Suryaa.co.in

Family

ప్రయాణంలోని ఆనందం గమ్యంలో ఉండదు..

ప్రపంచంలో చెప్పిన ఫిలాసఫీలన్నీ కూడా వాడి కంఫర్ట్ & రిలాక్స్ జోన్ కోసమే..ఆ రాసిన వాడు చెప్పినవాళ్ళు ఇతరుల కోసం అని భ్రమింప చేస్తారు
ఎందుకంటే అందులోకూడా వాడికి ఆనందం కలుగుతుంది..

ఎవరికి ఏ రకమైన కిక్కు కావాలో దానికి ఏ రకమైన మందు వాడాలో ఆల్కహాల్ అమ్మే షాపులోని మద్యం సీసా లేబిల్స్ మీద రాసి ఉండదు ..అవి నీ మనసు అనే మాదకద్రవ్యానికి తప్ప మరెవ్వరికీ తెలియవు.

ఆనందం ఆహ్లాదం భ్రమ భ్రాంతి భయం ఆందోళన గౌరవం ఖ్యాతి ఇవన్నీ అనుభవించనంతవరకు కేవలం పదాలే…అన్నీ అనుభవించాక మళ్ళీ ఇలాంటిదే ఇంకేదో కొత్తది ఉందనుకొని వెతకటం..! నిరంతరం మీ జీవితం ఇలా సాగుతూనే ఉంటుంది సాగనివ్వండి..ఆగితేనే అలజడులు..
నిరంతర ప్రయాణికుడుకి ఆనందమే కానీ అలసట ఉండదు…

అంతా ఉంది ఏమీ లేదు.. ఇదే లైఫ్..!

– మధుసుధనేను

LEAVE A RESPONSE