Suryaa.co.in

Andhra Pradesh

అధికారంలో ఉండే హక్కు బీజేపీకి లేదు

– ప్రకాష్ నగర్లో ప్రారంభమైన సిపిఎం జన శంఖారావం
– 61, 62, 63,64 డివిజన్లో పర్యటన
– శంఖారావాన్ని ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావు

కేంద్ర ప్రభుత్వం ప్రజా రంజిక పాలన అందించడంలో పూర్తిగా విఫలం చెందింది. ఉద్యోగాల భర్తీ చేయలేదు.దళితులను, మైనార్టీలను వివక్షకు గురిచేసి, వారిపై దాడులకు పూనుకుంటున్నది.

మరోపక్క కార్మిక చట్టాలను కాలరాస్తున్నది. నల్ల చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన చేస్తే కనీస మద్దతు ధర ప్రకటించలేదు. రెండోదఫా ఉద్యమం ప్రారంభిస్తే వారిపై దాడులు జరిపి ఒకరిని బలుకొన్నది. వందలాది మందిని గాయపరిచింది.

ఈ విధంగా దేశానికి, రైతులకు, దళితులకు, మైనార్టీలకు అన్యాయం చేసే బిజెపి అధికారంలో ఉండే హక్కు లేదు.2014లో అభివృద్ధి పేరుతో అధికారంలోకి వచ్చిన మోడీ ఇప్పుడు అభివృద్ధి ఊసే ఎత్తడం లేదు. మతతత్వం, అయోధ్య రామాలయం చుట్టూ ప్రజలను తిప్పుతున్నారు. చివరికి దైవాన్ని కూడా రాజకీయాలు ఉపయోగించుకుని పబ్బం కడుక్కుంటున్నారు. పెరిగిన ధరల బారాలతో ప్రజలు అల్లాడుతున్నారు.

ఈ విధానాలపై రాష్ట్రంలోని అధికార, ప్రతిపక్ష పార్టీలు నోరు మెదపడం లేదు.హైదరాబాదును అభివృద్ధి చేశానని చెప్పే చంద్రబాబు నోరు మెదకపోగా బిజెపితో జతకట్టడం దుర్మార్గం.

కమ్యూనిస్టులు పోరాటాల ద్వారానే నిజాం పరిపాలన అనంతరం హైదరాబాద్ అభివృద్ధి చెందింది అనేది వాస్తవం.రాష్ట్రాన్ని అన్ని విధాల నాశనం చేసిన బిజెపి దాని, మిత్రపక్షలను రాబోయే ఎన్నికల్లో ఓడించాలి.

బాబురావు మాట్లాడుతూ…..ఈ కాలంలో ఏమి చేసారో చెప్పుకోలేక వాలంటీర్ల ద్వారా కుక్కర్ల పంపిణీ చేస్తున్నారు.వారు కుక్కర్లను నమ్ముకుంటే, మేము జనాన్ని నమ్ముకున్నామని. వారు డబ్బు నమ్ముకుంటే, మేము ప్రజా సేవలు నమ్ముకున్నాము.ఈ కాలంలో అధికారం వెలగబెట్టిన ప్రజా ప్రతినిధులు మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయకపోగా, తమ సొంత ఆస్తులను అభివృద్ధి చేస్తున్నారు.

సి.పి.ఐ నగర కార్యదర్శి జి.కోటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రంలో వైసిపి, టిడిపి, జనసేన విధానాలు ఒకటే అని పేద మధ్యతరగతి ప్రజలు ను వివిధ రూపాల్లో దోచుకోవటమే వారి లక్ష్యం ఎజెండాని, కేంద్రంలో బిజెపి చేతిలో వీరు కీలుబొమ్మలని దేశంలో రాష్ట్రంలో అభివృద్ధి శూన్యమని ఆయన అన్నారు.

నిత్యం ప్రజలకు అండగా ఉండి ప్రజా సమస్యల మీద పనిచేసే కమ్యూనిస్టులను ప్రజలందరూ ఆదరించాలని సెంట్రల్ నియోజకవర్గం లో గత తొమ్మిదిన్నర సంవత్సరాలలో ఆరు పార్టీలు మారిన వ్యక్తి వల్ల ఎటువంటి ఉపయోగం లేదని. సెంట్రల్ నియోజకవర్గం అభివృద్ధి చెందాలి అంటే సిపిఎం అభ్యర్థిని గెలిపించుకోవాలని ఆయన ప్రజలకు పిలుపునిచ్చారు.

సిపిఎం పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యులు దోనేపూడి కాశీనాథ్, ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి డివి కృష్ణ, రాష్ట్ర కమిటీ సభ్యురాలు కె.శ్రీదేవి, ఎన్టీఆర్ జిల్లా కార్యవర్గ సభ్యులు యన్.సిహెచ్ శ్రీనివాస్,కోట కళ్యాణ్, బి.సత్య బాబు, జిల్లా కమిటీ సభ్యులు కె.దుర్గారావు ,భూపతి రమణ రావు, కృష్ణ, టి.ప్రవీణ్ ,నగర కమిటీ సభ్యులు చింతల శ్రీను, వై,సుబ్బారావు, ఎం.సీతారాములు, ఝాన్సీ, ఎస్.కె పేరు, సుజాత, యన్.నాగేశ్వరరావు యం.బాబురావు ఎస్.కె నిజాముద్దీన్ వెం తదితరులు పాల్గొన్నారు.

LEAVE A RESPONSE