– ప్రగతిభవన్ లో మంత్రి హరీష్ రావుతో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
ఎమ్మెల్యేల కొనుగోలుపై ఖచ్చితంగా విచారణ జరుగుతుంది. నిజానిజాలు తొందరలోనే బయటపడుతాయి. ఎవరు ఎన్ని అడ్డంకులు సృష్టించినా విచారణ అగదు.ప్రజాస్వామ్యాన్ని కించపరిచేలా బీజేపీ దేశాన్ని పాలిస్తున్నది.ఉత్తమమైన పరిపాలన చేసినప్పుడు ఉత్తమమైన ఫలాలు అందుతాయి. మన రాష్ట్రంలో ఇప్పుడు ప్రజాస్వామ్య పాలన నడుస్తున్నది.ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను పక్కకు పెట్టి బీజేపీ పదుల సంఖ్యలో అక్కడి ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాలను కూల్చి బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటు చేస్తున్నది.మన రాష్ట్రంలో బీజేపీ చేస్తున్న చర్యలను చూస్తున్నాము.వందల కోట్లు ఖర్చు పెట్టి ఎమ్మేల్యే లను కొనుగోలు చేయాలని చూసింది.
ఎమ్మెల్యేల కొనుగోలు విషయంలో మాకు సంబంధం లేదని చెప్పి తడి బట్టలతో దేవుడి దగ్గరికి వెళ్ళారు.బీజేపీ వాళ్ళ కు సంబంధం లేకపోతే కోర్టు వెళ్లి సిట్ విచారణ ఆపాలని ఎందుకు కోరారు? బీజేపీ కి సంబంధం లేకపోతే మీ పార్టీ ప్రధాన కార్యదర్శి కోర్టు కి ఎందుకు వెళ్లాడు ?ఎమ్మెల్యే ల కొనుగోలు విషయంలో వాస్తవాలు బయటికి రావాలని సిట్ వేశాము.