Suryaa.co.in

Features

ఎందుకు ఓటు వేశావని చెంప పగల కొట్టాలనిపిస్తుంది!

నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంది.
ఓటు- ముందు కు అమ్ముడుపోయిన మీ వల్ల నాలాంటోళ్లు ఎందుకు ఇబ్బంది పడాలి అని!
నిత్యావసర సరుకుల ధరలు పెరిగినపుడు
మనం పన్ను రూపంలో కట్టే సొమ్ముని వాళ్ళ పబ్లిసిటీ కోసం వాడుకున్నప్పుడు
ఊరిలో ఉన్న ప్రెసిడెంట్,MLA, MP లు మన కష్టాలు కూడా వినడానికి మనల్ని దగ్గరకి రానివ్వనప్పుడు

సొంత ఊరికి దగ్గర్లో ఏదైనా పని చేసుకుందాం అనుకున్నప్పుడు, అసలు మనకు దగ్గర్లో ఏ పరిశ్రమ లేదు అని గుర్తొచ్చినప్పుడు
ఒక మంత్రి గుడికి వచ్చాడు అని ఆ గుడిలో దర్శనం కోసం గంటల నుండి ఎదురుచూస్తున్న భక్తులను ఇబ్బంది పెట్టినప్పుడు
గుళ్లలో కనీస వసతులు లేనప్పుడు
తమ పబ్లిసిటీ కోసం ప్రజల ప్రాణాలు పణంగా పెట్టినప్పుడు
వాళ్ళ వాళ్ళ ఈగోల కోసం సామాన్యుడిని ఇబ్బంది పెట్టినప్పుడు
ఒక మంత్రి కాన్వాయ్ కోసం అంబులెన్స్ తో సహా రోడ్ మీద ఉన్న వాహనాలు అన్ని ఒక్కసారిగా ఆపేస్తే సమయానికి వైద్యం అందక ఆ అంబులెన్స్ లో ఉన్న ప్రాణం ఆగినప్పుడు

ఒక ఆడబిడ్డకు అన్యాయం జరిగితే ఆ ఆడబిడ్డకి న్యాయం జరగనప్పుడు
ఒక ప్రమాదంలో ఒక సామాన్యుడు మరణిస్తే ఆ సామాన్యుడికి జరగాల్సిన న్యాయం జరగనప్పుడు

అన్నం పెట్టే రైతుకు గిట్టుబాటు ధర రాక ఆత్మహత్య కు పాల్పడితే , న్యాయం చేయడానికి ప్రభుత్వం తరపున ఎవరూ రానప్పుడు
ఏళ్ల నుండి సాగుతున్న ప్రాజెక్ట్స్ పేరు చెప్పి డబ్బు మెక్కడం తప్ప ఆ ప్రాజెక్ట్స్ పూర్తి చేసి జనాలకి మంచి చెయ్యనప్పుడు
వాళ్ళు చేసే అరాచక పాలన మీద ప్రశ్నించిన వ్యక్తుల మీద వ్యక్తిగత దూషణ, భౌతిక దాడులు చేసినప్పుడు

అప్పుడు అనిపిస్తుంది.. వాళ్ళకి వోట్ వేసిన ప్రతి ఒక్కడిని కాలర్ పట్టుకుని.. ఎందుకు ఓటు వేశావ్ అని అని అడిగి చెంప పగిలేలా కొట్టాలి అని
కానీ నేనూ ఒక సామాన్యుడినే గా…

నిజాయితీపరుడికి ఓటు వేసి మార్పు కోసం ఎదురు చూడడటం తప్ప.. ఏమీ చేయలేక ఎదురు చూస్తూ ఉండిపోయా!

– రామారావు మాచవరపు

LEAVE A RESPONSE