-ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ కు మోడీ ఎం చేశారో చెప్పాలి
-బీజేపీ నేతలకు మాట ఇచ్చి తప్పడం అలవాటు
-చెట్లు పెట్టేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా?
-తెలంగాణ లో 800 కోట్ల రూపాయలు కోత విధించింది
-మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
ప్రధాని మోడీ తెలంగాణ కు రావడాన్ని మేము తప్పు బట్టడం లేదు.. అయితే ఈ ఎనిమిదేళ్లలో తెలంగాణ కు మోడీ ఎం చేశారో చెప్పాలి.పునర్ .విభజన చట్టం లోని హామీలు కూడా నెరవేర్చని వ్యక్తి మోడీ. బీజేపీ నేతలకు మాట ఇచ్చి తప్పడం అలవాటు.వివిధ ఎన్నికల సందర్భంగా బండి సంజయ్ ఏమన్నాడో ఆ తర్వాత ఏ విధంగా మాట తప్పారో చూశాం.
మా మంత్రిత్వ శాఖ పని తీరు కు కేంద్ర ప్రభుత్వం నుంచి అవార్డులు వచ్చాయి.. కానీ నిధులు రాలేవు.పని చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇవ్వకుండా కోత విధిస్తోంది కేంద్ర ప్రభుత్వం.వెయ్యి కోట్ల రూపాయల దాకా కోత విధించింది.ఉపాధి హామీ పథకానికి కూడా కేంద్ర ప్రభుత్వం తూట్లు పొడుస్తోంది.ఉపాధి హామీ పథకం లో లోపాలు వెతికి పట్టు కునేందుకు 18 కేంద్ర బృందాలు వచ్చాయి. ఆ బృందాలు అన్ని బాగున్నాయి అని ప్రశంసించింది.. అయితే పనుల కు అనుమతులు తీసుకోలేదు అన్నాయి.
చెట్లు పెట్టేందుకు కేంద్రం అనుమతి తీసుకోవాలా?తెలంగాణ లో పథకాలకు కేంద్రం అడ్డుపుల్లలు వేస్తోంది. ఉపాధి హామీ పధకానికి 70 వేల కోట్ల రూపాయల కోత విధించింది. తెలంగాణ లో 800 కోట్ల రూపాయలు కోత విధించింది.తెలంగాణ కు ఇంతగా మోసం చేసిన మోడీ ఏ మొహం పెట్టుకుని రాష్ట్రానికి వస్తున్నారు.
2014 లో ప్రధాని కాకముందు ఎల్బీ స్టేడియంలో పెట్టిన సమావేశం లో మోడీ పక్కన నేనున్నాను.అపుడు మోడీ 450 రూపాయలు ఉన్న గ్యాస్ సిలిండర్ ధరను 200 చేస్తామని హామీ ఇచ్చారు..200 చేయక పోగా పీఎం అయ్యాక 1200 రూపాయలకు పెంచారు.అన్ని హామీల విషయం లో మోడీ ది ఇదే వైఖరి. బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కోసం గతం లో ధర్నా చేసిన బీజేపీ కిషన్ రెడ్డి ఇపుడు సాధ్యం కాదంటారాగిరిజన విశ్వ విద్యాలయం విషయం లోనూ బీజేపీ ది మోస పూరిత వైఖరి.ఇన్ని మోసాలు చేస్తున్న మోడీ తెలంగాణ కు ఏ ముఖం పెట్టుకుని వస్తారు?మునుగోడు లో బీజేపీ కి ప్రజలు గట్టి బుద్ది చెప్పారు.
కేసీఆర్ ను వేరే రాష్ట్రాలకు తిరగనివ్వొద్దని బీజేపీ కుట్ర పన్ని కక్ష కట్టింది.తెలంగాణ ను బీజేపీ అన్ని రకాలుగా వేధిస్తోంది.ఎమ్మెల్యేలకు ఎర కేసులో బీజేపీ కి సంబంధం లేకుంటే సిట్ వద్దని హై కోర్టు కు ఎందుకు వెళ్లారు.ప్రధాని మోడీ పై భాదితులు గా ఉన్న ప్రజలే నిరసన గళ మెత్తుతారు.మోడీ లో అన్ని వర్గాల ప్రజలు నష్టపోయారు వాళ్లే తిరగబడతారు.గవర్నర్ గవర్నర్ లాగా ఉండాలి.. రాజకీయాలు చేయొద్దు.