ఎదిగాడనే విషయాన్ని కూడా వాస్తవాలతో సహా ఈనాడు పత్రిక ప్రజలకు తెలియచేసిందన్నారు.
ఆ పత్రికతో పాటు సభాసంఘం వేసిన నటరాజన్ కమిటీ తేల్చిన నిజాలను కూడా బయటపెట్టిందని, 2004 ఎన్నికలనాటికి హైదరాబాద్ లో ఉన్న ఒకే ఒక్క ఇంటిని అమ్మితే తప్ప గడవని స్థితిలో ఉన్న జగన్ రెడ్డి నేడు లక్షలకోట్లకు ఎలా అధిపతి అయ్యాడు..దానివెనకున్న గుట్టుమట్లను బాధ్యతగల సంస్థగా, జర్నలిజం విలువలకు కట్టుబడి ఈనాడు బహిర్గత పరిచిందన్నారు.
ఒక పత్రిక గా ఈనాడు తనపని తాను చేస్తుండటంతో జగన్ తండ్రి రాజశేఖర్ రెడ్డి మార్గదర్శి ని టార్గెట్ చేసి, మార్గదర్శిపై దుష్ప్రచారంచేసి, ప్రజల్లో ఆ సంస్థకు ఉన్న నమ్మ కాన్ని వమ్ముచేయడానికి ప్రయత్నించాడన్నారు. ఈ క్రమంలో జగన్ ఆంధ్రజ్యో తి పత్రికను ఎందుకు లక్ష్యం చేసుకున్నాడో కూడా ప్రజలు ఆలోచించాలన్నారు.
గతంలో రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడు ఆంధ్రజ్యోతి పత్రిక ఆయనకున్న ఫ్యాక్షనిస్ట్ ఇమేజ్ ను చెరిపేస్తూ నిష్పక్షపాతంగా ప్రజా నాయకుడిగా చిత్రీకరించిం దన్నారు. ఆనాడు రాజశేఖర్ రెడ్డి చేసిన మంచిని చెప్పినట్టే, తర్వాత ఆయన చేసిన తప్పుల్ని, అవినీతినికూడా ఆంధ్రజ్యోతి ఎప్పటికప్పుడు ప్రజల ముందు ఉంచిందన్నారు.
జగన్ కు ధైర్యముంటే, ఎన్నికల్లో గెలుస్తాననే నమ్మకముంటే, ఆయనకు ఇష్టం లేని పత్రికాసంస్థల్ని, ఛానళ్లను అడ్డుకోకుండా వాటిపని వాటిని చేసుకోనివ్వాలి
ఏ మీడియాను అయితే జగన్ టార్గెట్ చేస్తున్నాడో, ఆ మీడియా వాస్తవాలు రాస్తోంది.. ఆయన అవినీతిని బయటపెడుతోందనే ధృడమైన అభిప్రాయం ప్రజల్లో నాటుకుపోయిందన్నారు. ఏబీఎన్ ఛానల్, ఆంధ్రజ్యోతితో పాటు, ఈనాడు పత్రిక , రామోజీరావు ప్రజలకోసం మంచిచేసిన వారిపక్కన నిలిచారన్నారు. జగన్మోహన్ రెడ్డి తొలుత పార్టీ పెట్టినప్పుడు నేడు ఆయన ఆడిపోసుకుంటున్న టీవీ-5 ఛానల్ విస్తృతమైన కవరేజ్ చేసిందన్నారు. అలాంటి మీడియాను నేడు జగన్ టార్గెట్ చేయడం వెనకున్న ప్రధానకారణం ఆయన తీసుకున్న మూడురాజధానుల నిర్ణ యాన్ని ఆయా మీడియాసంస్థలు వ్యతిరేకించడమేనని, అమరావతి ఉద్యమాని కి అండగా నిలవడమేనని శ్రీనివాసరావు స్పష్టం చేశారు.
తన తుగ్లక్ విధానాల్ని ఉతికి ఆరేశాయనే నేటికీ జగన్ రెడ్డి, ఈనాడు..ఆంధ్రజ్యోతి..టీవీ-5 లపై కక్ష పూరితంగా వ్యవహరిస్తున్నాడన్నారు. జగన్ కు నిజంగా ధైర్యముంటే, ఆయన చెబుతున్నట్టుగా ఎన్నికలకు, ప్రతిపక్షాలతో పోటికీ సిద్ధమైతే, ఆయనకు ఇష్టం లేని పత్రికాసంస్థల్ని, ఛానళ్లను అడ్డుకోకుండా స్వేచ్ఛగా వాటి పని అవి చేసుకునే లా చూడాలని కొలికపూడి హితవుపలికారు. భవిష్యత్ లో వచ్చే ప్రభుత్వం జగన్ రెడ్డి మీడియాపై ఆయన మాదిరే కక్షసాధింపులకు పాల్పడితే ఎలా ఉంటుందో ఒక్కసారి ముఖ్యమంత్రి ఆలోచించుకోవాలన్నారు.
తన కుటుంబ అవినీతి, అరాచకాలను ఎప్పటికప్పుడు ప్రపంచానికి చూపిస్తున్నాయనే జగన్ రెడ్డి ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5లపై విషం కక్కుతున్నాడని శ్రీనివాసరావు తెలిపా రు. ప్రజల ముందు, బహిరంగసభల్లో మీడియాసంస్థలపై నిందలేస్తున్న జగన్ రెడ్డి.. ఆయన చెప్పే అబద్ధాలపై బహిరంగచర్చకు ఎందుకు రావడం లేదన్నారు?
నిజంగా రాష్ట్రాన్ని అభివృధ్ధి చేశాను.. ప్రజల్ని బాగుచేశాననే నమ్మకం జగన్ కు ఉంటే, చంద్రబాబు విసిరిన సవాల్ కు ఎందుకు స్పందించలేదు?
జగన్ రెడ్డి దేనికి సిద్ధం అంటున్నాడో ఆయనే చెప్పాలన్న కొలికపూడి, నిజంగా ప్రజల్ని బాగుచేసి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేశాననే నమ్మకం ముఖ్యమంత్రికి ఉంటే, చంద్రబాబు విసిరిన సవాల్ పై ఎందుకు స్పందించలేదని శ్రీనివాసరావు ప్రశ్నించా రు. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ-5 సంస్థలపై, ఆయా సంస్థల యాజమాన్యాలు, ప్రతినిధులపై తప్పుడు కేసులు పెట్టినంత మాత్రాన, వారిని వేధించినంత మాత్రా న జగన్ రెడ్డి చేసిన దోపిడీ, అవినీతి ప్రజలకు తెలియకుండా పోవని కొలికపూడి స్పష్టంచేశారు.
ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ రెడ్డి.. ప్రత్యక్షంగా ఒక్కరోజు కూడా మీడియా సమావేశం ఎందుకు నిర్వహించలేదో ఆయనే చెప్పాలన్నారు. జగన్ రెడ్డికి నిజంగా ధైర్యముంటే, ఆయన దిగిపోయేలోపు ఒక్క మీడియా సమావేశం అయినా నిర్వహించి, విలేకరులు అడిగే అన్నిప్రశ్నలకు సమాధానం చెప్పాలని శ్రీనివాసరావు ఛాలెంజ్ చేశారు.
జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది.. సామాజిక ఉన్మాది
జగన్మోహన్ రెడ్డి ఒక ఆర్థిక ఉగ్రవాది.. సామాజిక ఉన్మాది అని ప్రపంచానికి తెలియచేసింది ఈ మీడియానే అని, అతను అధికారంలోకి వస్తే జరగబోయే దుష్పరిణామాలను, ముఖ్యమంత్రి అయ్యాక చేసిన విధ్వంసం, అరాచకాలను, ప్రజలకు తెలియచేసింది ఆ మీడియానే అన్నారు. అధికారంలోకి వచ్చాక సొంతతల్లిని, చెల్లిని బయటకు గెంటేసిన జగన్ నైజాన్ని బట్టబయలుచేసింది ఈ మీడియానే అన్నారు.
జగన్ బాధితుల తరుపున, ఆయన్ని నమ్మి దారుణంగా మోసపోయిన ఎస్సీలు,ఎస్టీలు, బీసీలు ,మైనారిటీల తరుపున మాట్లాడుతున్న మీడియాసంస్థలు అంటేనే జగన్ కు గిట్టడం లేదన్నారు. అలాంటి మీడియాను నేరుగా ఎదుర్కోవాలంటే జగన్ రెడ్డికి భయమని శ్రీనివాసరావు ఎద్దేవా చేశారు.
టీడీపీ-జనసేన పార్టీలను చూసి ఎక్కువగా భయపడుతోంది జగన్మోహన్ రెడ్డేనని, ఆయన నిజంగా పులే అయితే తన హాయాంలో జరిగిన అభివృద్ధి, ప్రజలకు అందించిన సంక్షేమం, గత ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంపై విలేకరులతో నేరుగా మాట్లాడి, వారు అడితే ప్రతిప్రశ్నకు కచ్చితమైన సమాధానం చెప్పాలని కొలికపూడి సూచించారు.