Suryaa.co.in

Features

తైవాన్ దేశస్తులు భారతీయులను ఎందుకు ద్వేషిస్తారు?

తైవాన్ లో ఒక ఏడాది పాటు గడిపిన ఒక భారతీయునికి చాలా మంది తైవాన్ ప్రజలు స్నేహితులయ్యారు. కానీ వాళ్ళు అతనితో సన్నిహితంగా ఉండకపోవడం అతను గమనించాడు. అతని స్నేహితులెవరూ ఏ రోజూ అతనిని తమ ఇంటికి పిలిచి టీ ఇచ్చిన పాపాన పోలేదు.

ఇదంతా అతనికి వింతగా అనిపించింది. తనతో ఎక్కువగా మాట్లాడే ఒక స్నేహితుడిని ఈ సంగతి అడిగాడు. తన భారతీయ మిత్రుని గోడు విన్న ఆ తైవాన్ స్నేహితుడు ముందుగా కొంచెం తటపటాయించి, చివరికి అసలు విషయం చెప్పాడు. అది విన్న మన భారతీయుడు ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యాడు.

తైవాన్ మిత్రుడు భారతీయుణ్ణి అడిగిన ప్రశ్న:
‘‘200 సంవత్సరాల పాటు భారత దేశంలో ఎంత మంది బ్రిటిషర్లు ఉన్నారు బహుశా 10 వేల మంది ఉండి ఉండవచ్చు’’ బదులిచ్చాడు భారతీయుడు ‘‘మరి 32 కోట్ల మంది భారతీయులను హింసించింది ఎవరు?వాళ్ళందరూ భారతీయులే కదా? ఔనంటావా?

నిరాయుధులుగా ఉన్న 1300 మందిని కాల్చిపారేయమని జనరల్ డయ్యర్ ఆదేశించాడు. అప్పడు కాల్పులు జరిపింది బ్రిటిష్ ఆర్మీ కాదు. అంత మంది భారతీయ సిపాయిలలో ఒక్కడైనా తన తుపాకిని జనరల్ డయ్యర్ మీద గురిపెట్టి అతన్ని ఎందుకు చంపలేకపోయాడు అడిగాడు తైవాన్ స్నేహితుడు మరో ప్రశ్న అడిగాడు తైవాన్ స్నేహితుడు ఎంత మంది మొఘలులు భారత దేశానికొచ్చారు? వాళ్ళు ఎన్ని సంవత్సరాల పాటు భారత దేశాన్ని పరిపాలించారు?

భారతీయులను తమ బానిసలుగా భావించారు. మీలోనే కొందరిని మతం మార్చి మీకు వ్యతిరేకంగా పోరాడేలా చేసారు. మీలోనే కొందరు డబ్బు కోసం కక్కుర్తి పడి సాటి దేశస్తులను హింసించారు. తమ సాటివారితోనే అనుచితంగా ప్రవర్తించారు. కాబట్టి మిత్రుడా, మీ ప్రజలే శతాబ్దాల పాటు మీ ప్రజల్ని చంపుతూ వచ్చారు. కేవలం డబ్బు కోసం. మీలాంటి స్వార్ధపరులు, మోసగాళ్ళు, విద్రోహులు, అల్ప బుద్ధులు, శత్రువులతో స్నేహం చేసి, తమ వారికే ద్రోహం చేసే మనస్తత్వం ఉన్నవారిని మా దేశస్తులు ద్వేషిస్తారు’’ అన్నాడు

మరో విషయం చెప్పాడు తైవానీయుడు. ‘‘బ్రిటిషర్లు హాంగ్ కాంగ్ ని స్వాధీనం చేసుకొన్నప్పుడు ఒక్క స్థానికుడు కూడా సైన్యంలో చేరలేదు. తమ వారి మీదే పోరాడే నీచమైన మనస్తత్వం వారికి లేదు.

కపట మనస్తత్వం కలిగిన చాలా మంది భారతీయులు ఎప్పుడూ డబ్బులకు అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉంటారు. ముందూ వెనకా ఆలోచించరు’’

‘‘అదే మనస్తత్వం ఇప్పటికీ భారతదేశంలో కొనసాగుతోంది. తమ సొంత ప్రయోజనాల కోసం విపక్షాలు దేశద్రోహ చర్యలకు పాల్పడేందుకు, జాతి వ్యతిరేక కార్యకలపాలకు ఉతమిచ్చేందుకు వెనుకాడరు. భారతీయుల్లో అత్యధికులు దేశానికి రెండవ ప్రాధాన్యత ఇస్తారు. మీకు మీరూ మీ కుటుంబం ప్రధానం. సమాజం, దేశం ఏమైపోయినా సరే మీకు బాధనిపించదు’’ అని ముగించాడు తైవాన్ దేశస్తుడు. ఇది మనకెవరికీ మింగుడు పడని చేదు నిజం.

– చోళ్లేటి మహేష్‌బాబు

LEAVE A RESPONSE